Home /News /jobs /

FREE UPSC COACHING GOOD NEWS FOR THOSE WHO LOVE CIVILS AP STUDY CIRCLE OFFERING FREE COACHING TO THEM DETAILS HERE VB

Free Coaching In AP: ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండిలా..

Free Coaching In AP: ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండిలా..

Free Coaching In AP: ఆ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఫ్రీ కోచింగ్ కు దరఖాస్తు చేసుకోండిలా..

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సాంఘిక సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ST విద్యార్థులకు ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) సాంఘిక సంక్షేమ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎస్సీ, ST విద్యార్థులకు ఉచితంగా యూపీఎస్సీ కోచింగ్ అందించనున్నట్లు ప్రకటించింది. దీని కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రెస్ నోట్ ను విడుదల చేసింది. డా. బి.ఆర్.అంబేద్కర్ స్టడీ సర్కిల్ విశాఖపట్నం బ్రాంచ్ నందు, UPSC సివిల్స్ సర్వీసెస్ పరీక్షలు - 2023 సంవత్సరానికి ఈ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ కొరకు నిరుద్యోగ SC/ST మరియు ఇతర వర్గాల పట్టభద్రుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.

IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..


దానిలో మెరిట్ లో మార్కులు సాధించిన అభ్యర్థులను సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు పిలుస్తారు. దీనిలో అన్ని డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటేనే కోచింగ్ కు అనుమతిస్తారు. ప్రవేశ పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్ నిబంధనలకు లోబడి, కమ్యూనిటీల వారీగా, అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ ఎంట్రెన్స్ పరీక్షను ఆన్ లైన్ విధానంలో నిర్వహించున్నట్లు వెల్లడించారు. అయితే అభ్యర్థుల యొక్క కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6.00 లక్షలు మించరాదని ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పూర్తి వివరాల కొరకు apstdc.apcfss.in వెబ్ సైట్ ను సందర్శించాలన్నారు. అభ్యర్థులు apstdc.apcfss.inలో అందించిన వెబ్ లింక్ ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును నమోదు చేసి నింపాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీగా ఆగస్టు 10, 2022గా పేర్కొన్నారు.



ఈ కాన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) ద్వారా యూపీఎస్సీ ఉచిత కోచింగ్ కోసం అడ్మిషన్లను చేపట్టనున్నారు. ఈ ప్రవేశ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, లాంగ్వేజ్ స్కిల్స్, రీజనింగ్ ఎబిలిటీస్, జనరల్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయి. రిజిస్టర్ చేసుకునే సమయంలో ప్రతి అభ్యర్థి, అధికారులు ధ్రువీకరించిన క్యాస్ట్ సర్టిఫికేట్‌ను సమర్పించాలి. అంతే కాకుండా.. అర్హత సాధించిన అభ్యర్థులు స్టడీ సెంటర్ వద్ద క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికేట్ కూడా చూపించాల్సి ఉంటుంది. కనీస అర్హత ప్రమాణంగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.

Agniveer Preparation Tips: అగ్రివీరులుగా కొలువు సాధించాలంటే.. ఈ టాపిక్స్ పై ఎక్కువ దృష్టి పెట్టండి..


అలాగే ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు కోచింగ్ తరగతులు ప్రారంభమయ్యే సమయంలో పాస్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఈ పరీక్షకు ఎన్నిసార్లు హాజరైనప్పటికీ, కేవలం ఒక్కసారి మాత్రమే ఫ్రీ కోచింగ్ అందిస్తారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Free coaching, JOBS, UPSC

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు