హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Free UPSC Coaching: సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారికి గుడ్‌న్యూస్.. వారికి ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ఇగ్నో..

Free UPSC Coaching: సివిల్స్‌కు ప్రిపేరయ్యే వారికి గుడ్‌న్యూస్.. వారికి ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ఇగ్నో..

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది.

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ఎస్సీ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారికి ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్(UPSC Coaching) అందించనున్నట్లు ప్రకటించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇగ్నో(IGNOU) అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in ద్వారా జూన్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఇటీవల స్థాపించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్(DACE) సంస్థ ఎస్సీ విద్యార్థులకు కోచింగ్(Coaching) ఇవ్వనుంది. ఈ మేరకు ఇగ్నో ఈ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. 2023లో జరిగే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్(CSE) కోసం ఫ్రీ కోచింగ్(Free Coaching) ఇవ్వడానికి ఆల్ ఇండియా ఎంట్రెన్స్ ఎగ్జామ్‌‌ను(All India Entrance Exam) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో డీఏసీఈ సంస్థ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ప్రిలిమినరీ(Preliminary), మెయిన్ పరీక్షలకు(Main Exams) కోచింగ్ ఇవ్వనున్నారు.

UPSC Ranker: అమె లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది.. కానీ కోచింగ్ తీసుకోలేదు.. తీరా చూస్తే.. ఆమె ర్యాంక్ ఇలా..


ఎంట్రన్స్ టెస్ట్ వివరాలు

ఇగ్నో యూనివర్సిటీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ద్వారా యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం అడ్మిషన్లను చేపట్టనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీస్, జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. ఫ్రీ కోచింగ్ స్కీమ్ కేవలం ఎస్సీ అభ్యర్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అలాగే రిజిస్టర్ చేసుకునే సమయంలో ప్రతి అభ్యర్థి, అధికారులు ధ్రువీకరించిన క్యాస్ట్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి.

అర్హత ప్రమాణాలు

కనీస అర్హత ప్రమాణంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యే సమయంలో పాస్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ పరీక్షకు ఎన్నిసార్లు హాజరైనప్పటికీ, కేవలం ఒక్కసారి మాత్రమే ఫ్రీ కోచింగ్ అందిస్తారు. ఈ పథకం కోసం మొత్తం 100 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 33 శాతం మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేయనున్నారు.

మరోవైపు, జూలై -2022 సెషన్ కోసం ఎంబీఏ (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఎంసీఏ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్) ప్రోగ్రామ్‌లలో ఇగ్నో యూనివర్సిటీ ప్రవేశాలను కల్పిస్తుంది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో జూలై 31లోపు దరఖాస్తు చేసుకోవాలని ఇగ్నో ట్విట్టర్‌లో వెల్లడించింది.

UPSC Civil Ranker: ఇలా చదివాడు కాబట్టే ఆల్ ఇండియా 28వ ర్యాంక్ సాధించాడు.. అతడి సక్సెస్ స్టోరీ మీ కోసం..


దీంతోపాటు వివిధ స్ట్రీమ్‌లలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. UG ప్రోగ్రామ్‌లలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బీఏ ఆనర్స్ సైకాలజీ, బీఏ ఆనర్స్ పొలిటికల్ సైన్స్, బీఏ ఆనర్స్ సోషియాలజీ, బీఏ ఆనర్స్ ఆంత్రోపాలజీ ముఖ్యమైనవి. అదేవిధంగా మాస్టర్స్ ప్రోగ్రామ్స్‌లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, MBA (బ్యాంకింగ్, ఫైనాన్స్), మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ ఆఫ్ సైన్స్ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (ఎకనామిక్స్) వంటివి ఉన్నాయి.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Civil Services, Preparation, UPSC

ఉత్తమ కథలు