Home /News /jobs /

FROM AMAZON TO COGNIZANT HERE IS THE LIST OF TOP FIRMS HIRING FOR NON TECH JOB ROLES NS GH

Non-Tech Job Roles: నిరుద్యోగులకు అలర్ట్.. ప్రముఖ ఐటీ కంపెనీల్లో నాన్​ టెక్నికల్ జాబ్స్​.. అర్హత, ప్యాకేజీ వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతం కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో మునుపటి కంటే వేగంగా ఐటీ రంగం(IT Industry) వృద్ధి చెందుతోంది. దీంతో టెక్నికల్‌​తో పాటు నాన్-టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులను కూడా ఐటీ కంపెనీలు పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి.

దేశవిదేశాల్లోని ప్రముఖ ఐటీ కంపెనీ(IT Companies)లు కేవలం టెక్నాలజీ సంబంధింత ఉద్యోగాలే కాదు నాన్​ టెక్​ ఉద్యోగాలను(Non Technical Jobs) కూడా ఆఫర్​ చేస్తున్నాయి. కోవిడ్​-19(Covid-19) మహమ్మారి ప్రభావం కారణంగా జాబ్ మార్కెట్(Job Market) చాలా దెబ్బతినడంతో ఏడాదిన్నరగా ఉద్యోగ నియామకాలు(Jobs Recruitment) మందగించాయి. అయితే ఇప్పుడు కరోనా(Corona) తగ్గుముఖం పట్టడంతో మునుపటి కంటే వేగంగా ఐటీ రంగం(IT Industry) వృద్ధి చెందుతోంది. దీంతో టెక్నికల్‌​తో పాటు నాన్-టెక్నికల్ నేపథ్యం ఉన్న అభ్యర్థులను కూడా పెద్ద ఎత్తున నియమించుకుంటున్నాయి. మీరు జాబ్​ చేంజ్(Job Change)​ లేదా కొత్తగా ఉద్యోగం కోసం చూస్తుంటే.. ఈ టాప్​ ఎమ్​ఎన్​సీ కంపెనీల్లో(MNC Companies) ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

నీల్సన్ గ్లోబల్ మీడియా (TRAINEE ANALYST, NIELSEN, BANGLORE):
నీల్సన్ గ్లోబల్ మీడియా బెంగళూరు కార్యాలయంలో ట్రైనీ అనలిస్ట్ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఏదైనా బ్యాచిలర్​​ డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు తప్పనిసరిగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్‌వేర్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి.
TCS Recruitment 2021 : ఎంబీఏ చేసిన వారికి బెస్ట్ కెరీర్ ఆప్ష‌న్‌.. టీసీఎస్‌లో ఉద్యోగాలు

సీనియర్ ఐటీ రిక్రూటర్, రివాగో ఇన్ఫోటెక్, అమృత్‌సర్(SENIOR IT RECRUITER, RIVAGO INFOTECH, AMRITSAR):
ప్రముఖ ఐటీ సంస్థ రివాగో ఇన్ఫోటెక్ తమ అమృత్‌సర్ బ్రాంచ్‌లో సీనియర్ ఐటీ రిక్రూటర్ భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు నైట్​ షిఫ్ట్​లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థికి తప్పనిసరిగా రెండేళ్ల పాటు సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన అనుభవం ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు రూ.14,532 నుంచి రూ.50,000 మధ్య నెలవారీ వేతనం లభిస్తుంది.
IBPS Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 1828 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

డేటా అనలిస్ట్, కెరీర్‌స్కూల్ హెచ్​ఆర్​ సొల్యూషన్(DATA ANALYST, CAREERSCHOOL HR SOLUTION):
కెరీర్‌స్కూల్ హెచ్​ఆర్​ సొల్యూషన్ హైదరాబాద్ విభాగంలో ఫుల్​టైమ్​ డేటా అనలిస్ట్ (నాన్ ఐటీ) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన వారికి రూ. 14,000 నుంచి రూ. 16,000 నెలవారీ వేతనం లభిస్తుంది. అదనంగా పీఎఫ్, ఈఎస్ఐ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
TCS Jobs: ఆ కోర్సు పాస్ అయినవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... దరఖాస్తు గడువు పెంపు


ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్- వాయిస్, కాగ్నిజెంట్, హైదరాబాద్(PROCESS EXECUTIVE- VOICE, COGNIZANT, HYDERABAD):
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా సంస్థ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో కస్టమర్ సపోర్ట్ (వాయిస్) ప్రాసెస్​ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బి.టెక్ లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
IIT Delhi : ఐఐటీ ఢిల్లీలో ఎన‌ర్జీ ఇంజ‌నీరింగ్ కోర్సు.. జేఈఈ స్కోర్ ఆధారంగా అడ్మిష‌న్‌

యూఎస్​ ఐటీ రిక్రూటర్, జెన్​క్యూమ్​ టెక్నాలజీస్(US IT RECRUITER, GENIQOM TECHNOLOGIES):
జెన్క్యూమ్ టెక్నాలజీస్ దేశవ్యాప్తంగా ఉన్న తన కార్యాలయాల్లో యూఎస్​ ఐటీ రిక్రూటర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కనీసం 0.6 నుంచి 2 సంవత్సరాల అనుభవంతో పాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి. ఎంపికైన వారికి రూ. 15,000 నుంచి రూ. 25,000 నెలవారీ జీతంతో పాటు ఫుడ్​ అలవెన్స్​, ఆరోగ్య బీమా, ఇతర ప్రయోజనాలుంటాయి.
IndiGo Airlines: ఫ్రెష‌ర్స్‌కి శుభ‌వార్త‌.. ఇండిగో ఎయిర్​లైన్స్‌లో ట్రైనీ ఉద్యోగాలు


బిజినెస్ డెవలప్‌మెంట్ పార్టనర్, అహ్మదాబాద్(BUSINESS DEVELOPMENT PARTNER, LOCATION - AHMEDABAD):
బెస్ట్​ డాక్​ టెక్నాలజీ ప్రైవేట్​ లిమిటెడ్ సంస్థకు చెందిన​ అహ్మదాబాద్‌ కార్యాలయంలో బిజినెస్ డెవలప్‌మెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఎంపికైన అభ్యర్థులు రూ. 8.5 లక్షల వార్షిక వేతనంతో పాటు బోనస్​ కూడా అందుకోవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: CAREER, IT jobs, Private Jobs, Software developer

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు