హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

GATE Exam | ఏపీలో గేట్‌ ఆన్ లైన్ కోచింగ్... ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి...

GATE Exam | ఏపీలో గేట్‌ ఆన్ లైన్ కోచింగ్... ఇక్కడ రిజిస్టర్ చేసుకోండి...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

GATE కోసం ప్రిపేర్ అయ్యే వారికి ఆన్ లైన్ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించి ప్రభుత్వం అందుకు రంగం సిద్దం చేసింది. మే 11 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గేట్ పరీక్షకు ఆన్ లైన్ కోచింగ్‌ను ప్రారంభిస్తోంది. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశాలతో గేట్ ఆన్ లైన్ కోచింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, JNTU- అనంతపురం, JNTU - కాకినాడ, యోగి వేమన విశ్వవిద్యాలయం వైయస్ఆర్ కడప ఈ గేట్ కోచింగ్ నిర్వహిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారు, ఇంజీనీరింగ్ 3,4 వ సంవత్సర విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ / ఇన్ఫర్మేషన్ టెక్నోలో ఈ అవకాశం పొందవచ్చు. ప్రతి విద్యార్థికి రోజుకు రెండు సబ్జెక్టులు ఆన్‌లైన్ ద్వారా బోధిస్తారు. ఇద్దరు వేర్వేరు అధ్యాపకులు ఉంటారు. ఆన్‌లైన్ హాజరును పరిశీలిస్తారు.

ఇక్కడ వివరాలు డౌన్ లోడ్ చేసుకోవచ్చు

గేట్ కోచింగ్ రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరగతుల షెడ్యూల్ కో-ఆర్డినేటర్, సంబంధిత విద్యార్థులకు ఈ -మెయిల్ ద్వారా పంపిస్తారు.

దీనిపై ఏమైనా సందేహాలు ఉంటే gateonline@jntua.ac.in లో సంప్రదించవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభం : 2020 మే 2 వ తేదీ

రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 2020 మే 7

తరగతులు ప్రారంభం : 2020 మే 11

First published:

Tags: Andhra Pradesh, JOBS

ఉత్తమ కథలు