నిరుద్యోగులకు శుభవార్త. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రిన్సిపాల్ మేనేజర్, జాయింట్ డైరెక్టర్, మేనేజర్, డిప్యూటీ డైరెక్టర్, సీనియర్ మేనేజర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 38 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2021 ఏప్రిల్ 16న మొదలైంది. అప్లై చేయడానికి 2021 మే 15 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI అధికారిక వెబ్సైట్ https://fssai.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్సైట్లో దరఖాస్తు చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతలు తెలుసుకున్న తర్వాత దరఖాస్తు చేయాలి. దరఖాస్తు చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసి, అవసరమైన డాక్యుమెంట్స్ జతచేసి నోటిఫికేషన్లో వెల్లడించిన అడ్రస్‌కు 2021 మే 31లోగా చేరేలా పంపాలి.
మొత్తం ఖాళీలు- 38
ప్రిన్సిపాల్ మేనేజర్ (జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్ లేదా మార్కెటింగ్)- 1
జాయింట్ డైరెక్టర్ (టెక్నికల్)- 8
జాయింట్ డైరెక్టర్ (అడ్మిన్ అండ్ ఫైనాన్స్)- 4
సీనియర్ మేనేజర్ (జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్ లేదా మార్కెటింగ్)- 1
సీనియర్ మేనేజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 1
డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్)- 11
డిప్యూటీ డైరెక్టర్ అడ్మిన్ అండ్ ఫైనాన్స్)- 6
మేనేజర్ (జర్నలిజం లేదా మాస్ కమ్యూనికేషన్ లేదా పబ్లిక్ రిలేషన్)- 3
మేనేజర్ (మార్కెటింగ్)- 2
మేనేజర్ (సోషల్ వర్క్ లేదా సైకాలజీ లేదా లేబర్ లేదా సోషల్ వెల్ఫేర్)- 1
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2021 ఏప్రిల్ 16
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ- 2021 మే 15
ఆన్లైన్ దరఖాస్తులు పోస్టులో చేరడానికి చివరి తేదీ- 2021 మే 31
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Assistant Director (Recruitment),
Human Resource Division,
Room No. 407,
Food Safety and Standard Authority of India,
FDA Bhwan, Kotla Road, New Delhi- 110002
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.