Online Classes: పేద విద్యార్థుల కోసం ఉచిత మొబైల్ లైబ్రరీ

కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూతబడ్డాయి. ఈ విద్యా సంవత్సరంలోనూ స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో పిల్లలంతా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు మారారు. కానీ ఆర్థికంగా వెనుకబడిన, పేద కుటుంబాల్లోని విద్యార్థులకు ఇది శాపంగా మారింది. వారికోసం మహారాష్ట్రకు చెందిన ఒక సంస్థ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది.

news18
Updated: October 20, 2020, 1:40 PM IST
Online Classes: పేద విద్యార్థుల కోసం ఉచిత మొబైల్ లైబ్రరీ
file image
  • News18
  • Last Updated: October 20, 2020, 1:40 PM IST
  • Share this:
కరోనా మహమ్మారి వల్ల పాఠశాలలు మూతబడ్డాయి. ఈ విద్యా సంవత్సరంలోనూ స్కూళ్లు తెరుచుకోలేదు. దీంతో యాజమాన్యాలు, ప్రభుత్వాలతో పాటు తల్లిదండ్రులు కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు మారారు. కానీ ఆర్థికంగా వెనుకబడిన, పేద కుటుంబాల్లోని పిల్లలకు ఇది శాపంగా మారింది. ఇలాంటి వారికి ల్యాప్ టాప్స్, స్మార్ట్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేక ఆన్లైన్ క్లాసులకు దూరంగా ఉంటున్నారు. దీన్ని గుర్తించిన ముంబై మున్సిపల్ కార్పొరేషన్, ప్రైవేట్ ఉర్దూ టీచర్స్ యూనియన్ సంస్థలు పిల్లల సమస్యలకు పరిష్కారం చూపించాలనుకున్నాయి. ఇందుకు మొబైల్ ఫోన్ లైబ్రరీని ఏర్పాటు చేసి పిల్లలకు తమవంతు సాయం చేస్తున్నాయి ఆ సంస్థలు.

ఈ ఫ్రీ మొబైల్ లైబ్రరీని ముంబైలోని ఇమామ్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు దీన్ని అందుబాటులో ఉంచారు. మొబైల్ ఫోన్లు కొనలేని వారు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఇప్పుడు 'ఫ్రీ డిజిటల్ ఆన్లైన్ మొబైల్ ఎడ్యుకేషన్ లైబ్రరీ' ద్వారా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ఇప్పటివరకు 22 మంది విద్యార్థులు ఇక్కడ నమోదు చేసుకున్నారు.

ఉచితంగా సేవలు
కోవిడ్ నిబంధనలు (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్- SoP) పాటిస్తూ ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నామని సెంటర్ ఇన్ఛార్జ్ షాహినా సయీద్ చెబుతున్నారు. “కొంతమంది విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు ఉండవు. లేదంటే వారి కుటుంబంలో ఒక స్మార్ట్ఫోన్ మాత్రమే ఉంటుంది. అలాంటి పిల్లలకు మేము ఉచితంగా మొబైల్ లైబ్రరీ ఆన్లైన్ క్లాసులను ప్రారంభించాం. విద్యార్థులకు వారి పాఠశాల యాజమాన్యాలు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తున్నాయి. వారి సిలబస్ పూర్తవుతోంది. ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు తరగతులు ఉంటాయి” అని ఆమె చెప్పారు. ఈ కేంద్రంలో ప్రస్తుతం 10 స్మార్ట్ఫోన్లు, ఉచిత వై-ఫై సౌకర్యాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచారు.

పేద విద్యార్థులకు ప్రయోజనం
పేద విద్యార్థులు ఈ కేంద్రం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఇక్కడి సేవలను వినియోగించుకుంటూ సమయానికి ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నానని చెబుతోంది స్థానిక పదో తరగతి విద్ధార్థిని అయెషా అహ్మద్. “మా ఇంట్లో ఒక మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. దీంతో ఆన్లైన్ క్లాసులు ప్రారంభించినప్పటి నుంచి ఎన్నోసార్లు తరగతులకు హాజరు కాలేకపోయాను. ఇప్పుడు ఆ సమస్య లేదు” అని అయెషా తెలిపింది. మూడవ తరగతి చదువుతున్న కవిత కూడా, తాను తరగతులన్నింటికీ సకాలంలో హాజరవుతున్నాని చెబుతోంది. “మా నాన్న స్థానిక భవనంలో క్లీనర్గా పనిచేస్తున్నాడు. మాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. అన్ని సమయాలలో మొబైల్ అందుబాటులో ఉండదు. ఈ కేంద్రాన్ని ప్రారంభించినందుకు యూనియన్కు కృతజ్ఞతలు” అని చెప్పిందామె.

త్వరలోనే విస్తరణ:  తమ సేవలను విస్తరించే పనిలో ఉన్నారు నిర్వాహకులు. త్వరలోనే మరో రెండు ఆన్లైన్ మొబైల్ లైబ్రరీ సెంటర్లను ప్రారంభిస్తామని వారు చెబుతున్నారు. ముంబైలోని బాంద్రా, సకినాకా ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
Published by: Srinivas Munigala
First published: October 20, 2020, 1:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading