దేశ సేవకు ఇదే టైమ్.. ఆర్మీలో చేరాలనుకునే యువతకు శుభవార్త..

Free Army Training in Hyderabad : సైనికుడిగా దేశ సేవ చేయాలనుకుంటున్నారా? బోర్డర్‌కు వెళ్లి దేశానికి రక్షణగా నిలవాలనుకుంటున్నారా? శత్రు మూకల భరతం పట్టాలనుకుంటున్నారా? అయితే.. యువతకు శుభవార్త.

news18-telugu
Updated: March 2, 2020, 10:59 AM IST
దేశ సేవకు ఇదే టైమ్.. ఆర్మీలో చేరాలనుకునే యువతకు శుభవార్త..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సైనికుడిగా దేశ సేవ చేయాలనుకుంటున్నారా? బోర్డర్‌కు వెళ్లి దేశానికి రక్షణగా నిలవాలనుకుంటున్నారా? శత్రు మూకల భరతం పట్టాలనుకుంటున్నారా? అయితే.. యువతకు శుభవార్త. ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకు శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ తరఫున ఫిజికల్ ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వనున్నారు. హాస్టల్ ఫుడ్, వసతి ఉచితమేనని ఆర్మీలో బ్లాక్ కమెండోగా పనిచేసిన సాయి కృష్ణారెడ్డి తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే యువతకు ఈ అవకాశం కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. తానే స్వయంగా ఫిజికల్‌ ట్రైనింగ్ ఇస్తానని, ఫిజికల్ టెస్ట్‌ను 100 శాతం క్లియర్ చేయించే బాధ్యత తనదేనని ఆయన వివరించారు.

ఫిజికల్ ట్రైనింగ్‌ను తట్టుకునే సామర్థ్యం ఉంటే మార్చి 15లోపు తల్లిదండ్రులతో కలిసి అకాడమీకి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. మెడికల్ టెస్ట్ చేసిన తర్వాతే విద్యార్థులకు అకాడమీలోకి తీసుకుంటామని అన్నారు. ఆర్మీ ట్రైనింగ్ సెంటర్ గోల్కొండ దగ్గర శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీలో ఉంటుందని స్పష్టం చేశారు.

First published: March 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading