హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Study Abroad: ఈ ఐదు దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు..!

Study Abroad: ఈ ఐదు దేశాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Study Abroad: కొందరు ఇండియాలోనే చదవాలని భావిస్తుంటే, మరికొందరికి విదేశాల్లో చదవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తారనడంలో సందేహం లేదు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం విద్యార్థులు (Students) పబ్లిక్‌, ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ల ప్రిపరేషన్‌లో నిమగ్నమై ఉన్నారు. మరోపక్క ఎలాంటి కెరీర్‌ (Career) ఎంచుకోవాలి? ఏ కోర్సులో జాయిన్‌ అవ్వాలనే సందిగ్ధంలో ఉంటారు. కొందరు ఇండియా (India)లోనే చదవాలని భావిస్తుంటే, మరికొందరికి విదేశాల్లో చదవాలనే ఆలోచన ఉంటుంది. అయితే ఖర్చుల కారణంగా చాలా మంది వెనకడుగు వేస్తారనడంలో సందేహం లేదు. ఇలాంటి విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉచితంగా, రాయితీతో హయ్యర్ ఎడ్యుకేషన్‌ను అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే తక్కువ ఖర్చుతో విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు.

* జర్మనీ

యూరప్‌లో ప్రసిద్ధ కాలేజీలు, యూనివర్సిటీలకు పెట్టింది పేరు జర్మనీ. విదేశీ విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించకుండానే ఉన్నత విద్యను ఇక్కడ చదువుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ట్యూషన్- ఫ్రీ ఎడ్యుకేషన్‌కు జర్మనీకి మంచి గుర్తింపు ఉంది. జీవన వ్యయం కూడా భారీగా ఉండదు. జర్మనీలో ప్రధానంగా యూనివర్సిటీ హాంబర్గ్, Freie యూనివర్సిటీలకు మంచి గుర్తింపు ఉంది. వీటిల్లో ఉన్నత విద్యను చదువుకోవడానికి విదేశీ విద్యార్థులకు అవకాశాలు ఉన్నాయి.

* రష్యా

భారత్‌కు చిరకాల మిత్రదేశం రష్యా . మనదేశం కష్ట సమయాల్లో ఉన్నప్పుడు రష్యా ఆపన్నహస్తం అందించింది. విదేశాల్లో మెడిసిన్ చదవడానికి ఎంపిక చేసుకునే దేశాల్లో రష్యా ఆప్షన్‌గా ఉంది. ప్రధానంగా మాస్కో స్టేట్ యూనివర్సిటీ, టామ్స్క్ స్టేట్ యూనివర్సిటీ, సెయింట్ పీటర్స్‌బర్గ్ స్టేట్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను చదవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రష్యా ఉచిత విద్యను అందించనప్పటికీ, విదేశీ విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తోంది. ఒకపక్క చదువుకుంటునే ఏదైనా వర్క్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చదువు పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాలు పొందడానికి 180 రోజుల వరకు అక్కడే ఉండవచ్చు.

ఇది కూడా చదవండి : విదేశాల్లో ఉన్నత విద్యకు డిమాండ్.. గత పదేళ్లలో ఎంత మంది ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నారంటే!

* నార్వే

నార్వే కూడా విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం ఉచిత విద్యా పథకాన్ని రూపొందించింది. నార్వేలో ఉచితంగా చదువుకోవాలనుకుంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో చేరవచ్చు. అంతర్జాతీయ విద్యార్థులకు యూనివర్సిటీ ఆఫ్ బెర్గెన్, UiT ది ఆర్కిటిక్ యూనివర్సిటీ ఆఫ్ నార్వే విభిన్నమైన, సరసమైన కోర్సులను అందిస్తున్నాయి.

* ఆస్ట్రియా

యూరప్‌లోని ఇతర దేశాలతో పోల్చితే ఆస్ట్రియాలో ట్యూషన్ ఫీజులు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో విదేశీ విద్యార్థుల్లో చాలా మంది ఆస్ట్రియాలో ఉన్నత విద్యను చదవడానికి ఇష్టపడతారు. ప్రధానంగా వియన్నా యూనివర్సిటీ, సాల్జ్‌బర్గ్ యూనివర్సిటీల్లో ఉన్నత విద్యలో పలు కోర్సులు చేయవచ్చు.

* బ్రెజిల్

దక్షిణ అమెరికా దేశమైన బ్రెజిల్‌లోని ప్రభుత్వ యూనివర్సిటీలు భారతీయ విద్యార్థులకు విద్య ఉచితంగా అందిస్తున్నాయి. అయితే, ఈ వర్సిటీల్లో ప్రవేశం పొందడానికి ముందు, విద్యార్థులు పోర్చుగీస్ భాషా పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి. బ్రెజిల్‌లో ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ కాటరినా, ఫెడరల్ యూనివర్శిటీ ఆఫ్ ఏబీసీ, పొంటిఫికల్ కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జనీరో ముఖ్యమైన యూనివర్సిటీలు. ఉన్నత విద్య కోసం వీటిల్లో పలు కోర్సులు చేయవచ్చు.

First published:

Tags: Abroad, Brazil, Career and Courses, EDUCATION, Germany, Higher education, JOBS, Russia

ఉత్తమ కథలు