హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

SCHOOLS: విద్యా విధానంలో నూతన సంస్కరణలు.. 2022 లో పాఠశాలల్లో వచ్చిన 5 కీలక మార్పులు ఇవే..

SCHOOLS: విద్యా విధానంలో నూతన సంస్కరణలు.. 2022 లో పాఠశాలల్లో వచ్చిన 5 కీలక మార్పులు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్‌ సమయంలో అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. 2022 సంవత్సరంలో తిరిగి  విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఈ ఏడాది కేంద్రం, రాష్ట్ర పరిధిలో విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. సరికొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన నుంచి నో బ్యాగ్ డే వరకు ఈ సంవత్సరం పాఠశాల వ్యవస్థలో జరిగిన మంచి మార్పులు వివరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కరోనా సంక్షోభం తర్వాత భారతదేశంలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొవిడ్‌ సమయంలో రెండేళ్ల పాటు భారతీయ విద్యా వ్యవస్థ ముందుకుసాగలేదు. అన్ని రాష్ట్రాల్లో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. 2022 సంవత్సరంలో తిరిగి విద్యాసంస్థలు పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. ఈ ఏడాది కేంద్రం, రాష్ట్ర పరిధిలో విద్యావ్యవస్థలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. సరికొత్త పాఠ్య ప్రణాళిక రూపకల్పన నుంచి నో బ్యాగ్ డే వరకు ఈ సంవత్సరం పాఠశాల వ్యవస్థలో జరిగిన మంచి మార్పులు వివరాలు ఇక్కడ ఉన్నాయి.

జాతీయ విద్యావిధానం అమలు

నూతన నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NCP) 2020 ప్రకటన వచ్చాక, జాతీయ విద్యా విధానం రూపకల్పనలో మార్పులు వచ్చాయి. దానితో భారతీయ పాఠ్యాంశ పుస్తకాలు సరికొత్త విధానాలతో రూపొందించారు. 2022 సంవత్సరంలో వచ్చిన ఈ విద్యా విధానం రూపకల్పన మార్పు విద్యార్థుల్లో భారతీయ మూలాల గురించి ప్రగతి గురించి అవగాహన పెంచే విధంగా అలాగే గర్వించే విధంగా ఉంటుంది. ఈ నూతన విద్యా వ్యవస్థను 2023- 2024 విద్యా సంవత్సరం నుంచి అమలులోకి తీసుకురానున్నారు.

హైటెక్ ల్యాబ్స్‌ ఏర్పాటు

తమిళనాడు విద్యాశాఖ పాఠశాలలో 6 నుంచి 8 తరగతి వరకు హైటెక్ ల్యాబ్‌లు ఏర్పాటుకు ఐటీ కంపెనీలను నియమించుకొనుంది. ప్రస్తుతానికి ఈ హైటెక్ ల్యాబ్‌లు ప్రభుత్వ పాఠశాలల్లోనూ, హయ్యర్ సెకండరీ పాఠశాలల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం కంప్యూటర్లు ఏర్పాటు చేయాలని తమిళనాడు విద్యాశాఖ ఐటీ కంపెనీలను ఆదేశించింది. ప్రతి హైటెక్ ల్యాబ్‌లో 10 కంప్యూటర్లు, మౌంటింగ్ కిట్‌తో కూడిన ప్రొజెక్టర్, వెబ్ కెమెరాలు, సంవత్సరానికి 1TB సామర్థ్యంతో కూడిన హార్డ్ డిస్క్‌లు, LAN కనెక్టివిటీ, హైటెక్ ప్రింటర్లు, హెడ్ ఫోన్లు, సీసీ కెమెరాలు ఉంటాయి.

LGBTQIA+ ఫ్రెండ్లీ వాతావరణం

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో LGBTQIA+ కమ్యూనిటీకి చెందిన విద్యార్థుల హక్కులను కాపాడేందుకు సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధపడింది. ఈ నూతన విధానాలు డిసెంబర్ నెలాకరు లోపు ప్రకటించి అమలు చేయనున్నట్లు తెలిపింది. ఈ విషయాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు జెండర్ ఐడెంటిటీ, జెండర్ ఎక్స్ప్రెషన్, వల్నరెబిలిటీ అండ్ హెల్త్ ఇష్యూస్, ఇతర అంశాలపై పాఠ్యాంశాలలో చేర్చి వీటిపై టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

నో బ్యాగ్ డే

విద్యార్థులపై చదువు ఒత్తిడి తగ్గించేందుకు బీహార్ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే గా ప్రకటించింది. అలాగే వారానికి ఒకసారి కచ్చితంగా ఆటలు ఆడించేందుకు ప్రత్యేక పీరియడ్‌ ఉండేలా రెగ్యులేషన్స్ తెచ్చింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (NEP) 2022 ఆధారంగా.. పూర్తిగా విద్యార్థులు ప్రాక్టికల్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్‌ లెర్నింగ్‌పై దృష్టి సారించే విధంగా చర్యలు తీసుకోనుంది. అలాగే పాఠ్యాంశాల్లో అథ్లెటిక్స్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది.

జెండర్‌ ఈక్వాలిటీ

2022 జూన్ ప్రైడ్ మంత్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఆదిత్య బిర్లా వరల్డ్ అకాడమీ (ABWA) ముంబైలోని పాఠశాలలో జెండర్‌తో సంబంధం లేకుండా యూనిఫార్మ్‌లు ప్రవేశపెట్టింది. విద్యార్థులు వారికి నచ్చిన విధంగా ప్యాంట్లు లేదా స్కార్ట్స్ ఎన్నుకోవచ్చు. జెండర్ న్యూట్రల్ యూనిఫామ్ విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రొఫెసర్ల గైడెన్స్ లో స్టూడెంట్స్ బాడీ సహకారంతో LGBTQIA+ ను సపోర్ట్ చేస్తూ రెయిన్బో క్లబ్‌ని ఏర్పాటు చేశారు. కేవలం యూనిఫాంలోనే కాకుండా పలకరించే విధానంలో కూడా సమానత్వం ఉండాలని బాయ్స్‌, గర్ల్స్‌ వేర్వేరుగా కాకుండా అందర్నీ కలిపి హలో ఎవ్రీ వన్ అంటూ సంబోధించాలని నిర్ణయం తీసుకున్నారు.

First published:

Tags: Career and Courses, School

ఉత్తమ కథలు