CBSE పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. తాజాగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెకింగ్ డిపార్ట్‌మెంట్ నకిలీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వెబ్‌సైట్‌కు సంబంధించి విద్యార్థులను హెచ్చరించింది. అక్రమంగా బోర్డ్ ఎగ్జామ్ విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్ ఫీజును వసూలు చేస్తున్నట్లు పేర్కొంది. cbsegovt.com పేరిట ఉన్న వెబ్‌సైట్ నకిలీదని, సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డుతో ఎలాంటి సంబంధం లేదని బ్యూరో తెలిపింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ట్వీట్
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో షేర్ చేసిన ఇమేజ్ ప్రకారం.. నకిలీ వెబ్‌సైట్‌లో 'అడ్మిట్ కార్డ్ పేమెంట్' లింక్ కనిపిస్తోంది. విద్యార్థులు పరీక్షలు, డేట్ షీట్, లేదా ఫలితాలకు సంబంధించి ఏ అప్‌డేట్స్‌కైనా CBSE అధికారిక వెబ్‌సైట్ cbse.gov.inను సంప్రదించాలని విద్యార్థులకు సూచించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ చేసిన ఒక ట్వీట్‌లో.. ఫ్రాడ్ అలెర్ట్: బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి నకిలీ వెబ్‌సైట్ (https://cbsegovt.com) రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేస్తోంది. ఈ వెబ్‌సైట్‌కు CBSE అధికారిక వెబ్‌సైట్ http://cbse.gov.inతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
త్వరలో ఎగ్జామ్ డేట్ షీట్ విడుదల
CBSE బోర్డు పరీక్షల 2023 డేట్ షీట్ త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి వస్తుందని తెలిపింది. సోషల్ మీడియాలో నకిలీ డేట్ షీట్ కూడా సర్క్యులేట్ అవుతోందని PIB పేర్కొంది. డేట్ సీట్ విడుదలైన తర్వాత.. 10, 12 తరగతుల విద్యార్థులు CBSE అధికారిక సైట్ cbse.gov.inలో, cbse.nic.inలో చెక్ చేసుకోవచ్చు. ఈ నెలలోనే CBSE 10, 12 తరగతుల డేట్ షీట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. 10, 12వ తరగతుల తుది పరీక్షలు 2023 ఫిబ్రవరి 15న ప్రారంభమవుతాయని CBSE ఇప్పటికే ప్రకటించింది.
⚠️FRAUD ALERT⚠️ A registration fee is being demanded from students on a fake website (https://t.co/ufLUWFe0lK) for appearing in board examinations#PIBFactcheck ▶️This website is not associated with @cbseindia29 ▶️Official website of CBSE is "https://t.co/8Y8fKLU0Mu" pic.twitter.com/0CndyxoVm0
— PIB Fact Check (@PIBFactCheck) December 14, 2022
డేట్ షీట్ చెక్ చేయడం ఎలా?
CBSE డేట్ షీట్‌ను cbse.gov.in, cbse.nic.inలలో విడుదల చేస్తుంది 10వ తరగతి విద్యార్థులు సబ్జెక్ట్ వారీగా పరీక్ష తేదీలను తెలుసుకోవడానికి 10వ తరగతికి సంబంధించిన CBSE డేట్ షీట్ 2023ని చెక్ చేసుకోవాలి. 12వ తరగతి విద్యార్థులు సబ్జెక్టుల వారీగా పరీక్ష తేదీలను తెలుసుకోవడానికి 12వ తరగతికి సంబంధించిన CBSE డేట్ షీట్ 2023ను చెక్ చేయాలి. ఇదిలా ఉండగా CBSE పదో తరగతి, పన్నెండో తరగతి ప్రాక్టికల్ పరీక్షల తేదీ, సబ్జెక్ట్ మార్కుల బ్రేకప్‌ను బోర్డు ప్రకటించింది. 10, 12వ తరగతికి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షలు 2023 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. తేదీని విడుదల చేస్తూనే, బోర్డు విద్యార్థులు, పాఠశాలలు, ప్రాంతీయ కార్యాలయాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, CBSE, Fake sites, JOBS