Home /News /jobs /

FREE ONLINE STUDY MAHARASHTRA GOVT INTRODUCES SPECIAL APP AND PORTAL FOR UKRAINE RETURNED MEDICAL STUDENTS EVK

Free Online Study: ఉక్రెయిన్ విద్యార్థుల‌కు ప్ర‌త్యేక యాప్‌, పోర్టల్‌.. ఫ్రీ ఆన్‌లైన్ కోర్సు ఏర్పాటు!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Ukraine-returned medical students | వైద్య కోర్సులు పూర్తి కాకుండానే ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే విద్యార్థుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నిడివి గల ఆన్‌లైన్ కోర్సును ప్రారంభించింది. ఉక్రెయిన్ తిరిగి వచ్చే విద్యార్థుల కోసం ఈ కోర్సును రాష్ట్ర ఆరోగ్య శాస్త్ర‌ విశ్వవిద్యాలయం రూపొందించింది.

ఇంకా చదవండి ...
    వైద్య కోర్సులు పూర్తి కాకుండానే ఉక్రెయిన్ (Ukraine)  నుంచి తిరిగి వచ్చే విద్యార్థుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల నిడివి గల ఆన్‌లైన్ కోర్సు (Online Course) ను ప్రారంభించింది. ఉక్రెయిన్ తిరిగి వచ్చే విద్యార్థుల కోసం ఈ కోర్సును రాష్ట్ర ఆరోగ్య శాస్త్ర‌ విశ్వవిద్యాలయం రూపొందించింది. కోర్సు డిజిటల్ కంటెంట్ నాసిక్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (MUHS) మరియు ఎల్సెవియర్ అనే ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. ఉచిత స్టడీ మాడ్యూల్‌ను మహారాష్ట్ర రాష్ట్ర వైద్య విద్య మంత్రి అమిత్ దేశ్‌ముఖ్, MUHS వైస్ ఛాన్సలర్ మాధురీ కనిట్కర్ ప్రారంభించారు.

    Jobs in AP: ఏపీవీవీపీలో 554 పోస్టులు.. వేత‌నం నెల‌కు రూ. 53,500.. దరఖాస్తుకు ఒక్కరోజే చాన్స్!

    విద్యార్థుల కోసం తాత్కాలిక ఏర్పాట్లు
    దీనిపై MUHS VC మాధురీ కనిట్కర్ మాట్లాడుతూ, "ఎల్సెవియర్ సహాయంతో MUHS ద్వారా డిజిటల్ కంటెంట్ అభివృద్ధి చేశామ‌ని అన్న‌రు. ఇది ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల కోసం స్వచ్ఛంద కోర్సు అని తెలిపింది. ఈ కోర్సు ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు తాత్కాలిక ఏర్పాటు మాత్ర‌మే అని తెలిపారు.

    ప్ర‌త్యే యాప్‌..
    విద్యార్థులు తమ ఫోన్‌లలో స్టడీ మెటీరియల్‌ని ఉపయోగించుకునేలా ఆన్‌లైన్ లెర్నింగ్ మాడ్యూల్ కోసం డౌన్‌లోడ్ చేసుకోదగిన మొబైల్ అప్లికేషన్‌ను వర్సిటీ అదనంగా అభివృద్ధి చేసిన‌ట్టు ఆమె తెలిపారు.

    RRB Group D Preparation: ఆర్ఆర్‌బీ గ్రూప్‌-డికి ఒక్క‌టే ప‌రీక్ష‌.. ప్రిప‌రేష‌న్, సిల‌బ‌స్ వివ‌రాలు

    MUHS పోర్టల్‌లో నమోదు
    కోర్సు ఉచితంగా ఉంటుందని అధికార వ‌ర్గాలు తెలిపాయి. MUHS VC, "ఆన్‌లైన్ కోర్సును అభ్యసించడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు MUHS పోర్టల్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోర్సు కోసం విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజు తీసుకోరు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చే విద్యార్థులకు ఈ మాడ్యూల్ ప్రయోజనకరంగా ఉంటుందని మహారాష్ట్ర (Maharashtra)  రాష్ట్ర వైద్య విద్య మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ అన్నారు. విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

    ESIC Recruitment 2022: హైద‌రాబాద్ స‌న‌త్‌న‌గ‌ర్‌లో 334 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు నాలుగు రోజులే చాన్స్‌

    "ఈ విద్యార్థుల విద్యా నష్టాన్ని నివారించడానికి, MUHS మరియు ఎల్సెవియర్ చాలా తక్కువ వ్యవధిలో వారికి ఉపయోగకరమైన కంటెంట్‌ను అందుబాటులో ఉంచారు" అని మంత్రి తెలిపారు. అంతే కాకుండా ఎల్సెవియర్‌కు చెందిన సీనియర్ అధికారి అమిత్ మోడీ ఈ కోర్సు గురించి మాట్లాడుతూ, "ఈ కోర్సును స్టాప్‌గ్యాప్ ఏర్పాటుగా అభివృద్ధి చేసినందున, ఈ కోర్సు వల్ల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోజనాలు ఉండవు. కానీ స‌బ్జెక్టుపై ప‌ట్టు పోకుండా నైపుణ్య ప‌రంగా ఉప‌యోగంగా ఉంటుంద‌ని నిపుణులు పేర్కొన్నారు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Career and Courses, EDUCATION, New apps, Online Education, Ukraine

    తదుపరి వార్తలు