హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Employee Privileges: విదేశాల్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఈ దేశాల్లో జాబ్ వస్తే మీరు అదృష్టవంతులే..!

Employee Privileges: విదేశాల్లో ఉద్యోగం కోసం చూస్తున్నారా..? ఈ దేశాల్లో జాబ్ వస్తే మీరు అదృష్టవంతులే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగాన్ని సాఫీగా చేసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఎంజాయ్ చేసేందుకు కొన్ని దేశాలు వీలు కల్పిస్తున్నాయి. మీరు కూడా విదేశాల్లో పని చేయాలని భావిస్తే ఈ దేశాలను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

చాలామందికి విదేశాల్లో ఉద్యోగం చేయాలనేది ఒక కల. ఎక్కువ జీతంతో పాటు ఇతర సౌలభ్యాలు ఉంటాయి కాబట్టి బయటి దేశాల్లో పని చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఒక్కో దేశంలో పని నిబంధనలు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని దేశాల్లో రోజుకు తప్పనిసరిగా వారంలో ఆరు రోజులు, రోజుకు 9 గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. మరికొన్ని దేశాల్లో పనివేళలు తక్కువగా ఉంటాయి. అలా, ఉద్యోగాన్ని సాఫీగా చేసుకుంటూ వీలు చిక్కినప్పుడల్లా ఎంజాయ్ చేసేందుకు కొన్ని దేశాలు వీలు కల్పిస్తున్నాయి. మీరు కూడా విదేశాల్లో పని చేయాలని భావిస్తే ఈ దేశాలను మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవచ్చు.

బెల్జియం

బెల్జియం దేశంలో ఉద్యోగులకు బంపర్ ఆఫర్లు ఉంటాయి. ఈ దేశంలో ట్రావెల్ చేయడం కోసం ఉద్యోగానికి స్వస్తి పలకొచ్చట. అది ఉద్యోగుల హక్కుగా భావిస్తారట. ఎక్కడికైనా టూర్‌కి వెళ్లాలని భావిస్తే సెలవులు కాకుండా నేరుగా ఉద్యోగం నుంచి తప్పుకోవచ్చు. ఇలా ఎక్కువలో ఎక్కువగా ఏడాది పాటు ప్రొఫెషనల్ వృత్తి నుంచి బ్రేక్ తీసుకోవచ్చట. పైగా, ఈ విరామ గడువుకు ఆయా సంస్థలు జీతాలు చెల్లిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగ భద్రతను కూడా సంస్థలు కల్పిస్తాయట. అంటే విరామం తరువాత తిరిగి సంస్థలో చేరేందుకు రాతపూర్వక హామీని ఇస్తాయట. తద్వారా వేతన జీవులకు ఉద్యోగ భద్రత కలుగుతుంది. నిజంగా ఎంతో బాగుంది కదూ.

ఆస్ట్రియా

ప్రపంచంలోనే అత్యుత్తమంగా కార్మికుల సంక్షేమాభివృద్ధిని అమలు చేస్తున్న దేశాల జాబితాలో ఆస్ట్రియా ముందంజలో ఉంటుంది. వెకేషన్ కోసం ఇక్కడ 30 రోజుల పనిదినాల పాటు సెలవు తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఉద్యోగులు కనీసం ఆరు నెలల పాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. 25ఏళ్ల లోపు వృత్తి అనుభవం ఉన్న ఉద్యోగులకు 30 రోజులు, ఆపై అనుభవం ఉన్న వారికి 36 రోజుల పాటు సెలవులు ఇస్తారు.

యునైటెడ్ అరబ్ ఎమైరేట్స్

కార్మికుల కోసం యూఏఈ ప్రత్యేక నిబంధనలను రూపొందించి అమలు చేస్తోంది. ఇక్కడ పని చేసే సమయంలో ఆసక్తి గల ఉద్యోగులు చదువుకునే సౌలభ్యం ఉంది. ‘రీడింగ్ బ్రేక్’గా ఈ కార్యక్రమానికి నామకరణం చేశారు. అంటే పని వేళల్లో నిర్భయంగా చదువుకోవచ్చు. కెరీర్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవచ్చు.

జపాన్

ఒక్కోసారి పని ఎక్కువై తీవ్రంగా అలసిపోతాం. అలాంటి సమయాల్లో పని చేస్తుండగానే మనకు తెలియకుండా నిద్రలోకి జారుకుంటాం. ఇలా నిద్రపోవడం ఇతర దేశాల్లో ఉద్యోగి అసమర్థతగా భావిస్తారు. కానీ, జపాన్‌లో ఎలాంటి బెరుకు లేకుండా కునుకు తీయొచ్చు. దీనికి ‘ఇనెమురి’ అని నామకరణం చేసి అమలు చేస్తున్నారు. ఇనెమురి అంటే ‘పనిచేసే సమయంలోనూ కునుకు తీయొచ్చు’ అని అర్థం. అయితే, సదరు వ్యక్తి తప్పకుండా గాఢ నిద్రలోకి జారుకుంటేనే ఈ సౌలభ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.

ముందే తెలుసుకోండి..

విదేశాల్లో ఉద్యోగం చేయాలనే కుతూహలంలో ఏ దేశానికి వెళ్లాలో అభ్యర్థులకు అవగాహన ఉండకపోవచ్చు. అయితే, హడావుడిగా కొందరు విదేశాలకు వెళ్లి తీరికలేకుండా గడపాల్సి వస్తుంది. కంపెనీలు విధించే టార్గెట్‌లను అందుకోవడానికి రాత్రింభవళ్లు శ్రమిస్తుంటారు. ఇలా చేస్తూ ఉండటం వల్ల ఒక దశలో ఉద్యోగంపై విరక్తి కలుగుతుంది. కాస్త సేద తీరుదామన్నా కుదరదు. తద్వారా మానసికంగా కుంగుబాటుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ముందే ఒక నిశ్చయానికి రావాలని నిఫుణులు సూచిస్తున్నారు. ఆయా దేశాల కార్మిక నిబంధనల గురించి తెలుసుకోవాలని చెబుతున్నారు.

First published:

Tags: Abroad, Career and Courses, JOBS, Private Jobs

ఉత్తమ కథలు