Home /News /jobs /

FREE CRASH COURSE FOR JEE MAIN ASPIRANTS HERES HOW TO ACCESS STUDY MATERIAL GH VB

JEE Main Aspirants: JEE మెయిన్‌ పరీక్ష రాసేవారికి గుడ్ న్యూస్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main Aspirants: జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ మెయిన్‌ 2022 పరీక్ష రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎడ్‌టెక్‌ కంపెనీ ఎక్స్‌ట్రా మార్క్స్. ఈ అభ్యర్థుల కోసం ఉచితంగా ఆ అవకాశాన్ని కల్పించారు.

జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ (JEE) మెయిన్‌ 2022 పరీక్ష(Exam) రాసే విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఎడ్‌టెక్‌ కంపెనీ ఎక్స్‌ట్రా మార్క్స్ (Extramarks). ఈ అభ్యర్థుల కోసం ఉచితంగా ఆన్‌లైన్‌ క్రాష్‌ కోర్స్‌ను (Crash course)ప్రారంభించింది. ఈ ప్లాట్‌ఫాం ద్వారా విద్యార్థులు అవసరమైన స్టడీ మెటిరీయల్‌(Study Material) పొందవచ్చు. సంస్థకు చెందిన యూట్యూబ్ ఛానెల్‌(Youtube Channel), లెర్నింగ్‌ యాప్‌ ద్వారా వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమ్యాటిక్స్‌ సబ్జెక్టుల్లో నిపుణులైన ఫ్యాక్టలీ, JEE ఎక్స్‌పర్ట్స్‌ ఈ సెషన్స్‌ నిర్వహిస్తారు. కరోనా(Corona) మహమ్మారి కారణంగా ఆఫ్‌లైన్‌లో చదువుతున్న వేల మంది విద్యార్థుల ప్రిపరేషన్‌ (Preparation) ప్రభావితమైంది. అందుకే ఎక్స్‌ట్రా మార్క్స్‌ సంస్థ వీరికి చేయూత అందిస్తోంది.

IIT, NIT Admissions: ఐఐటీలో ఇంజనీరింగ్​ చేయడమే మీ లక్ష్యమా..? అయితే, జేఈఈ మెయిన్​​ కోసం ఇలా ప్రిపేవరవ్వండి..


విద్యార్థులకు ఎక్స్‌ట్రామార్క్స్‌ JEE యూట్యూబ్‌ ఛానెల్‌, ఎక్స్‌ట్రామార్క్స్‌ – లెర్నింగ్‌ యాప్‌ ద్వారా JEE ప్రిపరేషన్‌ మెటిరీయల్‌ ఉచితంగా అందిస్తోంది. 50 మంది IITians, NITians తమ అనుభవంతో కలిసిక్టటుగా రూపొందించిన JEE క్రాష్‌ కోర్సు కంటెంట్‌ కూడా ఇందులో ఉంది. ఇందులో రకరకాల టాపిక్స్‌, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌, కాన్సెప్ట్‌ క్లారిటీ, కఠినమైన ప్రశ్నలను ఎలా ఎదుర్కొవాలనే విషయాలు కూడా నేర్పిస్తారు.

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..


Extramarksలోని అనుభవజ్ఞులైన JEE ఫ్యాకల్టీ, నిపుణుల సహకారంతో రూపొందించిన ఈ క్రాష్‌ కోర్సు మొత్తం సిలబస్‌ను 70 రోజుల్లో కవర్‌ చేస్తుంది. ఇందులో 115 గంటలకు పైగా లైవ్‌ సెషన్లు, 13 కాంప్లిమెంటరీ మాక్‌ టెస్టులు, 70 ప్రాక్టీస్‌ వర్క్‌షీట్లు ఉంటాయి. కాన్సెప్టులన్నింటినీ పూర్తి క్లారిటీతో అందించే ఈ కోర్సు పూర్తిగా ఉచితం. లైవ్‌ సెషన్స్‌ ఇంగ్లిష్‌, హిందీలో ఉంటాయి.

ప్రిపరేషన్‌కు మరింత తోడ్పాటు అందించేందుకు ప్రయారిటీ టాపిక్స్‌కు సంబంధించి ప్రాథమిక విషయాలన్నింటినీ అంటే అన్ని స్థాయిల వారు బిగినర్స్‌, ఇంటర్మీడియట్స్‌ లేదా అడ్వాన్స్‌డ్‌కు నిపుణులు తెలియజేస్తారు. విద్యార్థులకు పరీక్షకు సంసిద్ధులను చేసేందుకు టిప్స్‌, ట్రిక్స్‌, డౌట్‌ సాల్వింగ్‌, ఎర్రర్‌ అనాలసిస్‌ వంటివి కూడా నిపుణులు వివరిస్తారు.

IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..


మొత్తం JEE అభ్యర్థుల్లో కేవలం 0.5 శాతం మంది మాత్రమే ప్రతిష్ఠాత్మక IITలు, NITలు, GFTIలలో సీట్లు సంపాదించుకోగలుగుతారు. కాబట్టి JEE రాస్తున్న ప్రతీ ఒక్కరికీ తమ పరీక్ష ప్రిపరేషన్‌లో సరైన గైడెన్స్‌, రీసెర్స్‌తో కూడిన అప్రోచ్‌ అవసరం. JEE సిలబస్‌ మొత్తాన్ని పూర్తి చేసేందుకు సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల కాంప్రహెన్సివ్‌ కాన్సెప్ట్స్‌ కవర్‌ చేస్తూ, ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చేసేలా వ్యూహం ఉండాలి. పూర్తి సిలబస్‌కు సంబంధించిన సమగ్ర పరిజ్ఞానంతో పాటు, కాన్సెప్ట్స్‌, టాపిక్స్‌ వివరిస్తూ రోజూ టెస్టులు, డైలీ అసైన్‌మెంట్స్‌తో విద్యార్థులు మెరుగైన ర్యాంకు సాధించగలరు. ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాజా క్రాష్ కోర్సును ప్రారంభిస్తున్నట్లు Extramarks సంస్థ ప్రకటించింది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు