Home /News /jobs /

FROM COAL INDIA TO DRDO HERE ARE JOBS TO APPLY THIS WEEK UMG GH

Job Alert: బీఎస్‌ఎఫ్ నుంచి ఎయిర్‌ఫోర్స్ వరకు.. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన జాబ్స్ లిస్ట్ ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీరు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే రీజినల్ రూరల్ బ్యాంకుల (RRB) నుంచి డీఆర్‌డీవో (DRDO) వరకు వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు (Government Sectors) చేపడుతున్న నియామక ప్రక్రియ జాబితాను మీకోసం అందిస్తున్నాం. అన్నిటినీ పరిశీలించి అర్హత ఉన్న వాటికి అప్లై చేసుకోండి.

ఇంకా చదవండి ...
మీరు Job కోసం ప్రయత్నిస్తున్నారా..? అయితే రీజినల్ రూరల్ బ్యాంకుల నుంచి DRDO వరకు వివిధ Government Sectors చేపడుతున్న నియామక ప్రక్రియ Listను మీకోసం అందిస్తున్నాం. అన్నిటినీ పరిశీలించి అర్హత ఉన్న వాటికి అప్లై చేసుకోండి.

బీఎస్‌ఎఫ్
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF) గ్రూప్ B, గ్రూప్ Cలలో 110 ఖాళీల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నోటిఫై చేసింది. ఇందులో 88 కానిస్టేబుల్ పోస్టులు కాగా, మిగతా 22 సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు. BSF అధికారిక వెబ్‌సైట్ rectt.bs.gov.in ద్వారా అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 12లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. SI పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు రూ. 35,400 నుంచి రూ.1,12,400 మధ్య జీతం ఇవ్వనున్నారు. ఇక కానిస్టేబుల్స్‌కు రూ.21,700 నుంచి రూ.69,100 మధ్య జీతం ఉండనుంది.

ఇదీ చదవండి: మానవత్వం పరిమళించింది.. కుక్క కోసం ఏకమైన ఓ గ్రామం.. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ..!


కోల్ ఇండియా
GATE-2022 స్కోర్ ఆధారంగా 1050 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది కోల్ ఇండియా. అర్హత ఉన్న అభ్యర్థులు జూలై 22లోపు ఆన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ coaindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను GATE -2022 స్కోర్ ఆధారంగా 1:3 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఆ తరువాత తుది మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. దరఖాస్తు కోసం గరిష్ట వయోపరిమితి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 30 సంవత్సరాలుగా ఉంది.

డీఆర్డీవో
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) సైంటిస్ట్ B కేటగిరిలో 630 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు DRDO రిక్రూట్‌మెంట్ అండ్ అసెస్‌మెంట్ సెంటర్ (RAC) అధికారిక వెబ్‌సైట్ rac.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులను మొదట్లో గేట్ స్కోర్‌ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేయనున్నారు. ఆ తర్వాత పోస్ట్‌లను బట్టి ఇతర ఎంపిక పద్ధతులను అనుసరిస్తారు.



ఐబీపీఎస్- ఆర్ఆర్‌బీ
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS).. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో గ్రూప్ A ఆఫీసర్స్ (స్కేల్ I, II, III), గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను నోటిఫై చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 43 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం 8,325 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు జూన్ 27లోపు సంస్థ అధికారిక వెబ్‌సైట్ ibps.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్స్
కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నివీర్ పథకం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్‌మెంట్‌ చేపట్టనుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులను ‘అగ్నివీర్ వాయు’ గా పిలుస్తారు. వారు నాలుగు సంవత్సరాల పాటు సర్వీస్‌లో ఉండనున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా భర్తీ చేయాల్సిన ఖాళీల సంఖ్యను IAF ఇంకా ప్రకటించలేదు.
Published by:Mahesh
First published:

Tags: Agnipath Scheme, DRDO, Ibps rrb, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు