నేషనల్ డిఫెన్స్ అకాడమీ (National Defense Academy) పరీక్షలకు సంబంధించి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC). ఎన్‌డీఏ, నావల్ అకాడమీ 2021 పరీక్షల కోసం అవివాహిత మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే మహిళా అభ్యర్థులు పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ విండోను తెరిచారు. ఈ నేపథ్యంలో త్రిపుర (Tripura) ప్రభుత్వం సరికొత్త నిర్ణయం ప్రకటించింది. ఈ పరీక్ష రాసే మహిళలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) కోసం స్కాలర్‌షిప్ (Scholarships)లను అందిస్తుంది. ఇందు కోసం రాష్ట్రంలోని మెరిటోరియస్ గర్ల్ స్టూడెంట్స్‌ని ఎన్‌డిఎ పరీక్షలకు సన్నద్ధం చేయడానికి ఎడ్‌టెక్ ప్లాట్‌ఫామ్ అన్‌కాడమీతో మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాండింగ్ (ఎంఒయు) పై సంతకం చేసింది. రాష్ట్రంలో 250 మంది ప్రతిభావంతులైన మహిళలను ఎంపిక చేసి శిక్షణ అందించనున్నారు.
సమగ్ర శిక్షా అభియాన్, విద్యా శాఖ, త్రిపుర ప్రభుత్వం మరియు అకాడెమీ రాబోయే 12 నెలల్లో రెండు ప్రతిభ పరీక్షలను నిర్వహిస్తుంది. ప్రతి పరీక్షలో 125 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు అన్‌కాడమీపై స్కాలర్‌షిప్‌లను అందించనుంది. మొత్తం 250 మంది బాలికలు ఈ స్కాలర్‌షిప్‌ల ప్రయోజనాలను పొందుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
DO Recruitment 2021 : డీఆర్డీఓ సీహెచ్ఈఎస్ఎస్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. జీతం రూ.54,000
నవరాత్రి సందర్భంగా..
ఈ అంశంపై త్రిపుర ప్రభుత్వ విద్య మంత్రి రతన్ లాల్ నాథ్ మాట్లాడారు. నవరాత్రి సందర్భంగా మహిళా అభ్యర్థుల కోసం ఈ పథకం ప్రవేశపెట్టామన్నారు. ఇది బాలికలకు నిజమైన సేవగా భావిస్తున్నామని ఆయన అన్నారు. త్రిపుర (Tripura) రాష్ట్రం ఈ దేశానికి సేవ చేసే మరింత మంది మహిళా యోధులను ఈ పథకం ద్వారా అందిస్తామని గర్వంగా తెలిపారు. నాణ్యమైన కంటెంట్‌కి ప్రాప్యత ఈ రక్షణ కోచింగ్ కార్యక్రమానికి కేంద్రంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
సుప్రీం తీర్పుతో అవకాశం..
ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగల భర్తీ కోసం యూపీఎస్‌సీ ఏటా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నావల్ అకాడమీ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఎన్‌డీఏ ప్రవేశపరీక్షలో దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు ఇప్పటివరకూ అనుమతి లేదు. అయితే ఇటీవల సుప్రీం కోర్టు.. మహిళలను కూడా ఎన్‌డీఏ పరీక్షకి దరఖాస్తు చేసుకునేందుకు అనుమతించాలని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా UPSC తాజా నిర్ణయం తీసుకుంది.
"నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ (II) 2021 పరీక్షలకు మహిళా అభ్యర్థులను అనుమతించాలని భారత సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను అనుసరించి యూపీఎస్‌సీ ఈ పరీక్ష కోసం దరఖాస్తు వెబ్‌సైట్ (upsconline.nic.in) లో ఆన్‌లైన్ పోర్టల్‌ను తెరవాలని నిర్ణయించింది. అవివాహిత మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హత ఉంటుంది” అని యూపీఎస్‌సీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NDA, Scholarships, Tripura, Women