ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) కోసం కుస్తీ పడుతున్నారా..? అయితే మీకు అలర్ట్. బ్యాంక్ జాబ్స్(Bank Jobs), స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌తో(State Government Jobs) పాటు కొన్ని కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ప్రస్తుతం రిక్రూట్మెంట్స్ ఓపెన్ అయ్యాయి. ఈ వారంలో అప్లై చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఏవో చూద్దాం.
ఏపీపీఎస్సీ(APPSC)
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్(Andhra Pradesh Public Service Commission).. వివిధ డిపార్ట్మెంట్లలో గ్రూప్-1, గ్రూప్-2 వంటి పోస్టులను భర్తీ చేస్తుంది. తాజాగా గ్రూప్-I ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ చేపట్టింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 90 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 2 లోపు అప్లై చేసుకోవాలి. గ్రూప్ -1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెల జీతం రూ. 54,060 నుంచి రూ.1,51,370 మధ్య ఉంటుంది.
ఎయిమ్స్
ప్రతిష్టాత్మక మెడికల్ సంస్థ ఎయిమ్స్, భువనేశ్వర్ (AIIMS-Bhubaneswar).. ఒక ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ కన్సల్టెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ పోస్టులను భర్తీ చేయడానికి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ పూర్తిగా కాంట్రాక్ట్ బేసిస్‌లో ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 25లోపు అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు అప్లికేషన్స్‌ను labhematologyaiimsbbsr@gmail.com మెయిల్ చేయాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1లక్ష వరకు జీతం లభిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఎస్బీఐ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతోంది. ఈ జాబ్స్ పూర్తిగా కాంట్రాక్ట్ విధానంలో ఉంటాయి. కనీసం ఒక సంవత్సరం నుంచి గరిష్టంగా మూడు సంవత్సరాల కాల పరిమితి కోసం అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తంగా 47 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 31లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 45,000 జీతం లభిస్తుంది.
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వెస్ట్రన్ రీజియన్ ఎయిర్ పోర్ట్ల్లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మహారాష్ట్ర , గుజరాత్ , మధ్యప్రదేశ్, గోవాకు చెందిన అభ్యర్థులు మాత్రమే ఈ రిక్రూట్మెంట్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 14లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1,10,000 వరకు జీతం లభిస్తుంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తంగా 55 పోస్టులను భర్తీ చేయనున్నారు.
తమిళనాడు ప్రైవేట్ జాబ్ పోర్టల్
తమిళనాడు ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో ఉద్యోగ సమాచారం, రిక్రూట్మెంట్ సంబంధించిన విషయాల కోసం ప్రత్యేకంగా ‘తమిళనాడు ప్రైవేట్ జాబ్ పోర్టల్’ అనే వెబ్‌సైట్‌ను ఇటీవల ప్రారంభించింది. దీన్ని ఉపాధి, శిక్షణ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. ఈ వెబ్సైట్ ఇప్పటికే 4,814 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. అలాగే ఉద్యోగాల కోసం 2 లక్షల మందికి పైగా అభ్యర్థులు సైతం రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు 42 ఆక్యుపేషనల్ కేటగిరీల్లో 1,01,703 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.