హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Education : ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఉచితంగా వైద్య‌, ఇంజ‌నీరింగ్ కోచింగ్‌

Education : ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఉచితంగా వైద్య‌, ఇంజ‌నీరింగ్ కోచింగ్‌

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ అందించేందుకు ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. అదే 'చత్ర ఉత్సాహన్ యోజన' (Chatra Protsahan Yojana). ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఉచితంగా మెడిక‌ల్ లేదా ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌ల‌కు ఉచితంగా కోచింగ్ (Coaching) అందిస్తారు.

ఇంకా చదవండి ...

  ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల (Students) అభివృద్ధికి ప్ర‌భుత్వాలు ఎన్నో ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెడుతుంటాయి. చాలా ప‌థ‌కాలు వారికి అవ‌గాహ‌న లేక‌ స‌రిగా వినియోగించుకోలేరు. ప‌థ‌కాల ప‌ట్ల అవ‌గాహ‌న ఉండాలంటే ముందుగా వారి చ‌దువుకోవాలి. ఆ త‌ర్వాతే వారి అవ‌సరాలు ఏమిటీ.. ఏం అవ‌కాశాలు ఉన్నాయో తెలుసుకొని అభివృద్ధి చెందుతారు. ఈ విష‌యాన్ని గుర్తించింది ఒడిశా (Odisha) ప్ర‌భుత్వం ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ అందించేందుకు ప్ర‌త్యేక ప‌థ‌కాన్ని ప్ర‌వేశ పెట్టింది. అదే 'చత్ర ఉత్సాహన్ యోజన' (Chatra Protsahan Yojana). ఈ ప‌థ‌కం ద్వారా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల‌కు ఉచితంగా మెడిక‌ల్ లేదా ఇంజ‌నీరింగ్ ప‌రీక్ష‌ల‌కు ఉచితంగా కోచింగ్ (Coaching) అందిస్తారు.

  ఏమిటీ ప‌థ‌కం..

  ఒడిశా ప్ర‌భుత్వం ఎస్సీ,ఎస్టీల అభివృద్ధిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఏడు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ (Centre of Excellence) లను ప్రారంభిస్తుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం 320 మంది విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. కేంద్రాలు హైయ్య‌ర్‌ సెకండరీ పాఠశాలల విద్యార్థులను ఉన్నత విద్య వైపు ప్రోత్సహిస్తాయి. మెడికల్ (Medical) లేదా ఇంజనీరింగ్‌ (Engineering)లో ఉన్నత విద్య కోసం చిన్న వయస్సు నుంచే చురుకుగా ఉన్న‌ ST/SC విద్యార్థులను గుర్తించి వారిని మెరుగైన విద్య‌ను అందిస్తారు. ఈ విద్యార్థుల‌ను ఎస్‌ఎస్‌డి హైస్కూల్స్ నుంచి మెట్రిక్ ఉత్తీర్ణులైన విద్యార్థుల నుంచి స్టైడ్ ఎక్స్ మెరిట్ అండ్‌ సెలక్షన్ టెస్ట్ ఆధారంగా విద్యార్థులు ఎంపిక చేస్తారు.

  ఈ కార్యక్రమం కోసం కొన్ని ఏజెన్సీల‌తో ప్ర‌భుత్వం ఒప్పందం కుదుర్చుకొంది. వారు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ఎంపిక చేసిన ST/SC విద్యార్థులకు ఆన్-సైట్ మెడికల్ లేదా ఇంజనీరింగ్ కోచింగ్ అందిస్తారు. పథకాన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, పార్లమెంట్ సభ్యుడు (రాజ్యసభ), డాక్టర్ అమర్ పట్నాయక్ MPLAD నిధుల నుంచి 200 టాబ్లెట్‌లను ప్రోగ్రామ్‌లో పాల్గొనే విద్యార్థుల కోసం అందజేశారు. ఆయ‌న ఈ విష‌యాన్ని ట్వీట్ ద్వారా వెల్ల‌డించారు.

  ముఖ్యంగా మెట్రిక్ ప్రీక్ష‌, ఎస్ఎస్‌డీ హైస్కూల్ ప‌రీక్ష‌లో ఉత్త‌ర్ణులైన విద్యార్థులను స్టైడ్ ఎక్స్ మెరిట్ అండ్‌ సెలక్షన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఒడిశాలో ప్రతి సంవత్సరం హయ్యర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ (Examination_ వార్షికంలో 30.000 కంటే ఎక్కువ ST/SC విద్యార్థులు ప‌రీక్ష రాస్తారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: CAREER, EDUCATION, Engineering, Odisha, Odisha news

  ఉత్తమ కథలు