హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

TSPSC Notification : టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్.. రేపే దరఖాస్తులకు చివరి తేదీ..

ఇటీవల తెలంగాణలో పలు ఉద్యోగాల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం.. వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది.  దాదాపు టీఎస్పీఎస్సీ నుంచి 8 నోటిఫికేషన్లకు పైగా వచ్చాయి. అందులో భాగంగానే ఆగస్టు 22, 2022న ఓ నోటిఫికేషన్(Notification) వెలువడింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఇటీవల తెలంగాణలో పలు ఉద్యోగాల పోస్టులకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి పొందడం.. వెంటనే టీఎస్పీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు విడుదల కావడం జరిగింది.  దాదాపు టీఎస్పీఎస్సీ నుంచి 8 నోటిఫికేషన్లకు పైగా వచ్చాయి. అందులో భాగంగానే ఆగస్టు 22, 2022న ఓ నోటిఫికేషన్(Notification) వెలువడింది. అదే తెలంగాణలోని (Telangana) ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నారు. దీనికి దరఖాస్తులు ఈ నెల 6 నుంచి ప్రారంభం అయ్యాయి. దరఖాస్తులు సమర్పించడానికి రేపే (సెప్టెంబర్ 27) చివరి తేదీగా ఉంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేసి దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

దీని ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం 27 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా నియమిస్తారు. దరఖాస్తు ఫీజును రూ.500 గా నిర్ణయించారు. ఈ ఫీజును ఆన్ లైన్ విధానంలోనే చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా టీఎస్పీఎస్సీ వెబ్ సైట్లో ఓటీఆర్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే చేసుకున్న అభ్యర్థులు ఓటీఆర్ నంబర్ ను ఎంటర్ చేసి.. తగిన వివరాలతో దరఖాస్తును పూర్తి చేయాలి.

India Post Recruitment 2022: టెన్త్ అర్హతతో ఇండియా పోస్ట్‌లోజాబ్స్ .. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

ప్రొఫెసర్ పోస్టులు..

టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల్లో ప్రొఫెసర్ పోస్టులు 02 ఉన్నాయి. ఇవి వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాల్లో ఖాళీగా ఉన్నాయి. వీటికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 55 శాతం మార్కులతో ఎంఎస్సీ చేసి ఉండాలి. వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగంలో ఉత్తీర్ణత సాధించాలి. పీహెచ్‌డీ అభ్యర్థులు అయితే.. వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ వంటి విభాగాల్లో చేసి ఉండాలి. పని అనుభం 10 ఏళ్ల వరకు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

అసోసియేట్ ప్రొఫెసర్స్..

టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల్లో మరో విభాగం అసోసియేట్ ప్రొఫెసర్స్. ఇవి మొత్తం 04 ఖాళీగా ఉన్నాయి. అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. 55 శాతం మార్కులతో ఎంఎస్సీ అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్రీ/సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ ఫారెస్ట్ బయాలజీ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/ ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ & ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ వంటి సబ్జెక్టులో పీజీ ఉండాలి.

పీహెచ్‌డీ అయితే.. అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/ ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్ లో అర్హత ఉండాలి. వీటితో పాటు.. నెట్/స్లెట్/సెట్ లో క్వాలిఫై అయి ఉండాలి. వీరికి కనీస అనుభవం 8 సంవత్సరాలు ఉండాలి.

Police Jobs 2022: 12వ తరగతి అర్హతతో.. సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్..

అసిస్టెంట్ ప్రొఫెసర్..

అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 21 ఉన్నాయి. జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్‌లైఫ్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 55 శాతం మార్కులతో ఎంఎస్సీ పూర్తి చేసి ఉండాలి. అది కూడా.. జియో-ఇన్‌ఫర్మేషన్ సైన్స్ అండ్ ఎర్త్ అబ్జర్వేషన్/జియో స్పేషియల్ టెక్నాలజీ/ఫారెస్ట్రీ/సిల్వీకల్చర్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ/ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ప్లాంట్ బయోటెక్నాలజీ/ఫారెస్ట్ మేనేజ్‌మెంట్/వైల్డ్ ‌లైఫ్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్/ బోటనీ తదితర సబ్జెక్టుల్లో పీజీ ఉండాలి. ఈ పోస్టులకు ఎంలాటి పని అనుభవం అవసరం లేదు.

Software Jobs: ఉద్యోగుల సంఖ్యను 10వేలకు పెంచుకోనున్న సంస్థ.. 2500 వరకు ఉద్యోగాలు ఖాళీ..

జీతం..

పోస్టును బట్టి జీతభత్యాలలో తేడా ఉంటుంది. ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200,, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,31,400, ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 చెల్లిస్తారు.

వయో పరిమితి..

అభ్యర్థులక యొక్క వయోపరిమితి 21 నుంచి 61 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో మాత్రమే సమర్పించాల్సి ఉంటుంది.

First published:

Tags: Career and Courses, JOBS, TSPSC, Tspsc application fee, Tspsc jobs

ఉత్తమ కథలు