ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోందని, దరఖాస్తు చేయాలంటూ కొన్ని పత్రికల్లో ప్రకటనలు రావడంతో సోషల్ మీడియాలో ఆ యాడ్స్ సర్క్యులేట్ అయ్యాయి. కానీ అవి తప్పుడు ప్రకటనలని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-FCI క్లారిటీ ఇచ్చింది. ఎఫ్‌సీఐలో జేఈ, స్టెనో, టైపిస్ట్, అసిస్టెంట్ లాంటి పోస్టులకు www.fcinet.in వెబ్సైట్లో దరఖాస్తు చేయాలన్నది ఆ ప్రకనట సారాంశం. ఈ అడ్వర్టైజ్మెంట్ గురించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దృష్టికి వచ్చింది. దీంతో ఎఫ్‌సీఐ స్పందించింది. "సంబంధం లేని వ్యక్తులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు ఉన్నాయని అభ్యర్థులను మోసం చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. ఫేక్ రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్లు, కాల్ లెటర్స్, అపాయింట్మెంట్ లెటర్స్, కల్పిత సందేశాలతో మోసం చేస్తున్నారని గుర్తించాం" అని ఎఫ్‌సీఐ స్పందించింది.
ఎఫ్‌సీఐలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఏవైనా కనిపిస్తే అభ్యర్థులు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్లో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ ఫేక్ యాడ్స్‌లో ఎఫ్‌సీఐ లోగోను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. దీంతో అభ్యర్థులు ఈజీగా మోసపోయే అవకాశముంది. అభ్యర్థులు www.fcinet.in వెబ్‌సైట్‌ను నమ్మొద్దు. ఉద్యోగ ప్రకటనల గురించి ఎఫ్‌సీఐ అధికారిక వెబ్సైట్ http://fci.gov.in/ మాత్రమే ఫాలో కావాలి. ఫేక్ జాబ్స్‌పై ఎఫ్‌సీఐ జారీ చేసిన నోటీస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.