FREE ONLINE COURSE ARE YOU DOING A JOB TRIAL TRY THESE FREE ONLINE COURSES EVK
Free Online Course: జాబ్ ట్రయల్ చేస్తున్నారా..? ఈ ఫ్రీ ఆన్లైన్ కోర్సులు ట్రై చేయండి!
(ప్రతీకాత్మక చిత్రం)
Free Online Course: ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్ (Recruitment) ల సంఖ్యను పెంచాయి. పోటీ కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యం (Special Skills) ఉంటే.. అందరి కన్నా భిన్నంగా ఉండి మెరుగైన ఉపాధి అవకాశాన్ని పొందవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా టీసీఎస్ ఆన్లైన్ ఉచిత కోర్సు (Free Course) అందిస్తోంది. ఈ కోర్సులతో మెరుగైన నైపుణ్యం పొదవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం.
Free Online Course: ప్రస్తుతం పలు ఐటీ కంపెనీలు కొత్త రిక్రూట్మెంట్ల సంఖ్యను పెంచాయి. పోటీ కూడా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక నైపుణ్యం ఉంటే.. అందరి కన్నా భిన్నంగా ఉండి మెరుగైన ఉపాధి అవకాశాన్ని పొందవచ్చు. అందుకోసం ప్రత్యేకంగా టీసీఎస్ ఆన్లైన్ ఉచిత కోర్సు అందిస్తోంది. ఈ కోర్సులతో మెరుగైన నైపుణ్యం పొదవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. ప్రముఖ ఐటీ దిగ్గజంటాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA Consultancy Services) గ్రాడ్యుయేట్స్‌కి శుభవార్త చెప్పింది. వారి కెరీర్‌కు ఎంతో ఊతమిచ్చేలా ఉచిత కోర్సులను అందించనుంది. ఇందు కోసం ‘TCS iON కెరీర్ ఎడ్జ్’ ను ప్రారంభిస్తోంది. ఈ కోర్సు ద్వారా పదిహేను రోజుల (Fifteen Days)పాటు కెరీర్ సంబంధిత కోర్సులను నేర్చుకోవచ్చు. ఈ కోర్సు యువతకు ఎంతో ఉపయోగపడుతోందని సంస్థ పేర్కొంది.
ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకొనే వారికి వారం రోజుల పాటు కనీసం 7 నుంచి 10 గంటల కోర్సు అందిస్తున్నారు. ప్రస్తుతం గ్రామీణ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న ఇంగ్లీష్ (English)పై ప్రత్యేక కోర్సు అందిస్తోంది. ఇది పూర్తిగా ఆన్లైన్ (Online) రూపంలో కోర్సు అందిస్తున్నారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు..
- అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు (Post Graduates), ఫ్రెషర్లు ఈ ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- ముఖ్యంగా బిహేవిరియల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, అకౌంటింగ్ ఐటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ (Artificial intelligence) పై కోర్సులో అందించనున్నారు.
- TCS iON కెరీర్ ఎడ్జ్ ప్రోగ్రాంలో యంగ్ ప్రొఫెషనల్ 14 మాడ్యూల్స్ అందిస్తుంది.
- ప్రతీ మాడ్యూల్‌కు 1 నుంచి 2 రెండు గంటల వ్యవధిలో వీడియోలు (Videos), ప్రెజెంటేషన్లు, రీడింగ్ మెటీరియల్ (Reading Material), టీసీఎస్ నిపుణుల ద్వారా రికార్డు చేయబడిన వీడియోలు, వెబ్నార్లు (Webinar) అందిస్తుంది.
- అంతే కాకుండా విద్యార్థులు తమ ప్రశ్నలు, సందేహలు నివృత్తి చేసుకొనే అవకాశం ఇస్తున్నారు.
- ఈ కోర్స్‌ను విజయవంతంగా మొత్తం పూర్తి చేసిన తరువాత ప్రతిభ ఆధారంగా సర్టిఫికెట్లను అందిస్తారు.
Step 3: అక్కడ మీకు కావాల్సిన కోర్సును ఎంచుకోవాలి.
Step 4: ప్రతీ కోర్సు స్ట్రక్చర్‌ను చూసుకొని ఎంచుకోవాలి.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.