Home /News /jobs /

FREE ONLINE COURSES FREE COUPONS FOR 12 LAKH STUDENTS MINISTRY OF EDUCATION REVEALED EVK

Free Online Courses: 12 లక్షల మంది విద్యార్థులకు ఉచిత‌ కూపన్‌లు.. విద్యా శాఖ వెల్ల‌డి

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Online Education | సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషనల్ ఆర్థికంగా, సామాజికంగా విద్యార్థులకు అలయన్స్ ఫర్ టెక్నాలజీ (National Educational Alliance for Technology) ద్వారా విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల కూప‌న్ల‌ను అందించ‌నుంది

ఇంకా చదవండి ...
    సమాజంలోని వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థుల‌కు మెరుగైన విద్య అందించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ కొత్త విధానం తీసుకొచ్చింది. నేషనల్ ఎడ్యుకేషనల్ ఆర్థికంగా, సామాజికంగా విద్యార్థులకు అలయన్స్ ఫర్ టెక్నాలజీ (National Educational Alliance for Technology) ద్వారా విద్యార్థుల‌కు ఆన్‌లైన్ లెర్నింగ్ కోర్సుల కూప‌న్ల‌ను అందించ‌నుంది. ఈ ప‌థ‌కంలో ప్ర‌భుత్వం 12ల‌క్ష‌ల కూప‌న్‌లు అందించ‌నుందని స‌మాచారం. ఈ స్కీమ్ (Scheme) ద్వారా నైపుణ్యం పెంచడం, రీస్కిల్లింగ్ చేయడం, విద్యార్థుల ఉపాధి నైపుణ్యాలను పెంచే విధంగా ఆన్‌లైన్ కోర్సు అందిస్తుంది. ఈ కోర్సులు విద్యార్థులను లేటెస్ట్ టెక్నాలజీస్, కంప్యూటర్ రంగంలో స్కిల్ పెంచుకోవ‌చ్చు. ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజ‌న్సీ (Artificial Intelligence) ద్వారా విద్యార్థుల వ్య‌క్తిగ‌త సామ‌ర్థ్యాల‌ను బ‌ట్టి స‌బ్జెక్టుల‌ను ఎంపిక చేస్తుంది.

    విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (All India Council of Technical Education) ప‌లు అంశాల ఆధారంగా కౌన్సిల్ ద్వారా ఎంపిక చేయబడిన ఆన్‌లైన్ లెర్నింగ్ (Online Learning) కోర్సులను అందించడానికి వివిధ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీలతో భాగస్వామ్యం కలిగి ఉంది. రిజిస్ట్రేష‌న్ పూర్తి చేసిన అభ్య‌ర్థులకు జ‌న‌వ‌రి 3, 2022 నుంచి కూప‌న్ల‌ను అందించే ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుంది.

    CAT 2021: క్యాట్‌-2021 ప‌రీక్ష రాశారా.. అడ్మిష‌న్ ప్ర‌క్రియ‌.. టాప్ బీ-స్కూల్ వివ‌రాలు


    నీట్ పోర్టల్ మొదటి దశ జనవరి 12, 2020న ప్రారంభించింది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మెరుగైన అవ‌కాశాలు క‌ల్పిండ‌మే ల‌క్ష్యం. డిమాండ్‌లో ఉన్న కోర్సులు (Courses), నైపుణ్యాలలో వారికి శిక్షణ ఇస్తారు.

    ఎడ్‌టెక్ కంప‌నీలు విద్యార్థుల‌కు స‌ర్టిఫికేష‌న్ కోర్సులు (Certification Courses) అందిస్తుంది. విద్యార్థుల‌కు మెరుగైన విద్య కోసం సైకోమెట్రిక్ పరీక్షలు, అసెస్‌మెంట్ పరీక్షలు, ప్రయోగశాల సాధనాలు, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు, కాగ్నిటివ్ స్కిల్స్‌ల‌ను నేర్పిస్తుంది.

    Jobs in Andhra Pradesh: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉద్యోగాలు.. రూ.65,000 వేత‌నం.. అర్హ‌త‌లు ఇవే!


    కేరీర్ స్కిల్స్ (Career Skills) లేస్‌మెంట్ సపోర్ట్, ఇంటర్న్‌షిప్ సపోర్ట్, మేనేజ్‌మెంట్, అకౌంట్ మరియు ఫైనాన్స్ లేదా ఇంజినీరింగ్ ఫార్మసీ అండ్ మేనేజ్‌మెంట్ యొక్క డిగ్రీ/డిప్లొమాకు సంబంధించిన ఏదైనా ఉప‌యుక్త‌మైన కోర్సు అందిస్తుంది.

    నీట్ (NEAT) ఎంపిక ప్రక్రియలో పాల్గొనే ముందు కంపెనీలు చెల్లింపు, వాపసు, కాపీరైట్, ఉత్పత్తి నాణ్యతను ప్రస్తావిస్తూ స్పష్టమైన నిరాకరణను ఉంచాలని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకంలో పాల్గొనడానికి, కంపెనీలు కూడా నిర్దిష్ట సంఖ్యలో కూపన్‌లను ముందుగానే AICTEకి సమర్పించాలి. ఇతర సీట్లకు, ఎడ్టెక్ కంపెనీలు తమ పాలసీ ప్రకారం రుసుము వసూలు చేయవచ్చు.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Artificial intelligence, Career and Courses, EDUCATION, Online Education

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు