Current Topics : UPSC సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ నుంచి SSC రిక్రూట్‌మెంట్ వరకు, కాలేజ్ అడ్మిషన్‌ల నుంచి కంపెనీలలో గ్రూప్ డిస్కషన్‌ల వరకు జనరల్ నాలెడ్జ్(General Knowledge)కు ప్రాధాన్యం ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు కంరెంట్ టాపిక్స్‌పై అవగాహన ఉండాలి. అందుకే వారంలో జరిగిన కరెంట్ టాపిక్స్‌ను న్యూస్ 18 Weekly Column- GK Capsule అందిస్తోంది. ప్రస్తుతం పరిశీలించాల్సిన మేజర్ కరెంట్ అఫైర్స్ ఏంటో చూద్దాం.
AIIMS సర్వర్‌లపై సైబర్ ఎటాక్
ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-in) నివేదిక ప్రకారం.. AIIMSకు సంబంధించిన ఐదు సర్వర్‌లపై నవంబర్ 23న సైబర్ అటాక్ జరిగింది. ఈ దాడుల్లో 1.3 గిగా బైట్ల డేటా ఎన్‌క్రిప్ట్ అయింది. ఢిల్లీ పోలీసులకు సంబంధించిన ఇంటిలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్(IFSO) యూనిట్ ఈ డేటా చోరీపై సైబర్ టెర్రరిజం కింద కేసు నమోదు చేసింది. AIIMS వెంటనే ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించిన డేటా సెక్యూర్ చేయడం కోసం అత్యవసర సెక్యూరిటీ మెజర్‌మెంట్స్ అమలు చేసింది.
కల్తీ మద్యం తాగి 70 మంది మృతి
బీహార్ రాష్ట్రంలోని చాప్రాలో కల్తీ మద్యం తాగి 70 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఘాటుగా స్పందించారు. ‘పియోగే తో మరొగే’ అంటూ కల్తీ మద్యం తాగితే చస్తారు అని పదునైన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎటువంటి సహాయం అందించదు అని తెలియజేశారు.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై దాడులు
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై డిసెంబర్ 14న జరిగిన రష్యా దాడుల్లో రెండు పరిపాలన భవనాలు ధ్వంసం అయ్యాయి. దాడులు చేసిన రాకెట్లు వెనుక భాగంలో FOR RYAZAN అనే పేరును గుర్తించారు. ఇది వెస్ట్ రష్యాలోని ఒక నగరం పేరు. అదే రోజు కీవ్ నగరంపై దాడి చేయడానికి వచ్చిన 10 ఇరానియన్ మేడ్ కమికేజ్ 'షెడెడ్ 136 డ్రోన్స్'ను ఉక్రెయిన్ వైమానిక దళం ధ్వంసం చేసింది.Warship Sank : సముద్రంలో మునిగిన యుద్ధనౌక..ఇంకా దొరకని 31మంది ఆచూకీ!
22న హిమాచల్‌ప్రదేశ్‌లో ప్రమాణస్వీకారం
ఇటీవల ఎన్నికైన హిమాచల్‌ప్రదేశ్ నూతన ఎమ్మెల్యేలు డిసెంబర్ 22వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడు రోజుల శీతాకాలం సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇది హిమాచల్‌ప్రదేశ్ 14వ విధాన సభ మొదటి సమావేశం. ఈ సమావేశంలో గవర్నర్ సందేశంతో పాటు స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన, లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన చందర్ కుమార్ ప్రోటెం స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. నూతన స్పీకర్ ఎన్నిక నుంచి ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ఈయన చేతుల మీదుగా జరుగుతుంది.
విజయవంతమైన Agni 5 ప్రయోగం
ఇండియా తన అణు ఆయుధాల సంపదను పెంచుకుంటోంది. తాజాగా న్యూక్లియర్ క్యాపబుల్ అగ్ని 5 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇది 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేయగలదు. అరుణాచల్‌ప్రదేశ్ బోర్డర్ తవాంగ్ ప్రాంతాల్లో చైనా సైన్యం ఆక్రమణకు పాల్పడిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రయోగం జరగడం గమనార్హం.
ప్రపంచ విజేతగా అర్జెంటీనా
డిసెంబర్ 18న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా- ఫ్రాన్స్ FIFA వరల్డ్ కప్ ఫైనల్ పోరులో అర్జెంటీనా ప్రపంచ విజేతగా నిలిచింది. ఛాంపియన్ మెస్సీ అర్జెంటీనాను ప్రపంచ విజేతగా నిలబెట్టాడు. తన 18 ఏళ్ల కెరీర్‌లో అత్యదిక కాలం బార్సిలోనా టీమ్‌కు ఆడాడు. 7 Ballon D'or అవార్డ్స్, 6 యూరోపియన్ గోల్డెన్ బూట్స్, 37 క్లబ్ ట్రోఫీస్, 10 లా లిగా టైటిల్స్, 7 కోపా డెల్ రే టైటిల్స్, 4 UEFA ఛాంపియన్స్ లీగ్ టైటిల్స్ సాధించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, FIFA World Cup 2022, General knowledge, Ukraine