• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • FOREST COLLEGE AND RESEARCH INSTITUTE FCRI WALK IN FOR SELECTION OF PROJECT ASSISTANT AND FIELD ASSISTANT POSTS SS

Telangana Jobs: ఫారెస్ట్ కాలేజీలో ఉద్యోగాలు... ఫిబ్రవరి 3న ఇంటర్వ్యూ

Telangana Jobs: ఫారెస్ట్ కాలేజీలో ఉద్యోగాలు... ఫిబ్రవరి 3న ఇంటర్వ్యూ

Telangana Jobs: ఫారెస్ట్ కాలేజీలో ఉద్యోగాలు... ఫిబ్రవరి 3న ఇంటర్వ్యూ (ప్రతీకాత్మక చిత్రం)

FCRI Recruitment 2020 | తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • Share this:
    నిరుద్యోగులకు శుభవార్త. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ప్రాజెక్ట్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 15 ఖాళీలున్నాయి. ఈ పోస్టులకు నేరుగా ఇంటర్వ్యు నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 3న ఇంటర్వ్యూ జరగనుంది. ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. నోటిఫికేషన్ పూర్తిగా చదివిన తర్వాత తగిన విద్యార్హతలు ఉన్నవారు దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి నేరుగా ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి క్యాంపస్‌లో ఉచిత వసతి సౌకర్యం ఉంటుంది. ఈ జాబ్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://www.fcrits.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

    Fcrits Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలివే...


    మొత్తం ఖాళీలు- 15
    ప్రాజెక్ట్ అసిస్టెంట్- 13
    ఫీల్డ్ అసిస్టెంట్- 2
    విద్యార్హతలు- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
    వయస్సు- 28 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు.
    ఎంపిక ప్రక్రియ- ఇంటర్వ్యూ
    ఇంటర్వ్యూ జరిగే తేదీ- 2020 ఫిబ్రవరి 3 ఉదయం 10 గంటలు
    ఇంటర్వ్యూ జరిగే స్థలం: ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ములుగు, సిద్దిపేట
    వేతనం- ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుకు రూ.12,500 నుంచి రూ.18,000. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకు రూ.10,000.
    నోటిఫికేషన్, దరఖాస్తు ఫామ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

    Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    ఇవి కూడా చదవండి:

    CTET 2020: టీచర్ కావడం మీ కలా? సీటెట్‌కు అప్లై చేయండి ఇలా

    Jobs: ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీలో జాబ్స్... నోటిఫికేషన్ వివరాలివే

    Resume Tips: ఉద్యోగానికి అప్లై చేస్తున్నారా? రెజ్యూమెలో ఈ పాయింట్స్ మర్చిపోవద్దు
    Published by:Santhosh Kumar S
    First published:

    అగ్ర కథనాలు