Home /News /jobs /

GARDEN REACH SHIPBUILDER AND ENGINEER LIMITED HAS RELEASED A NOTIFICATION FOR THE RECRUITMENT OF TRADE APPRENTICE AND OTHER POSTS VB

GRSE Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీ..  దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

GRSE Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీ..  దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

GRSE Recruitment 2022: ఇంటర్, డిగ్రీ అర్హతతో పలు ఉద్యోగాల భర్తీ..  దరఖాస్తు ప్రక్రియ ఇలా.. 

GRSE Recruitment 2022: గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ (GRSE)లో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వివరాలిలా.. 

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ (GRSE)లో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా..

పోస్ట్ పేరు: GRSE Ltd ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిస్

మొత్తం ఖాళీలు: 249

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ : 16-07-2022 మధ్యాహ్నం 2 గంటల నుంచి..

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 05-08-2022 రాత్రి 11.59 నిమిషాల వరకు.

TS EAMCET Exam Instructions: రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు.. విద్యార్థులకు కీలక సూచనలు చేసిన కన్వీనర్..


వయో పరిమితి..  14 సంవత్సరాలు నుంచి  20 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే ముందు ఇక్కడ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ  లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకొని దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఖాళీ వివరాలు


Sl.No              పోస్ట్ పేరు            మొత్తం        అర్హత

1.         ట్రేడ్ అప్రెంటిస్ (Ex-ITI)        163          AITT
2.        ట్రేడ్ అప్రెంటిస్ (ఫ్రెషర్)        40      10వ తరగతి  లేదా తత్సమానం
3.       గ్రాడ్యుయేట్ అప్రెంటిస్            16      డిగ్రీ (ఇంగ్లీషు/టెక్నాలజీ)
4.     టెక్నీషియన్ అప్రెంటిస్             30      డిప్లొమా (ఇంగ్లీషు)

మరో నోటిఫికేషన్ లో.. 

గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్ అండ్ ఇంజనీర్ లిమిటెడ్ (GRSE) కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్‌వైజర్, ఇంజనీర్ టెక్నీషియన్, డిజైన్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ప్రకటించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 58. వయోపరిమితి 28ఏళ్లకు మించకూడదు. రిజర్వేషన్ల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. సూపర్‌వైజర్ (SI గ్రేడ్) పోస్టుల ఖాళీలు 03 . అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవాలంటే.. CA/ CMA (ఇంటర్), గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేట్ డిప్లొమా, PG డిప్లొమా చేసి ఉండాలి.  ఇంజిన్ టెక్నీషియన్ (SI గ్రేడ్) పోస్టుల ఖాళీలు 08. ఇంజనీరింగ్ లో సంబంధిత సబ్జెక్ట్ లో డిప్లమా పూర్తి చేసి ఉండాలి. ఈ రెండు పోస్టులు శాశ్వత ప్రాతిపదికన నియమించుకోనున్నారు.
సూపర్ వైజర్ మరియు డిజైన్ అసిస్టెంట్ పోస్టులను తాత్కాళిక ప్రాతిపదికన తీసుకోనున్నారు.

సూపర్ వైజర్ పోస్టుల 30, డిజైన్ అసిస్టెంట్ పోస్టులు 17 ఖాళీగా ఉన్నాయి. గ్రాడ్యూయేషన్ డిప్లమా, పీజీ డిప్లమా చేసిన వాళ్లు ఈ పోస్టులకు అర్హులు.
దరఖాస్తు చేసుకునే ముందు ఇక్కడ రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. ఆ  లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  తర్వాత లాగిన్ ఆప్షన్ ఎంచుకొని దరఖాస్తును పూరించాల్సి ఉంటుంది. ఆ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నోటిఫికేషన్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, JOBS

తదుపరి వార్తలు