• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • FULL DEMAND FOR IT PROFESSIONALS JOBS IN THESE SECTORS ARE INCREASED 300 PERCENT REVEALS INDEED DATA FULL DETAILS HERE HSN GH

IT jobs in India: భారత్ లో ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.. ఏఏ ఉద్యోగాల్లో పోస్టింగ్స్ పెరిగాయంటే.

IT jobs in India: భారత్ లో ఐటీ నిపుణులకు పెరుగుతున్న డిమాండ్.. ఏఏ ఉద్యోగాల్లో పోస్టింగ్స్ పెరిగాయంటే.

ప్రతీకాత్మక చిత్రం

మహమ్మారి తర్వాత ప్రపంచం డిజిటల్ వైపు మొగ్గు చూపేలా ఈ డేటా చూపిస్తుందని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ అన్నారు. టెక్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో పెరుగుదల..

  • Share this:
మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువవుతోంది. అందులోనూ నైపుణ్యం కలిగిన టెక్నికల్ ఉద్యోగాలైన అప్లికేషన్ డెవలపర్, లీడ్ కన్సల్టెంట్, సేల్స్ ఫోర్స్ డెవలపర్ సైట్ రిలయబులిటీ ఇంజినీర్ లాంటి పోస్టులకు డిమాండ్ 150 నుంచి 300 శాతం పెరిగిందని ఆన్ లైన్ జాబ్ సైట్ ఇండీడ్ స్పష్టం చేసింది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో ఈ ఉద్యోగాల పోస్టింగ్స్ పెరిగాయని తెలిపింది.

ఫీల్డ్ ఇంజినీర్లు, సేల్స్ పోస్టులకు తగ్గిన డిమాండ్..

సంస్థల్లో సాంకేతిక పరిష్కారలపై నిరంతరం ఆధారపడటం, ఇంటి నుంచే పని చేయడం, వ్యాపారాల్లో తమ సాంకేతిక మౌలిక సదుపాయలను పెంచడానికి, సున్నితమైన కార్యకలపాలను నిర్ధారించడానికి ఐటీ ఉద్యోగాల వృద్ధికి దారితీసింది. అయితే ఇదే సమయంలో ఫీల్డ్ ఇంజినీర్, సేల్స్ లీడ్ అండ్ ఎడిటర్ పోస్టుల్లో వృద్ధి మందగించిందని ఇండీడ్ డేటా పేర్కొంది. జనవరి 2020 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో ఈ పోస్టులకు 55 నుంచి 85 శాతం మేర డిమాండ్ తగ్గిందని స్పష్టం చేసింది.

మెట్రో నగరాల్లోనే ఎక్కువ..

భారత్ లో ముఖ్యమైన మెట్రో నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబయి, హైదరాబాద్, కోల్ కతా, పుణె, దిల్లీల్లో పోస్టింగులు ఎక్కువగా ఉన్నాయని ఈ ఆన్ లైన్ సైట్ తెలిపింది. రిటైల్, వ్యాపార అభివృద్ధి రంగాల్లో జాబ్ పోస్టులు కేంద్రీకృతమై ఉన్న కోల్ కతా మినహా ఈ నగరాలన్నింటీలోనూ టెక్ ఉద్యోగాల్లోనే వృద్ధి జరిగిందని పేర్కొంది. సామాజిక దూరం, ఆన్ లైన్ షాపింగ్ పై ఆధారపడటం వల్ల వినియోగదారులకు ఇంటర్ ఫేసింగ్ అవసరమయ్యే ఉద్యోగాలు గణనీయంగా తగ్గాయి. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్, లీస్ట్ సాట్ ఆఫ్టర్ కాలర్, సేల్స్ ప్రతినిధులు, సేల్స్ ఎగ్జిక్యూటీవ్స్ లాంటి పోస్టులు బాగా క్షీణించాయి.

భవిష్యత్తు డిజిటల్ వైపే..

మహమ్మారి తర్వాత ప్రపంచం డిజిటల్ వైపు మొగ్గు చూపేలా ఈ డేటా చూపిస్తుందని ఇండీడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ శశి కుమార్ అన్నారు. టెక్ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగాల్లో పెరుగుదల.. మహమ్మారి ముందు, తర్వాత.. రెండు కాలాల్లో స్థిరంగా ఉందని చెప్పారు. షాపింగ్, రిమోట్ వర్కింగ్, లెర్నింగ్ అవసరాలను తీర్చడానికి సాంకేతిక పరిష్కారాలపై నిరంతరం ఆధారపడటం అనేది పరిశ్రమలు, నగరాల్లో టెక్ డెవలపర్ల ప్రాముఖ్యతను విస్తరించిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆన్ లైన్ లో వ్యాపారాలు పెంచడం, పర్యావరణ వ్యవస్థలో వినియోగదారులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇతర సంస్థలను అనుసంధించడానికి పరిష్కారాలను అభివృద్ధి చేయడం వైపు దృష్టి కేంద్రీకరించడం టెక్ జాబ్ అవసరాలు సూచిస్తుంది.
First published:

అగ్ర కథనాలు