Home /News /jobs /

FREE COURSE UK UNIVERSITY FREE ONLINE CLASSES ON DATA ANALYSIS STARTING APRIL 25 GH VB

Free Course: డేటా ఎనాలసిస్‌పై ఫ్రీ ఆన్‌లైన్ క్లాసులు..ఏప్రిల్ 25 నుంచి ప్రారంభం.. ఆ వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్‌కు యూకేలోని ఎసెక్స్ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. బిజినెస్, సర్వీసెస్, ప్రొడక్ట్స్‌కు సంబంధించిన ‘డేటా’.. విప్లవాత్మకమైన మార్పులకు ఎలా నాంది పలుకుతుందనే అంశంపై ఉచిత ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్ సిరీస్‌ను ప్రకటించింది.

ఇంకా చదవండి ...
బిజినెస్ మేనేజ్‌మెంట్ స్టూడెంట్స్‌కు యూకేలోని ఓ యూనివర్సిటీ గుడ్ న్యూస్ చెప్పింది. బిజినెస్(Business), సర్వీసెస్(Services), ప్రొడక్ట్స్‌కు(Products) సంబంధించిన ‘డేటా’(Data).. విప్లవాత్మకమైన మార్పులకు ఎలా నాంది పలుకుతుందనే అంశంపై ఉచిత ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్ సిరీస్‌ను ప్రకటించింది. దీనికి ‘Flooded by data: What can businesses do with the huge volumes of data they collect’ అనే టైటిల్ ఇచ్చింది సదరు యూనివర్సిటీ(University). ఈ ఆన్‌లైన్ మాస్టర్‌క్లాస్‌ ఏప్రిల్ 25న ప్రారంభం కానుంది. ఉచిత ఆన్‌లైన్ మాస్టర్‌క్లాస్.. వ్యాపారానికి సంబంధించి డేటా అనలిటిక్స్‌లో కీలక విషయాలను కవర్ చేయనుంది. బిజినెస్ అనలిటిక్స్ సెషన్ల ద్వారా అగ్రిఫుడ్ బిజినెస్‌‌‌లో డేటా, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, ఫైనాన్స్‌తోపాలు చిన్న వ్యాపారాల్లో సైతం డేటాను ఎలా ఉపయోగించుకోవచ్చో వివరించనున్నారు. మొత్తం ఐదు సెషన్లకు‌ గాను నాలుగింటికి హాజరైన అభ్యర్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇవ్వనున్నారు. ఆసక్తి ఉన్నవారు  లింక్‌పై క్లిక్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు.

OnePlus Nord N20: వన్‌ప్లస్ నుంచి మరో మిడ్ రేంజ్ ఫోన్ లాంచ్.. 64 MP ట్రిపుల్ కెమెరాతో పాటు టాప్ ఫీచర్లు..


బిజినెస్ స్కూల్‌కు చెందిన వివిధ రకాల నిపుణులు 90 నిమిషాల మాస్టర్‌ క్లాస్‌ని హోస్ట్ చేయనున్నారు. వ్యాపారంలోని ప్రతి అంశాన్ని డేటా ఎలా ప్రభావితం చేస్తుందన్న దానిపై వీరు ప్రాక్టికల్‌గా, థియరీ రూపంలో వివరించనున్నారు.  యూనివర్సిటీలో MSc బిజినెస్ అనలిటిక్స్ కోర్సు డైరెక్టర్ ప్రొఫెసర్ రామనాథన్ ‘బిగ్ డేటా అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ల ద్వారా వ్యర్థాలను తగ్గించి అగ్రిబిజినెస్ సప్లై చెయిన్‌ల వనరుల సామర్థ్యాన్ని మెరుగుపరచడం’ అనే పరిశోధన ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్నారని తెలిపింది. ఈయన ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్‌లో ప్రసగించినున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.

రామనాథన్ మాట్లాడుతూ.. ఈ సెషన్ ఇండియన్ కాంటెక్ట్స్‌లో చాలా ప్రాధాన్యత ఉందన్నారు . బిగ్ డేటా అనలిటిక్స్‌తో భారతదేశంలో ప్రతి సంవత్సరం 67 మిలియన్ టన్నుల ఆహార వృధాను అరికట్టవచ్చన్నారు. దీని విలువ సుమారు రూ.92 వేల కోట్లు ఉంటుందని ఆయన అంచనా వేశారు. ఆ లెక్కన ఒక ఏడాది పాటు బీహార్‌కు ఆహారం సరఫరా చేయవచ్చని చెప్పారు.

విద్యార్థులకు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో వ్యాపారం, డేటా అధ్యయనానికి ఆన్‌లైన్ మాస్టర్ క్లాస్ ప్రోగ్రామ్ పరిచయ వేదిక లాంటిదని రామనాథన్ అన్నారు. అలాగే ఈ రంగాల్లోని ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు పరిచయం చేయడమే తమ లక్ష్యమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశాలు భారతీయ వ్యాపారాలకు అత్యవసరమని... ఎందుకంటే భారత వ్యాపారులు డేటా శక్తిని నైతిక మార్గంలో ఉపయోగించుకోవాలని చూస్తున్నారు అని రామనాథన్ చెప్పుకొచ్చారు.

ఇది చదవండి: రోజా ఆ పనిచేస్తే ఇక తిరుగుండదు..! చరిత్రలో నిలిచిపోవడం ఖాయం..!


ఇవే కాకుండా విభిన్న అంశాలపై ఇతర సెషన్లు నిర్వహించనున్నారు. అగ్రిఫుడ్ బిజినెస్‌కు ‘డేటా’ ఎలా సహాయపడుతుందన్న దానిపై ప్రొఫెసర్ రామకృష్ణన్ రామనాథన్‌ సప్లై చైన్ ద్వారా వివరించనున్నారు. అంతర్జాతీయ మార్కెటింగ్‌లో మెథడాలాజికల్ అంశాలు, న్యూ ఇన్‌సైట్స్ కోసం డేటా వంటి అంశాలపై డాక్టర్ రెబెక్కా (యు)లి, అతి చిన్న వ్యాపారాల కోసం డేటాను ఎలా సేకరించాలి అనే అంశంపై డాక్టర్ మార్టా ఫెర్నాండెజ్ డి అర్రోయాబే అర్రాంజ్‌ వివరించనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, JOBS, University

తదుపరి వార్తలు