హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 5043 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..

Government Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 5043 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. వివరాలిలా..

Jobs In BARC: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు..

Jobs In BARC: బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు..

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న  పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 5043 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 6వ తేదీన ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 6ను ఆఖరి తేదీగా నిర్ణయించారు అధికారులు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్‌ను నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ మరియు నార్త్-ఈస్ట్ జోన్‌లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం కోసం నిర్వహిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్ సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.  అర్హత ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

Tenth Class Fail Jobs: 10వ తరగతి ఫెయిల్ అయినా.. ఉద్యోగం సాధించవచ్చు.. ఏ రంగంలో అంటే..


ఖాళీల వివరాలు ఇలా..

ఖాళీల వివరాలు ఇలా..

నార్త్ జోన్- 2388 ఖాళీలు

సౌత్ జోన్- 989 ఖాళీలు

ఈస్ట్ జోన్- 768 ఖాళీలు

వెస్ట్ జోన్- 713 ఖాళీలు

నార్త్ ఈస్ట్ జోన్- 185 ఖాళీలు

అర్హతలు ఇలా..

నోటిఫికేషన్ ప్రకారం.. మెకానికల్‌లో సివిల్ ఇంజనీర్, ఎలక్ట్రికల్ ఇంజనీర్ మరియు జూనియర్ ఇంజనీర్, స్టెనో గ్రేడ్-3 మరియు AG-3 జనరల్, అకౌంట్స్, టెక్నికల్, డిపో, హిందీ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.

JE (EME) - 1 సంవత్సరం అనుభవంతో EE/ME ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.

JE (సివిల్) - 1 సంవత్సరం అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా.

AG-III (టెక్నికల్) – అగ్రికల్చర్ / బోటనీ / బయాలజీ / బయోటెక్ / ఫుడ్‌లో గ్రాడ్యుయేషన్.

AC-III (జనరల్) - గ్రాడ్యుయేషన్ డిగ్రీ, కంప్యూటర్ నాలెడ్జ్.

AG-III (అకౌంట్స్) - B.Com మరియు కంప్యూటర్ నాలెడ్జ్.

AG-III (డిపో) - గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ నాలెడ్జ్.

హిందీ టైపిస్ట్ AG-II (హిందీ) - హిందీ టైపింగ్‌లో నిమిషానికి 30 వర్డ్స్ స్పీడ్, గ్రాడ్యుయేషన్. అనువాదంలో 1 సంవత్సరం అనుభవం.

స్టెనో గ్రేడ్-II - DOEC O స్థాయి సర్టిఫికేట్‌తో గ్రాడ్యుయేట్. టైపింగ్ మరియు స్టెనో పరిజ్ఞానం.

ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. రెండు ఫేజ్ లలో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి. స్టెనో పోస్టులకు సంబంధించి స్కిల్/టైపింగ్ టెస్ట్ ఉంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో ఫేజ్-1 ఎగ్జామ్ సెంటర్లు: నెల్లూరు , విజయవాడ , కాకినాడ, కర్నూలు , తిరుపతి , విజయనగరం, రాజమండ్రి , ఏలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి.

Postal Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల..


దరఖాస్తు విధానం

Step 1: ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/ ను సందర్శించండి.

Step 2: రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలను నమోదు చేయండి.

Step 3: రిజిస్ర్టేషన్ సక్సెస్ అయిన తరువాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు ఈ వివరాలను సేవ్ చేసుకోవాలి.

Step 4: నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం.. స్కాన్ చేసిన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.

Step 5: ఆ తరువాత ఎడ్యుకేషన్ వివరాలను నమోదు చేయండి.

Step 6: చివరిగా దరఖాస్తును సబ్‌మిట్ చేసే ముందు, మొత్తం అప్లికేషన్‌ను ప్రివ్యూ చేయడానికి, ధృవీకరించడానికి ప్రివ్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 7: వెరిఫై చేసిన తరువాత ఫైనల్‌గా సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.

Step 8: ఆ తరువాత ఫీజు పేమెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Step 9: ఫీజు పేమెంట్ పూర్తయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈమేరకు అభ్యర్థుల ఇమెయిల్ ఐడీ/ఫోన్ నంబర్‌కు మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Central Government Jobs, Fci jobs, Food corporation, JOBS

ఉత్తమ కథలు