హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Freshers: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.. ఆఫర్లు ఇవే..

Freshers: ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. ఇంటి నుంచే పని చేసుకోవచ్చు.. ఆఫర్లు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

వర్క్​ ఫ్రమ్​ హోమ్​ విధానంలో పనిచేస్తూ ఇంటర్న్​షిప్​ చేసే అవకాశాలను పలు సంస్థలు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా మీ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఆయా ఇంటర్న్​షిప్​ల గురించి తెలుసుకుందాం.

విద్యార్థుల్లో నాణ్యమైన విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి అనేక సంస్థలు కృషి చేస్తున్నాయి. ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్​ల ద్వారా ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాయి. మెరుగైన శిక్షణతో మీ కెరీర్​ను ఉన్నతంగా మార్చుకునేందుకు సహాయపడుతున్నాయి. అయితే కోవిడ్​–19 మహమ్మారి తర్వాత ప్రపంచవ్యాప్తంగా విద్యావ్యవస్థలో మార్పులు వచ్చాయి. అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానం వేగంగా విస్తరించింది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే వర్క్​ ఫ్రమ్​ హోమ్​ విధానంలో పనిచేస్తూ ఇంటర్న్​షిప్​ చేసే అవకాశాలను పలు సంస్థలు కల్పిస్తున్నాయి. వీటి ద్వారా మీ ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఆయా ఇంటర్న్​షిప్​ల గురించి తెలుసుకుందాం.

Secunderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద అనుకోని ఘటన.. తెల్లవారుజామున ఇలా జరగడంతో..


టీమ్​ ఎవరెస్ట్​

భారతదేశంలో యువత నిర్వహించే అతిపెద్ద ఎన్​జీఓల్లో టీమ్​ ఎవరెస్ట్ ఒకటి. టీమ్ ఎవరెస్ట్​ సంస్థ 'డిజైన్ ఎ గేమ్' కోసం వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇంటర్న్‌షిప్‌ ఆఫర్ చేస్తోంది. వర్చువల్ గేమింగ్​లో రిసెర్చ్​ చేయాలనుకునే వారికి ఈ ఇంటర్న్‌షిప్‌ సరిగ్గా సరిపోతుంది. ఆసక్తి గల వారు డిసెంబర్ 21లోపు ఇంటర్న్​షిప్​కు ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అయితే, ఇంటర్న్‌షిప్ వ్యవధి ఎటువంటి స్టైఫండ్ చెల్లించరు.

ఎర్త్5 ఆర్

ఇది ఒక పర్యావరణ సంస్థ. 'ఎన్విరాన్‌మెంట్ ఛాంపియన్' పోస్ట్ కోసం వర్క్ ఫ్రమ్ ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఇంటర్న్ ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఈ ఇంటర్న్​షిప్ ఉంటుంది. అభ్యర్థులు వ్యర్థాల డేటాను విశ్లేషించి రీసెర్చ్​ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, 'ప్లాస్టిక్ కాలుష్యం, వ్యర్థాలను వేరుచేసే పద్ధతులతో వచ్చే హానికరమైన ప్రభావాల'పై పౌరులకు శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆసక్తి గల వారు డిసెంబర్ 14 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఇంటర్న్‌షిప్​లో ఎలాంటి స్టైఫండ్ చెల్లించరు.

Bigg Boss Telugu 5: 11వ వారం నామినేషన్లో ఉన్నది ఎవరో తెలిసింది.. డేంజర్లో వాళ్లే..


టీచ్ ఫర్ ఇండియా

ఇది టీచ్-ఫర్ ఆల్ నెట్‌వర్క్​కు సంబంధించింది. ఈ ఇంటర్న్​షిప్​ మూడు నెలల వ్యవధి ఉంటుంది. ఒక చిన్న గ్రూప్​ విద్యార్థులను పర్యవేక్షించడానికి ‘స్టూడెంట్​ మెంటరింగ్’ మెంటరింగ్​ ఇంటర్న్​షిప్​ను అందిస్తోంది. డిసెంబర్ 6లోపు ఈ వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇంటర్న్‌షిప్​కు దరఖాస్తు చేసుకోవాలి. కాగా, ఈ వ్యవధిలో ఎటువంటి స్టైఫండ్​ చెల్లించరు.

స్పోర్ట్స్​ కీడా

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, క్రీడాకారులను కలిపే ఏకైక వేదిక స్పోర్ట్స్​ కీడా. సెర్చ్​ ఇంజిన్​ ఆప్టిమైజేషన్ (ఎస్​ఈఓ) ద్వారా వర్క్​ ఫ్రమ్​ హోమ్​ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని అందిస్తోంది. అభ్యర్థులు ఎస్​ఈఓ బృందానికి సహాయం చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ వ్యవధి మొత్తం ఆరు నెలలు. అభ్యర్థులు డిసెంబర్ 17 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యవధిలో అభ్యర్థికి నెలకు రూ.10,000 స్టైఫండ్ చెల్లిస్తారు.

Online Course: ఇంటి నుంచే చ‌దివేయండి.. టాప్ ఫ్రీ ఆన్‌లైన్ కోర్సుల వివ‌రాలు

గ్రేడ్​ అప్​, గ్రేడ్​ స్టాక్​ లెర్నింగ్​ ప్రైవేట్​ లిమిటెడ్​

ఈ సంస్థ కంటెంట్​ డెవలప్​మెంట్​ ఇంటర్న్​షిప్​ను ఆఫర్​ చేస్తోంది. అభ్యర్థి యూజీసీ నెట్​(కంప్యూటర్ అప్లికేషన్ పేపర్ 2) కోసం తాజా ప్రశ్నలను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. గత NET, SET పేపర్లను కూడా పరిష్కరించాల్సి ఉంటుంది. డిసెంబరు 16లోపు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థికి నెలకు రూ. 1000 నుంచి 4000 స్టైఫండ్ చెల్లిస్తారు.

First published:

Tags: Freshers, Wokr from home

ఉత్తమ కథలు