హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IT Internship: వెబ్ డెవలప్‌మెంట్ నుంచి డేటా సైన్స్ వరకు. అందుబాటులో ఉన్న ఐటీ ఇంటర్న్‌షిప్స్

IT Internship: వెబ్ డెవలప్‌మెంట్ నుంచి డేటా సైన్స్ వరకు. అందుబాటులో ఉన్న ఐటీ ఇంటర్న్‌షిప్స్

  (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(IT) రంగంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. అందుకే కాలేజీ డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థులు తమ స్కిల్స్ పెంచుకోవడం మంచిది. అలాగే, ఇంటర్న్‌గా చేరి నచ్చిన ఐటీ జాబ్ తెచ్చుకునే అనుభవం పొందాలి. ప్రస్తుతం ఇండియాలో వెబ్ డెవలప్‌మెంట్ నుంచి డేటా సైన్స్ వరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)లో విద్యార్థులకు చాలా ఇంటర్న్‌షిప్ (IT Internship) అవకాశాలు ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

IT Internship : అవసరమైన స్కిల్స్, ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఐటీ (IT) రంగంలో ఉద్యోగం సంపాదించడం చాలా కష్టం. అందుకే కాలేజీ డిగ్రీ పూర్తి చేశాక విద్యార్థులు తమ స్కిల్స్ పెంచుకోవడం మంచిది. అలాగే, ఇంటర్న్‌గా చేరి నచ్చిన ఐటీ జాబ్ తెచ్చుకునే అనుభవం పొందాలి. ప్రస్తుతం ఇండియాలో వెబ్ డెవలప్‌మెంట్ నుంచి డేటా సైన్స్ వరకు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT)లో విద్యార్థులకు చాలా ఇంటర్న్‌షిప్ (IT Internship) అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మొబైల్ యాప్ డెవలప్‌మెంట్

ఈ రోజుల్లో మొబైల్ యాప్‌ డెవలపర్స్‌కి చాలా డిమాండ్ ఉంది. మొబైల్ యాప్‌లను డెవలప్‌ చేయాలనే ఆసక్తి ఉన్నవారు ఇందులో ఇంటర్న్‌గా చేరవచ్చు. ఇండియాలో మొబైల్ అప్లికేషన్ డెవలపర్‌ల జీతం రూ.1.8 లక్షల నుంచి రూ.12.3 లక్షల వరకు ఉంటుంది. సగటు వార్షిక జీతం రూ.5 లక్షలు.

వెబ్ డెవలప్‌మెంట్

వెబ్ డెవలప్‌మెంట్ కొత్త ప్రోగ్రామర్లకు బెస్ట్ ఐటీ కెరీర్‌గా నిలుస్తోంది. వెబ్ డెవలపర్లు వెబ్‌సైట్లను క్రియేట్ చేసి వాటిని మెయింటైన్ చేస్తుంటారు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఫుల్ స్టాక్ అనే మూడు రకాల వెబ్ డెవలపర్లు వెబ్‌సైట్లకు సంబంధించిన వివిధ పనులు చేస్తారు. వెబ్ డెవలప్‌మెంట్‌లో ఇంటర్న్‌షిప్ పొందాలంటే HTML, CSS, JavaScript, PHP వంటివి నేర్చుకొని ఉండాలి. వెబ్ డెవలప్‌మెంట్ ఇంటర్న్‌గా ఉన్నప్పుడు అప్లికేషన్లను డెవలప్ చేయడం, సర్వర్లను, డేటాబేస్‌లను మెయింటైన్ చేయడం ద్వారా వెబ్‌సైట్ స్పీడ్ పెంచడం నేర్చుకుంటారు. వెబ్‌సైట్ సామర్థ్యాన్ని ఆప్టిమైజ్ చేయడంపై నైపుణ్యం సాధిస్తారు. ఫుల్-స్టాక్ డెవలపర్ వెబ్‌సైట్‌ను తనకున్న పూర్తి పరిజ్ఞానంతో క్రియేట్ చేస్తారు. వెబ్ డెవలపర్ జీతం రూ.3.5 లక్షల నుంచి రూ.8.63 లక్షల వరకు ఉంటుంది.

Job Alert: నిరుద్యోగులకు అలర్ట్.. ఈ వారం అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ ఇదే.. లాస్ట్ డేట్ చెక్ చేయండి

ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్

ప్రొడక్ట్ మేనేజర్లు యూజర్-ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. వారి రెస్పాన్సిబిలిటీలలో ఇప్పటికే ఉన్న ప్రొడక్ట్స్‌ మెయింటైన్, ఇంప్రూవ్ చేయడం, మెరుగుపరచడం, కొత్త ప్రొడక్ట్స్‌ లాంచ్ చేయడం వంటివి ఉంటాయి. ప్రొడక్ట్ మేనేజర్లు ఆలోచన, డెవలప్‌మెంట్ నుంచి ప్రొడక్ట్ లాంచ్ అయ్యేవరకు ప్రతిదానికీ బాధ్యత వహిస్తారు. డిజైన్, ఇంజనీరింగ్, బిజినెస్ వంటి విభిన్న విభాగాలతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీరికి చక్కటి కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం. ప్రొడక్ట్ మేనేజర్‌ ఇంటర్న్‌గా టైమ్‌ మేనేజ్‌మెంట్, కొల్లాబరేషన్, యూజర్ టెస్టింగ్, ప్రొడక్ట్ రీసెర్చ్, డేటా అనాలిసిస్, డాక్యుమెంటేషన్ వంటి ముఖ్యమైన స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఇండియాలో వీరికి జీతం రూ.6 లక్షల - రూ.35 లక్షల మధ్య ఉంటుంది. కాగా సగటు వార్షిక జీతం రూ.16.3 లక్షలు.

డేటా సైన్స్

డేటా సైన్స్ కెరీర్ ఎంచుకునేవారు డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా మైనింగ్, బిగ్ డేటా మొదలైన వాటికి సంబంధించిన స్కిల్స్ పెంచుకోవాల్సి ఉంటుంది. డేటా సైంటిస్ట్‌గా MS Excelతో పాటు పైథాన్, జావా, R వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు కూడా నేర్చుకోవాలి. ఇండియాలో డేటా సైంటిస్ట్ జీతం రూ.4.5 లక్షల నుంచి రూ.25.3 లక్షల వరకు ఉంటుంది. సగటు వార్షిక జీతం రూ.10.5 లక్షలు.

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్

సాఫ్ట్‌వేర్ టెస్టింగ్ ప్రొఫెషనల్స్‌ ఒక ప్రోగ్రామ్ కరెక్ట్‌గా పని చేస్తుందా లేదా అనేది నిర్థారిస్తారు. సాఫ్ట్‌వేర్‌లోని బగ్‌లను కూడా గుర్తిస్తారు. వీరికి అనలిటికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైమ్ మేనేజ్‌మెంట్, డేటాబేస్ మేనేజ్‌మెంట్, SQL, టెస్ట్ మేనేజ్‌మెంట్ టూల్స్‌ల నాలెడ్జ్ అవసరం. ఇండియాలో ఒక సాఫ్ట్‌వేర్ టెస్టర్ రూ.1.6 లక్షల నుంచి రూ.8 లక్షల మధ్య శాలరీ పొందుతారు. సగటు వార్షిక జీతం రూ.3.8 లక్షలు ఉంటుంది.

First published:

Tags: Information Technology, Internship, Students

ఉత్తమ కథలు