హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Jobs In FCI: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు..

Jobs In FCI: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 5043 ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొన్ని రోజులే గడువు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Jobs In FCI: ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) కేటగిరీ 3 కింద నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ని సందర్శించడం ద్వారా అక్టోబర్ 05, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ( FCI ) కేటగిరీ 3 కింద నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌ల (Non Excutive Posts) కోసం దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులను ఆహ్వానించింది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ fci.gov.in ని సందర్శించడం ద్వారా అక్టోబర్ 05, 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్(Recruitment Drive) ద్వారా మొత్తం 5043 ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారు.  అభ్యర్థులు ముఖ్యమైన తేదీలు, ఖాళీ వివరాలు మరియు ఇతర వివరాలను ఇక్కడ  చూసుకోవచ్చు.

FCI కేటగిరీ 3 ఖాళీల వివరాలు

నార్త్ జోన్ : 2388 పోస్టులు

సౌత్ జోన్ : 989 పోస్టులు

ఈస్ట్ జోన్: 768 పోస్టులు

వెస్ట్ జోన్ : 713 పోస్టులు

NE జోన్: 185 పోస్టులు

విద్యార్హతలు ఇలా..

జేఈ (సివిల్ ఇంజినీరింగ్): సివిల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

JE (ఎలక్ట్రికల్ మెకానికల్): ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదా మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతోపాటు ఏడాది అనుభవం ఉండాలి.

స్టెనో గ్రేడ్- II: గ్రాడ్యుయేట్ డిగ్రీ తో పాటు.. ఇంగ్లీష్ టైపింగ్ నిమిషానికి 40 wpm ఉండాలి.

AG-III (జనరల్): కంప్యూటర్ వినియోగంలో నైపుణ్యంతో పాటు.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ.

AG-III (ఖాతాలు): కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ పూర్తి చేయాలి.

AG-III (డిపో) : కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు.. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

Abroad For Education: విదేశాల్లో చదువు కోసం వెళ్తున్నారా..? అయితే వీటిని తప్పక తెలుసుకోండి..

దరఖాస్తు రుసుము

జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.800 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు ఇలా..

సెప్టెంబర్ 06, 2022 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి మరియు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ అక్టోబర్ 05, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ పరీక్ష అనేది జనవరి 2023లో నిర్వహిస్తారు. అడ్మిట్ కార్డులు పరీక్షకు పది రోజుల ముందు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. పూర్తి వివరాలకు https://www.fci.gov.in వెబ్‌సైట్‌ సందర్శించాలి.

Jobs In SSC: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మరో భారీ నోటిఫికేషన్.. డిగ్రీతో 990 పోస్టులు భర్తీ..

దరఖాస్తు విధానం

స్టెప్-1:ఎఫ్‌సీఐ అధికారిక వెబ్‌సైట్ https://fci.gov.in/ ను సందర్శించండి.

స్టెప్-2: రిజిస్ట్రేషన్ కోసం మీ వివరాలను నమోదు చేయండి.

స్టెప్-3: రిజిస్ర్టేషన్ సక్సెస్ అయిన తరువాత తాత్కాలిక రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ కేటాయిస్తారు. భవిష్యత్ అవసరాల కోసం అభ్యర్థులు ఈ వివరాలను సేవ్ చేసుకోవాలి.

స్టెప్-3: నోటిఫికేషన్‌లో పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం.. స్కాన్ చేసిన ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయండి.

స్టెప్-4: ఆ తరువాత ఎడ్యుకేషన్ వివరాలను నమోదు చేయండి.

స్టెప్-5: చివరిగా దరఖాస్తును సబ్‌మిట్ చేసే ముందు, మొత్తం అప్లికేషన్‌ను ప్రివ్యూ చేయడానికి, ధృవీకరించడానికి ప్రివ్యూ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-6: వెరిఫై చేసిన తరువాత ఫైనల్‌గా సబ్‌మిట్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-7: ఆ తరువాత ఫీజు పేమెంట్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

స్టెప్-8: ఫీజు పేమెంట్ పూర్తయితే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఈమేరకు అభ్యర్థుల ఇమెయిల్ ఐడీ/ఫోన్ నంబర్‌కు మెయిల్ లేదా మెసేజ్ వస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Fci jobs, JOBS

ఉత్తమ కథలు