GAIL HAS INVITED APPLICATIONS TO RECRUIT EXECUTIVE TRAINEES THROUGH GATE 2021 SCORES NS
GAIL Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
నిరుద్యోగులకు ప్రముఖ GAIL సంస్థ శుభవార్త చెప్పింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిరుద్యోగులకు ప్రముఖ GAIL సంస్థ శుభవార్త చెప్పింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ విభాగంలో పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కెమికల్, ఇన్ట్ర్సుమెంటేషన్ విభాగాల్లో 25 ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది. కెమికల్, పెట్రో కెమికల్, కెమికల్ టెక్నాలజీ, పెట్రో కెమికల్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో 65 శాతం మార్కుల కన్నా ఎక్కువ సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. గేట్ స్కోర్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక నిర్వహించనున్నాట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 16లోగా అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
అభ్యర్థులు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసిన అనంతరం దానిని ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో ను దానికి అంటించాల్సి ఉంటుంది. సంతకం చేయాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన ఆ అప్లికేషన్ ఫామ్ ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. Apply Online-Direct Link
గేట్ పరీక్షలో అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేయబడతారు. ఇతర పూర్తి వివరాలను అభ్యర్థులు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే నాటికి గరిష్టంగా 26 ఏళ్ల వయస్సు ను కలిగి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.