GATE 2021: గేట్ రాయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ తేదీల్లో మార్పు!

GATE 2021: గేట్ పరీక్ష రాయాలని భావించి ఇంత వరకు రిజిస్టర్ కాని విద్యార్థులకు ఐఐటీ ముంబై గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్టోబర్7 వరకు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: September 30, 2020, 1:39 PM IST
GATE 2021: గేట్ రాయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.. ఆ తేదీల్లో మార్పు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
GATE-2021 రాయాలనుకుని ఇంత వరకు రిజిస్టర్ కాని విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్ష రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని అక్టోబర్7 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ఫీజుతోనే అక్టోబర్ 7 వరకు దరఖాస్తులు అంగీకరిస్తామని ఓ ప్రకటనలో ఐఐటీ బాంబే స్పష్టం చేసింది. మొదట ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 30 ఆఖరు తేదీగా ప్రకటించారు. అయితే ఈ తేదీని పొడిగించాలని విద్యార్థుల నుంచి అనేక అభ్యర్థనలు రావడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అదనపు రుసుంతో దరఖాస్తు చేసుకునే ఆఖరు తేదీని సైతం అధికారులు పొడిగించారు. మొదట విడుదలైన షెడ్యూల్ లో అక్టోబర్ 1 నుంచి అదే నెల 7వ తేదీ వరకు అదనపు రుసుంతో ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. అయితే మార్చిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 8వరకు ఈ అదనపు ఫీజుతో గేట్ పరీక్షకు రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించారు.




గేట్ ఎగ్జామ్ ను వచ్చే సంవత్సరం(2021) ఫిబ్రవరిలో నిర్వహించనున్నారు. ఆరు రోజులు, 12 సెషన్లలో ఈ పరీక్ష జరగనుంది. ఫిబ్రవరి 5 నుంచి 7 వరకు, అదే నెల 12 నుంచి 14 వరకు ఈ పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష గురించి ముఖ్యమైన అప్ డేట్స్, ఇతర సమాచారం గురించి గేట్ 2021 వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.GATE 2021 రిజిస్ట్రేషన్ ఇలా..
-అధికారిక వెబ్ సైట్ gate.iitb.ac.in ఓపెన్ చేయాలి.
-అనంతరం GATE Online Application Processing System(GOAPS) ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-అనంతరం ‘register here’ పై క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
-కరెక్టు వివరాలతో ఫారం నింపాలి.
-అనంతరం రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్ వర్డ్ ను సేవ్ చేసుకోవాలి.
-ఫీజు చెల్లిస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది.
Published by: Nikhil Kumar S
First published: September 30, 2020, 1:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading