Venu, News18, Mulugu
తెలంగాణ (Telangana) రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (Telangana Police Recruitment Board) నియామకాలని వేగవంతం చేసింది. డిసెంబర్ (December) మొదటి వారంలో పోలీస్ ప్రాథమిక పరీక్ష ఉత్తీర్ణత సాధించిన వారికి ఫిజికల్ ఈవెంట్స్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ బోర్డ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలోనే అర్హత సాధించిన అభ్యర్థులు గ్రౌండ్లలో చమటలు చిందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఎన్నడూ లేని విధంగా పోలీస్ ఈవెంట్స్ లలో అనేక మార్పులను తీసుకువచ్చింది. గతంలో ఐదు కిలోమీటర్ల పరుగు పందెం అభ్యర్థులకు నిర్వహించేది.. తరువాత రిక్రూట్మెంట్స్ లో ఐదు కిలోమీటర్ల పందాన్ని తొలగించి ఎనిమిది వందల మీటర్ల పరుగు పందాన్ని అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం జారీ చేసిన నోటిఫికేషన్లు ఎనిమిది వందల మీటర్ల పరువు పందాన్ని రద్దుచేసి దాని స్థానంలో 1600 మీటర్ల పరుగుపందాన్ని అందుబాటులో ఉంచారు. సాధారణంగా 1600 పరుగు పందెం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో నిర్వహిస్తూ ఉంటారు. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో 16 మీటర్ల పరువు పందాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది.
ఉచిత శిక్షణ..!
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగం సంపాదించాలని అనేక మంది యువత తాపత్రయపడుతున్నారు. డబ్బులు ఉన్నవారు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు తీసుకుంటున్నారు. కానీ ములుగు లాంటి ఏజెన్సీ ప్రాంతాలలోని అభ్యర్థులు స్వతహాగానే ఈవెంట్స్ ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ములుగు జిల్లా యువతకు ములుగు జిల్లా పోలీసు యంత్రాంగం అండగా నిలబడింది. పోలీసు ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచిత శిక్షణను అందిస్తుంది. దాదాపు 80 మంది అభ్యర్థులు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ఈ శిక్షణ కార్యక్రమం ములుగు జిల్లా కేంద్రంలోని తంగేడు క్రీడా ప్రాంగణంలో అందుబాటులో ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ములుగు జిల్లా యువతకు ఎల్లప్పుడూ పోలీస్ యంత్రాంగం అందుబాటులో ఉంటుందని యువత కష్టపడి అనుకున్నది సాధించే వరకు పట్టు విడవకూడదు అని పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ శిక్షణ తంగేడు క్రీడా ప్రాంగణంలో ఉదయం ఆరు గంటల నుంచి 8 గంటల వరకు సాయంత్రం 4.30 నిమిషాల నుంచి 6 గంటల వరకు పోలీస్ వారి ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది.
ఇలాంటి కార్యక్రమాలు మాకు ఎంతగానో ఉపయోగపడతాయని ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా ఉందని అభ్యర్థులు చెప్తున్నారు. యువత కష్టపడితే దేనినైనా సాధించగలరని, ఈ శిక్షణ ద్వారా పోలీస్ ఈవెంట్స్ లో మెరిట్ మార్కులు సాధించి ఉద్యోగం సాధించే విధంగా సన్నద్ధం కావాలని ములుగు జిల్లా ఏఎస్పి యువతకు సూచించారు. ఉచిత శిక్షణలో అభ్యర్థులకు ములుగు సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ రంజిత్ కుమార్, వెంకటాపూర్ సబ్ ఇన్స్ స్పెక్టర్ తాజుద్దీన్ అభ్యర్థులకు ఎలా ప్రాక్టీస్ చేయాలి..? ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మెరిట్ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది అనే విషయంలో సూచనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Mulugu, Telangana