Home /News /jobs /

FROM SELECTOR OF CHIEF OF BANK TO BIGGEST EXPORTER OF RICE CAN YOU ANSWER THESE GK QUESTIONS ASKED IN IAS EXAM GH VB

Brain Teaser: మీరు సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారా?.. ఈ జీకే ప్రశ్నలకు సమాధానాలు ఏంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

యూపీఎస్సీ(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్(Civil Services) పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారా? జనరల్ నాలెడ్జ్‌పై ఎంత పట్టు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక్కడ వాస్తవ ప్రశ్న పత్రాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.

ఇంకా చదవండి ...
యూపీఎస్సీ(UPSC) నిర్వహించే సివిల్ సర్వీసెస్(Civil Services) పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారా? జనరల్ నాలెడ్జ్‌పై ఎంత పట్టు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే ఇక్కడ వాస్తవ ప్రశ్న పత్రాల ఆధారంగా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటికి సరైన సమాధానాలు గుర్తించండి.

I. అశోకుని రాతి చిత్రపటంతో పాటు, కింది ఏ రిలీఫ్ శిల్ప శాసనంలో 'రన్యో అశోక'(అశోక రాజు) గురించి ప్రస్తావించబడింది?
కనగానహళ్లి
సాంచి
షాబాజ్‌గర్హి
సోహగౌరా
జవాబు: కనగానహళ్లి

II. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఛైర్మన్‌లను ఎవరు ఎంపిక చేస్తారు?
బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
సంబంధిత బ్యాంకు నిర్వహణ
జవాబు: బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో

GK Capsule: ఉద్యోగ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న అభ్యర్థులకు.. ఈ కరెంట్ అఫైర్స్ మీ కోసమే..


III.కింది వారిలో ఏ మొఘల్ చక్రవర్తి ఇలస్ట్రేటెడ్ మాన్యుస్క్రిప్ట్‌ల కంటే ఆల్బమ్‌లు, వ్యక్తిగత పోర్ట్రెయిట్‌లను నొక్కి చెప్పారు?
హుమాయున్
అక్బర్
జహంగీర్
షాజహాన్
జవాబు: జహంగీర్

IV. కింది వాటిలో గత 5 సంవత్సరాలలో ప్రపంచంలో అత్యధికంగా బియ్యం ఎగుమతి చేసిన దేశం ఏది?
చైనా
భారతదేశం
మయన్మార్
వియత్నాం
సమాధానం: భారతదేశం

V. కింది జాతీయ ఉద్యానవనాలలో ఏది పూర్తిగా సమశీతోష్ణ జోన్‌లో ఉంది?
మనస్ నేషనల్ పార్క్
నమ్దఫా నేషనల్ పార్క్
నియోరా వ్యాలీ నేషనల్ పార్క్
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ నేషన్ పార్క్
జవాబు: వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్

VI.కింది వాటిలో ఏది ప్రపంచ బ్యాంకు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్' ఉప-సూచిక కాదు?
శాంతిభద్రతల నిర్వహణ
పన్నుల చెల్లింపు
ఆస్తుల రిజిస్ట్రేషన్
నిర్మాణ అనుమతుల వ్యవహారం
సమాధానం: శాంతి భద్రతల నిర్వహణ

ఈ ప్రశ్నలు సెంట్రల్ గవర్నమెంట్‌‌కు సంబంధించి ‘ఆఫీసర్ రిక్రూట్‌మెంట్’ మొదటి దశ పరీక్షలో వచ్చినవి. యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. వీటికి 200 మార్కులు కేటాయిస్తారు. ప్రశ్నా పత్రాలు ఆబ్జెక్టివ్‌గా ఉంటాయి. ఒక్కొ పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)కు సంబంధించి జనరల్ స్టడీస్ పేపర్-IIలో కనీస అర్హత మార్కులు 33%గా నిర్ణయించారు. పరీక్ష హిందీ, ఇంగ్లీషు లాంగ్వేజ్‌లలో నిర్వహించనున్నారు.
యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమనరీ ఎగ్జామ్‌ను మే 28, 2023న నిర్వహించనున్నారు.

GK Questions For Competitive Aspirants: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారా..? ఈ 10 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి..


ఫిబ్రవరి 1న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది. ప‌రిస్థితులను బట్టి పరీక్షల తేదీలు మారే అవ‌కాశం ఉంద‌ని యూపీఎస్సీ క‌మిష‌న్ తెలిపింది. సివిల్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 21, 2023గా నిర్ణయించారు. ఇక, సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్షను సెప్టెంబర్‌ 15, 2023న నిర్వహించనున్నారు. అలాగే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష 2023 నవంబర్‌ 26న, ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష 2023 ఫిబ్రవరి 19న, కంబైన్డ్‌ జియో సైంటిస్ట్‌ మెయిన్స్‌ పరీక్ష 2023 జూన్‌ 24న యూపీఎస్సీ నిర్వహించనుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Gk, GK Capsule, Gk questions

తదుపరి వార్తలు