హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హర్డ్​వేర్, కంప్యూటర్ నెట్​వర్క్ కోర్సుల్లో ఉచితశిక్షణ.. అప్లై చేసుకోండిలా

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. హర్డ్​వేర్, కంప్యూటర్ నెట్​వర్క్ కోర్సుల్లో ఉచితశిక్షణ.. అప్లై చేసుకోండిలా

కర్నూలు జిల్లాలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

కర్నూలు జిల్లాలో నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

ఎంతో మందికి టాలెంట్ ఉన్నా.. సరైన శిక్షణ లేకపోతే ఉద్యోగాలు సాధించడం కష్టం. అయితే, అందుకే ప్రభుత్వం నిరుద్యోగులకు హార్డ్‌వేర్, కంప్యూటర్ నెట్‌వర్క్ విభాగంలో ఉచితంగా శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Vijayawada | Visakhapatnam

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగ యువతీ, యువకులకు సువర్ణ అవకాశం.చదువు పూర్తి చేసి ఉద్యోగం కోసం చింతిస్తున్న గ్రామీణ యువతి యువకులకు చక్కటి అవకాశం ఉపయోగించుకోగలరు.వివిధ కోర్చులలో ఉచిత శిక్షణతో పాటు వసతి భోజనం సదుపాయం కూడా కల్పిస్తారు. గ్రామీణ యువతలో నైపుణ్యం పెంపొందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ SEEDAP సంయుక్త ఆధ్వర్యంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌసల్య యోజన ( DDU-GKY) ద్వారా THREDZ IT సంస్థ కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ( COMPUTER HARDWARE & NETWORKING ) కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నారు.

Thredz ఐటీ సంస్థలో  10వ తరగతి, ఇంటర్, ఆపై  చదువులు పూర్తిచేసిన నిరుద్యోగులకు (సిస్టమ్ హార్డ్‌వేర్ & నెట్‌వర్కింగ్)లో 3 నెలల పాటు, ఉచిత శిక్షణతో పాటు ఉచిత వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. శిక్షణ అనంతరం సెంట్రల్ గవర్నమెంట్ వారిచే గుర్తింపు పొందిన సర్టిఫికెట్ ఇచ్చి 100% ఉపాధి అవకాశం కల్పించబడును. ITI / డిప్లోమా(పాస్ లేదా ఫెయిల్) అయినవారి కోసం CNC టర్నింగ్‌తో కొత్త బ్యాచ్‌ని ప్రారంభించారు.

వయోపరిమితి: 19 ఏళ్లు- 25 ఏళ్లు

ప్రవేశానికి అవసరమైన పత్రాలు

1) అత్యధిక అర్హత సర్టిఫికేట్ (జిరాక్స్) 4సెట్లు

2) 10వ అర్హత సర్టిఫికేట్ (జిరాక్స్) 4సెట్లు

3) ఆధార్ (జిరాక్స్) 4సెట్లు

4) రేషన్ (జిరాక్స్) 4సెట్లు

5) బ్యాంక్ ఖాతా పాస్‌బుక్ (జిరాక్స్) 4సెట్లు

6) కుల ధృవీకరణ పత్రం (జిరాక్స్) 4సెట్లు

7) పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు 6

చిరునామా :-

D.No:76-8-8/2,1వ అంతస్తు, SBI బ్యాంక్ ఎదురుగా, మోడరన్ మార్ట్ పక్కన, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం,

విజయవాడ - 520012

సంప్రదించవలసిన ఫోన్నెంబర్లు:-

9398917633,

9393363422,

8886050579

ఆసక్తిగల అభ్యర్థులు మీ సీటును నిర్ధారించుకోవడానికి క్రింది లింక్‌లో వారి వివరాలను నమోదు చేయవచ్చు

https://forms.gle/BY6MUPJey2peJSbQ7

First published:

Tags: Andhra Pradesh, Career and Courses, Kurnool, Local News

ఉత్తమ కథలు