• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • GATE 2021 APPLICATION CORRECTION WINDOW TO OPEN FROM TODAY NS

GATE 2021: గేట్ అభ్యర్థులకు ముఖ్య సూచన.. అప్లికేషన్ లో ఆ వివరాలు మార్చుకునే ఛాన్స్

GATE 2021: గేట్ అభ్యర్థులకు ముఖ్య సూచన.. అప్లికేషన్ లో ఆ వివరాలు మార్చుకునే ఛాన్స్

ప్రతీకాత్మక చిత్రం

GATE 2021: గేట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై కీలక అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేస్తే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించింది.

  • Share this:
    గేట్-2021 పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇండియన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై కీలక అవకాశం కల్పించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదైనా తప్పులు చేస్తే సరి చేసుకునే అవకాశాన్ని కల్పించారు. దీంతో అభ్యర్థులు పరీక్ష రాసే సిటీ, కేటగిరీ, జెండర్, ఇతర వివరాలను మార్చుకునే అవకాశం ఏర్పడింది. ఈ మేరకు అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే.. పరీక్ష కేంద్రాన్ని ఉచితంగానే మార్చుకునే అవకాశం కల్పించారు. కేటగిరీ, జెండర్, పేపర్ మార్చుకోవడానికి ప్రత్యేక చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ కరెక్షన్ అవకాశం ఈ రోజు నుంచి నవంబర్ 13 వరకు ఉంటుంది. అయితే ఓకే సారి మాత్రమే అభ్యర్థులు తమ వివరాలను మార్చుకునే అవకాశం కల్పించారు. పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో ఉన్నాయి.
    GATE 2021 Application Correction Portal – Direct Link 

    నీట్ 2020 కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ కౌన్సిలింగ్‌లో ఆల్ ఇండియా కోటాలో 15 సాతం సీట్లను భర్తీ చేస్తారు. జిప్మర్, ఎయిమ్స్, సెంట్రల్, డీమ్డ్ యూనివర్సిటీలు ఆఫర్ చేసే సీట్లన్నీ ఇందులోకే వస్తాయి. మొదటి రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 అక్టోబర్ 27న మొదలవుతుంది. నవంబర్ 2 సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం నవంబర్ 2 రాత్రి 7 గంటల వరకు ఉంటుంది. మొదటి రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 2 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది.

    ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 2 సాయంత్రం 4 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 3, 4 తేదీల్లో పూర్తవుతుంది. ఫలితాలు నవంబర్ 5న విడుదలౌతాయి. 2020 నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది. నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.

    రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 23, 24 తేదీల్లో పూర్తవుతుంది. ఫలితాలు నవంబర్ 25న విడుదలవుతాయి. 2020 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మాప్ అప్ రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 డిసెంబర్ 10న మొదలవుతుంది. డిసెంబర్ 14 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: