హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Central Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

Central Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 10 లాస్ట్ డేట్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గెయిల్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. సీనియర్ అసోసియేట్/జూనియర్ (టెక్నికల్) సహా 120 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు ఈ పోస్ట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ gailonline.comలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 10 నుంచి ప్రారంభం కానుంది.

ఖాళీల వివరాలు:

S.No.పోస్ట్ఖాళీలు
1.సీనియర్ అసోసియేట్ (టెక్నికల్)72
2.సీనియర్ అసోసియేట్ (ఫైర్ & సేఫ్టీ)12
3.సీనియర్ అసోసియేట్ (మార్కెటింగ్)06
4.సీనియర్ అసోసియేట్ (ఫైనాన్స్ & అకౌంట్స్)06
5.సీనియర్ అసోసియేట్02
6.సీనియర్ అసోసియేట్ (HR)06
7.జూనియర్ అసోసియేట్ (టెక్నికల్)16
మొత్తం పోస్టుల సంఖ్య:120

అర్హతల వివరాలు: వేర్వేరు ఖాళీలకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

Central Jobs: కేంద్రంలో 84,866 ఉద్యోగాలు .. విభాగాల వారీగా ఖాళీలు ఇలా..

వేతనం: సీనియర్ అసోసియేట్‌ గా ఎంపికైన వారికి నెలకు రూ. 60,000 వేతనం ఉంటుంది.

-జూనియర్ అసోసియేట్‌ గా ఎంపికైన వారికి నెలకు రూ. 40,000 వేతనం ఉంటుంది. వేతనంతో పాటు HRA, ఇతర అలవెన్సులు ఉంటాయి.

First published:

Tags: Central Government Jobs, Job notification, JOBS

ఉత్తమ కథలు