FREE COACHING ALERT FOR IIT EAMCET PREPARED STUDENTS GOVERNMENT PROVIDING FREE COACHING EVK
Free Coaching: ఎంసెట్, ఐఐటీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అలర్ట్.. ఉచిత కోచింగ్ అందిస్తున్న ప్రభుత్వం
tscie
Free Online Coaching | తెలంగాణ (Telangana) ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎంసెట్, నీట్, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ (Free coaching) అందిస్తోంది. ఈ కోచింగ్ దరఖాస్తు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది.
తెలంగాణ (Telangana) ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలిపింది. ఎంసెట్, నీట్, ఐఐటీ ప్రిపర్ అయ్యే విద్యార్థులకు ఉచిత కోచింగ్ (Free coaching) అందిస్తోంది. ఈ కోచింగ్ దరఖాస్తు కోసం ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఈ ప్రక్రియకు తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా స్పందన వస్తోంది. దాదాపుగా 20,000 మంది విద్యార్థులు ఇప్పటికే రిజిస్టర్ చేసుకొన్నారు. ఏటా 2,000 మంది విద్యార్థులకు ర్యాంకుల ఆధారంగా కోచింగ్ ఇస్తారు.
ఈ ఏడాది ఎంసెట్, నీట్, ఐఐటీ, సీఏ సీపీటీ- 2022 ఆన్లైన్ షార్ట్ టర్మ్ కోర్సు (Online Short term course) ల కోచింగ్‌లను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. జూన్ 6, 2022 ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ ఉచిత కోర్సులకు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్ల చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అధికారిక వెబ్సైట్ https://tscie.rankr.io/ ను సందర్శించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొన్న విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తారు.
విద్యార్థులు ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఇన్స్టిట్యూట్లు, ఎయిడెడ్, ప్రైవేటు కాలేజీలో చదువుతున్నా సరే వారికి ఉచితంగా శిక్షణ అందిస్తారు. కోచింగ్ అందించే యంత్రాంగం విద్యార్థులకు వీడియో క్లాస్‌లు అందిస్తారు. ఈ క్లాస్‌లు యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచుతారు. యూట్యూబ్ (YouTube) చానల్ పేరు "డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ-లర్నింగ్ తెలంగాణ" చానల్లో వీడియోలు అందుబాటులో ఉంటాయి. ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న వారు ఈ ఫ్రీ కోచింగ్‌ను వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.