FOREIGN APPLICANTS TO TAKE JEE ADVANCED EXAM FROM INDIA AT THEIR OWN EXPENSE EVK
JEE Advance: విదేశాల్లో జేఈఈ పరీక్షా కేంద్రాలు లేవు.. ఇండియా కొచ్చి రాయాల్సిందే
(ప్రతీకాత్మక చిత్రం)
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ విదేశీ దరఖాస్తుదారుల కోసం JEE అడ్వాన్స్‌డ్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సారి ఎవరైన విదేశాల్లో చదవుకొన్న వారు జేఈఈ అడ్వాన్స్ (JEE Advance) పరీక్ష రాయాలనుకొంటే తమ సొంత ఖర్చులతో భారతదేశానికి వచ్చి పరీక్ష రాసి వెళ్లాల్సిందే అని పేర్కొన్నారు.
భారతీయ ఐఐటీలో చదివేందుక విదేశీయులకు ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ విదేశీ దరఖాస్తుదారుల కోసం JEE అడ్వాన్స్‌డ్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ సారి నోటిఫికేషన్‌లో ఎలాంటి మార్పులు లేక పోయిన పరీక్ష కేంద్రానికి సంబంధించిన మార్పులను నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఎవరైతే ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ రాయాలనుకుంటారో వారు jeeadv.ac.in వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాలి. అర్హతలు..
JEE (అడ్వాన్స్‌డ్) 2021 పరీక్ష రాసేందుకు విదేశాల్లో చదివిన విద్యార్థులు 12 తరగతి లేదా సమాన స్థాయిలో చదివి ఉండాలి. వారు భారతీయ విద్యార్థులు రాసినట్టు ఐఐటీ జేఈఈ మెయిన్స్ రాయాల్సిన అవసరం లేదు. నేరుగా ఐఐటీ జేఈఈ అడ్వాన్స్ రాయవచ్చు. ఈ పరీక్షకు ఐఐటీ జేఈఈ మెయిన్స్ పాసైన ఇండియన్ విద్యార్థులతో పాటు ఇప్పుడు దరఖాస్తు చేసుకొనే విదేశాల్లో చదివిన వారు అర్హులు. ప్రస్తుతం ఈ ఏడాది జేఈఈ మెయిన్స్‌లో ఇండియాలో 2,50,000 మంది భారతీయ విద్యార్థులు అర్హత సాధించారు.
సాధారణంగా విదేశాల్లో రాసే వారికి పలు దేశాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం విదేశాల్లో పరీక్షా కేంద్రాలను ఎత్తివేశారు. ఎవరైన విదేశాల్లో చదవుకొన్న వారు జేఈఈ అడ్వాన్స్ పరీక్ష రాయాలనుకొంటే తమ సొంత ఖర్చులతో భారతదేశానికి వచ్చి పరీక్ష రాసి వెళ్లాల్సిందే అని పేర్కొన్నారు.
సార్క్ (SAARC) దేశాలకు చెందిన విద్యార్థులు ఈ పరీక్ష రాయాలనుకుంటే 75 డాలర్ల ఫీజు చెల్లించాలి. ఇతర దేశస్తులకు 150 డాలర్ల ఫీజు చెల్లించాల్సిందిగా పేర్కొన్నారు.
విదేశీ విద్యార్థులకు ప్రతీ కోర్సులో 10శాతం సీట్లను కేటాయిస్తారు. ప్రస్తుతం అమల్లో ఉన్న GEN-EWS, OBC-NCL, SC, ST రిజర్వేషన్‌లు కాక ఇవి విడిగా తీసుకొంటారు.
జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు 2020లో ఎవరైతే విజవయంతంగా దరఖాస్తు చేసుకొని.. పరీక్ష రాయలేని వారు కూడా జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షకు అర్హులే. కానీ వారు ఆన్‌లైన్‌లో జేఈఈ అడ్వాన్స్ 2021 పరీక్షకు మళ్లీ రిజిస్ట్రర్ చేసుకొని ఫీజు చెల్లించాల్సిందే. జెఈఈ దరఖాస్తుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.