సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( Central Board of Secondary Education) అనుబంధ పాఠశాలలకు చెందిన 22 మంది ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయులను సత్కరించింది. ఈ కార్యక్రమాన్ని ఆన్లైన్ (Online)లో నిర్వహించారు. ఈ అవార్డు గెలుచుకొన్న వారికి రూ.50,000 బహుమతిగా అందించారు. అంతే కాకుండా వారికి మెరిట్ సర్టిఫికెట్ (Certificate) అందించారు. విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి, అనిత కార్వాల్ సెక్రటరీ (SE&L), మనోజ్ అహుజా, సీబీఎస్ఈ (CBSE) చైర్పర్సన్ మరియు కార్యదర్శి అనురాగ్ త్రిపాఠి ఈ వర్చువల్ అవార్డు వేడుకలో పాల్గొన్నారు. దర్బరీ లాల్ డీఏవీ (DAV) మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రీనా రాజ్ పాల్, షాలిమార్ బాగ్, స్మారానికా పట్నాయక్, భువనేశ్వర్ లోని డీఏవీ (DAV) పబ్లిక్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ (English Teacher), ఘజియాబాద్ లోని ఉత్తమ్ స్కూల్ ఫర్ గర్ల్స్ ప్రిన్సిపాల్ షర్మిలా రహేజా అవార్డు పొందినవారిలో ఉన్నారు.
CBSE congratulates recipients of awards for Excellence in Teaching & School Leadership 2020 21#CBSE #TeachersAward pic.twitter.com/dDJoi1tL3z
— CBSE HQ (@cbseindia29) September 21, 2021
22 మంది పురస్కార గ్రహీతలు ప్రాథమిక, మధ్య, మాధ్యమిక, సీనియర్ సెకండరీ స్థాయి ఉపాధ్యాయులని సీబీఎస్ఈ తెలిపింది. ఈ ఉపాధ్యాయులు కరోనా సమయంలో తమ బోధనా పద్ధతిలో వినూత్నంతో జోడించి బోధించారని పేర్కొంది. అంతే కాకుండా కాకుండా, COVID-19 మహమ్మారి సమయంలో సవాళ్లను ఎదుర్కొంటు ఆన్లైన్ పద్ధతిలో నిరంతరాయంగా బోధనను అందించారని సీబీఎస్ఈ తెలిపింది.
TGWDCW Jobs: టీజీడబ్ల్యూడీసీడబ్ల్యూలో 265 అంగన్వాడీ ఉద్యోగాలు
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి మాట్లాడారు. ప్రస్తుతం కోవిడ్ 19 సమయంలో ఉపాధ్యాయులు మరింత సవాళ్లతో పని చేయాలన్నారు. కోవిడ్ (Covid 19) వల్ల విద్యార్థులు బోధనకు దూరం కాకుండా చూసే బాధ్యత ఉపాధ్యాయులదే అన్నారు. పిల్లలను చదువలపై నిమగ్నం చేసేలా వినూత్న బోధనకు శ్రీకారం చూట్టాలని సూచించారు. వైద్యులు, నర్సులు వంటి వారితో పాటు టీచర్లు కూడా కరోనా వారియర్స్ (Corona Warriors) కేటగిరీలో చేర్చడానికి వారి కృషి కూడా కారణం అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, Covid -19 pandemic, Education CBSE, Teaching