దేశ రక్షణలో ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించాలనే లక్ష్యంతో అడ్డా 247 అనే ఎడ్యుటెక్ పోర్టల్ కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర(Independence) దినోత్సవా లను పురస్కరించుకుని ‘వీర్ సమ్మాన్’ అనే ప్రోగ్రామ్‌ను ఈ సంస్థ ప్రారంభించింది. తద్వారా అసువులు బాసిన రక్షణ సిబ్బంది కుటుంబాలకు చెందిన పిల్లలు, వితంతువులకు సంవత్సరం పాటు నాణ్యమైన విద్యను అందించనుంది.
వీర్ సమ్మాన్ ప్రోగ్రామ్‌లో భాగంగా.. రక్షణ సిబ్బంది పిల్లలు- వితంతువులు ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న అనేక కోర్సు(Courses)ల్లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. సంవత్సరం పాటు ఉచిత విద్యను పొందవచ్చు. బ్యాంకింగ్, యూపీఎస్సీ(UPSC), ఎస్ఎస్‌సీ, రైల్వేస్, టీచింగ్(Teaching), డిఫెన్స్, గేట్ వంటి అడ్డా247 ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్న కోర్సుల్లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 14-15 తేదీల్లో జరగనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. కోర్సుకు సంబంధిత ఫ్రూప్స్ సమర్పించి ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా అడ్డా247 సీఈవో అనిల్ నగర్ మాట్లాడుతూ.. “అమరవీరుల త్యాగాలను గౌరవించడానికి, వారి కుటుంబాలకు విద్యను బహుమతిగా అందించడం కోసం మా ‘వీర్ సమ్మాన్’ ఒక చిన్న అడుగు. ఇది ప్రారంభం మాత్రమే. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాం.’’ అని పేర్కొన్నారు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ షిల్లాంగ్ (IIM Shilong) సైతం రక్షణ అధికారుల కోసం ఆరు నెలల బిజినెస్ మేనేజ్‌మెంట్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. అనలిటికల్, స్ట్రాటజిక్, ఎంటర్ ప్రెన్యూయల్ థింకింగ్ ద్వారా సమగ్ర వ్యాపార నిర్వహణ స్కిల్స్ అందించడమే ఈ ప్రోగ్రామ్ లక్ష్యం. అలాగే మిలిటరీ, కమర్షియల్ సెక్టార్లలలో నాలెడ్జ్-యాక్షన్ గ్యాప్‌ను తగ్గించడం, ఆల్టరింగ్ డైనమిక్స్‌లను మేనేజ్ చేయడం వంటివి కూడా ఈ ప్రోగ్రామ్ లక్ష్యాలు.
ఈ కోర్సులో భాగంగా ఇంటరాక్టివ్ లెక్చర్స్, కేస్ స్టడీస్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్ సెషన్స్, మేనేజ్‌మెంట్ గేమ్స్, సిమ్యులేషన్స్, స్టూడెంట్స్ పార్టిసిపేషన్ వంటి సెషన్స్ ఉంటాయి. ఈ కోర్సు భారతీయ రక్షణ దళాలకు అనుభవపూర్వక అభ్యాసాన్ని నొక్కి చెప్పడానికి ప్రయత్నిస్తుంది.
మరోవైపు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ (IIT Roorkee) ప్రోగ్రామబుల్ రేడియోల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి, స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ పవర్ యాంప్లిఫయర్‌లను అభివృద్ధి చేయనుంది. ఇందుకోసం డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO)తో కలిసి పనిచేయనుంది. వీటిని డీఆర్‌డీవోకు చెందిన డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్ లాబొరేటరీ (డీఈఏఎల్) డెవలప్ చేయనుంది. ఇందుకోసం పనిచేసే పరిశోధన టీమ్ కు ఐఐటీ రూర్కీ ప్రొఫెసర్ కరుణ్ రావత్ నేతృత్వం వహించనున్నారు. డీఈఏఎల్ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల బృందానికి పినాకి సేన్ నేతృత్వం వహించనున్నారు. వీరంతా ఏకకాలంలో సిగ్నల్స్ కోసం అధిక-సామర్థ్య అవసరాల (థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం) గుడ్ లీనియరిటీని తీర్చగలిగే యాంప్లిఫయర్‌లను డెవలప్ చేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Independence Day 2022, Indian Army, JOBS