కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి తర్వాత విద్యా విధానం అంతా ఆన్‌లైన్‌లోకి మారింది. ఇప్పుడు ఆన్లైన్లోనే అన్ని కోర్సులు లభిస్తున్నాయి. అందుకే కాలేజీ విద్యార్థుల నుంచి నిపుణుల వరకు అందరూ ఆన్‌లైన్ ద్వారానే నైపుణ్యాలు పెంచుకుంటున్నారు. దీనికి తోడు మార్కెట్ అవసరాలకు తగ్గట్లు కొత్త కోర్సులను డిజైన్ చేస్తున్నాయి ప్రముఖ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ప్లాట్‌ఫాంలు. వీటిని నేర్చుకున్న వారికి జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంటుందని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎలాంటి కోర్సులు నేర్చుకునే కాలేజీ విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందో చూద్దాం.
నేటి జాబ్ మార్కెట్లో నైపుణ్యాలు ఎంత అవసరమో తెలిసిందే. నైపుణ్యాల కొరత అటు విద్యార్థులను కంపెనీలను వేధిస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక సంస్థలు లీడింగ్ టెక్నాలజీస్‌లో కొత్త కోర్సులను అందిస్తున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు సిద్ధమవుతున్న కాలేజీ విద్యార్థులకు, ఫ్రెషర్లకు ఈ కోర్సులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఏయే రంగాల్లో ఎలాంటి కోర్సులకు డిమాండ్ ఉందో వెల్లడించింది కోర్స్‌ఎరా ఇంపాక్ట్ రిపోర్ట్ 2021 (Coursera Impact Report). ఆ వివరాలు..
బిజినెస్
కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఎంట్రప్రెన్యూర్షిప్, బిజినెస్ అనాలిసిస్, ఫైనాన్స్
టెక్నాలజీ
కంప్యూటర్ ప్రోగ్రామింగ్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, అల్గారిథం, క్లౌడ్ కంప్యూటింగ్
డేటా సైన్స్
ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, మ్యాథమెటిక్స్, డేటా మేనేజ్మెంట్
కరోనా టైంలో పెరిగిన ఆదరణ
కోర్స్‌ఎరా ఎడ్ టెక్ ప్లాట్‌ఫారమ్‌లో మొత్తం 92 మిలియన్ల మంది లెర్నర్స్ రిజిస్టర్ అయి ఉన్నారు. ఇప్పటికే, బిజినెస్ స్కిల్స్‌లో 81 శాతం మంది ప్రయోజనం పొందారని సర్వే వెల్లడించింది. ఇక, 71 శాతం మంది టెక్నాలజీ లెర్నర్స్ ప్రయోజనం పొందారు. మరోవైపు, డేటా సైన్స్ విభాగంపై 64 శాతం పట్టు సాధించారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ ధోరణి మరింతగా పెరిగింది. కోర్స్‌ఎరా సహాయంతో మహిళలు స్టెమ్ కోర్సులతో పాటు ఆన్‌లైన్ విద్యను అభ్యసిస్తున్నారని సర్వే హైలైట్ చేసింది.
ఆ విభాగాల పైనే మహిళల దృష్టి
మహిళలు ఎక్కువగా నేర్చుకుంటున్న స్కిల్స్‌లో కమ్యూనికేషన్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఎంట్రప్రెన్యూర్షిప్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బిజినెస్ సైకాలజీ, బిజినెస్ అనాలిసిస్, డేటా అనాలసిస్, మెషిన్ లెర్నింగ్, మార్కెటింగ్ వంటివి ఉన్నాయి. మరొక ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ గ్రేట్ లెర్నింగ్ సర్వే ప్రకారం, డేటా సైన్స్ కోర్సు చేసిన వారికి మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. 92 శాతం కంపెనీలు డేటా సైన్స్ లో నిపుణుల కొరతను ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు నేర్చుకోవడం ద్వారా అపారమైన అవకాశాలు పొందవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Online classes