FSSAI Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. FSSAIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

FSSAI Recruitment 2020: నిరుద్యోగులకు ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. అవ్వైజర్, డెరెక్టర్, జాయింట్ డైరెక్టర్, జాయింట్ డెరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డెరెక్టర్(టెక్నికల్), అసిస్టెంట్ డెరెక్టర్(OL),అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్లు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

news18-telugu
Updated: October 23, 2020, 3:13 PM IST
FSSAI Recruitment 2020: నిరుద్యోగులకు శుభవార్త.. FSSAIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
నిరుద్యోగులకు ఫుడ్ సేఫ్టీ మరియు స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. అవ్వైజర్, డెరెక్టర్, జాయింట్ డైరెక్టర్, జాయింట్ డెరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డెరెక్టర్(టెక్నికల్), అసిస్టెంట్ డెరెక్టర్(OL),అసిస్టెంట్ ఆఫీసర్, అసిస్టెంట్లు, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 66 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల భర్తీకి FSSAI ఆన్ లైన్, ఆఫ్ లైన్లలో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.fssai.gov.in వెబ్ సైట్ ను సందర్శించి అధికారిక నోటిఫికేషన్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. అక్కడ సూచించిన విధంగా ఆన్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో అప్లై చేయాలనుకున్న వారు వారి దరఖాస్తులను Assistant Director (HR), FSSAI, FDA Bhawan, Kotla Road New Delhi ఈ చిరునామాకు పంపించాల్సి ఉంటుంది.

అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఎంపికైన వారు ఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది. గరిష్టంగా 56 ఏళ్ల వయస్సు లోపు వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. వాటి వివరాలను నోటిఫికేషన్ లో పొందుపర్చారు.

Click here for job related information.

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్-BEL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లల్లో ఈ పోస్టులు ఉన్నాయి. సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు 2020 నవంబర్ 15 చివరి తేదీ.

నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS కింద బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యూనిట్‌లో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇవి ఏడాది అప్రెంటీస్ పోస్టులు మాత్రమే. అప్లై చేసేముందు నోటిఫికేషన్ చదివి విద్యార్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bel-india.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తును డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి చేసి, కావాల్సిన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో సూచించిన అడ్రస్‌కు పంపాలి. అభ్యర్థులు నేషనల్ అప్రెంటీస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్-NATS పోర్టల్ అయిన http://www.mhrdnats.gov.in/ లో కూడా రిజిస్టర్ చేసుకోవడం తప్పనిసరి.
Published by: Nikhil Kumar S
First published: October 23, 2020, 3:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading