దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (Food Safety and Standards Authority of India) విభాగంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ (Notification) ద్వారా ప్రిన్సిపల్ మేనేజర్, అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజర్, టెక్నికల్ ఆఫీసర్ (Technical Officer), అసిస్టెంట్ మేనేజర్ తదితర విభాగాల్లో 255 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ (online) ద్వారా ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 7, 2021 వరకు అవకాశం ఉంది. దరఖాస్తుకు రూ.1500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వేషన్ (Reservation) ఆధారంగా పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు విధానం నోటిఫికేషన్ సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ https://www.fssai.gov.in/jobs@fssai.php ను సందర్శించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన సమాచారం..
మొత్తం ఖాళీలు | 255 |
దరఖాస్తు ప్రారంభం | అక్టోబర్ 8, 2021 |
దరఖాస్తు రుసుం | రూ.1500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500ఫీజు లేదు |
దరఖాస్తుకు చివరి తేదీ | నవంబర్ 07, 2021 |
అధికారిక వెబ్సైట్ | https://www.fssai.gov.in/jobs@fssai.php |
Kerala Education: 45,313 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ల్యాప్టాప్లు.. కేరళ ప్రభుత్వ నిర్ణయం
అర్హతలు.. ఎంపిక విధానం..
Step 1 : దరఖాస్తు చేసుకోవాలనుకొన్న విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల ఆధారంగా గరిష్ట వయసు 25 ఏళ్ల నుంచి 35 ఏళ్లు మించకూడదు.
Step 2 : దరఖాస్తు చేసుకొన్న వారికి రాత పరీక్ష నిర్వహిస్తారు.
Step 3 : రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ (Interview)లు నిర్వహిస్తారు.
Step 4 : తుది మెరిట్ (Merit) ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు చేసుకొనే విధానం..
Step 1: అభ్యర్థి కేవలం ఆన్లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
Step 2: ముందుగా అధికారిక జిల్లా వెబ్సైట్ https://www.fssai.gov.in/jobs@fssai.php ను సందర్శించాలి.
Step 3: దరఖాస్తు ఫాం కోసం అనంతరం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి (నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి)
Step 4: ఆన్లైన్లో అప్లికేషన్ ఫాం అక్టోబర్ 8న యాక్టీవ్ అవుతుంది. ఆ లింక్లో అధికారిక వెబ్సైట్లో కనిపిస్తుంది.
Step 5: తప్పులు లేకుండా అప్లికేషన్ ఫాం నింపాలి.
Step 6: నింపిన దరఖాస్తు ఫాంను ప్రింట్ తీసి దాచుకోవాలి.
Step 7: దరఖాస్తుకు నవంబర్ 7, 2021 వరకు అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Govt Jobs 2021, Job notification, JOBS