హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Make Money Online: ఆన్లైన్లో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే.. ఆలస్యం చేయకుండా ఈ విషయాలు తెలుసుకోండి

Make Money Online: ఆన్లైన్లో ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే.. ఆలస్యం చేయకుండా ఈ విషయాలు తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అదనంగా ఆదాయం సంపాదించాలంటే ఆన్లైన్లో అది సాధ్యమవుతుంది. మీకు నచ్చిన రంగంలో సెకెండ్ జాబ్ చేసే చాన్స్ ఇస్తుంది ఆన్ లైన్ మార్కెట్. మరెందుకు ఆలస్యం మీ ప్యాషన్ కు మరింత పదును పెట్టి అదనపు ఆదాయాన్ని ఆర్జించే మార్గాలను గూగుల్ లో సర్ఫ్ చేయండి మరి.

ఇంకా చదవండి ...

మీరు ఆర్ధిక కష్టాల్లో కూరుకుపోయారా, లేక కరోనా కారణంగా మీరు చేస్తున్న ఉద్యోగం పోయిందా, వర్క్ ఫ్రం హోం (work from home) మాత్రమే కావాలనుకుంటున్నారా అయితే వీటన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం ఆన్లైన్ లో డబ్బు సంపాదించటం. ఇప్పుడు ప్రపంచమంతా వర్చువల్ వరల్డ్ (virtual world) గా మారిపోయిన నేపథ్యంలో అన్ని వర్గాలవారు, అన్ని వృత్తుల వారు ఈజీగా సెకెండ్ ఇన్ కం (second income) సంపాదించేందుకు చక్కటి మార్గాలను అందిస్తోంది ఆన్ లైన్ మార్కెట్ . ఫుల్ టైం జాబ్ చేస్తూనే పార్ట్ టైం లేదా ఫ్రీనాలాన్సర్ (freelancer) గా ఇలాంటి ఉద్యోగాలు ఇంటిపట్టున ఖాళీ సమయంలో చేసుకోవచ్చు. టన్నుల కొద్దీ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఇంటర్నెట్ లో డబ్బు సంపాదించుకోవచ్చు. భవిష్యత్తులో ఆన్లైన్ జాబ్స్ మార్కెట్ మరింత విస్తృతం కానుంది కనుక ఇంట్లోనే డెస్క్ టాప్ పెట్టుకుని, దానికి ఇంటర్నెట్ కనెక్షన్ సదుపాయాన్ని కల్పించుకోండి.

వేగంగా పనిచేసేందుకు అవసరమైన కీ బోర్డ్ షార్ట్ కట్స్ పై కాస్త అవగాహన కలిగిఉంటే చాలు, మీరు ఎంచుకున్న రంగంలో మీరు మీ అసమాన ప్రతిభను ప్రపంచానికి చాటుకునే వేదిక వర్చువల్ వరల్డ్ కల్పిస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఇలాంటి ఆన్లైన్ జాబ్స్ ను ఎంచుకునే చాన్సులు ఉన్నాయి. దేశవిదేశాల్లోని వారికి మీలోని టాలెంట్ ను చూపి, మీ సత్తా చాటుకుని, కాసిన్ని డబ్బులు వెనకేసుకోవాలంటే ఆన్లైన్ అత్యుత్తమ మార్గం.

ఇలాంటి టాప్ 5 మార్గాలు..

1. ఆన్లైన్ సర్వేస్..

కొన్ని ఆన్లైన్ సర్వేల్లో పాల్గొంటే మీకు డబ్బు చెల్లిస్తారు Get paid for taking surveys at home. మీరు చేయాల్సిందల్లా వాళ్లడిగే ఫలానా సబ్జెక్టుపై మీ అభిప్రాయాన్ని చెప్పటమే. మార్కెటర్స్, కంపెనీలతో మిమ్మల్ని అనుసంధానం చేసే సర్వే సైట్లు మీ ఫీడ్ బ్యాక్ ను నిజాయితీగా చెప్పమంటాయి. పలు వస్తువులు, సేవలపై వినియోగదారులుగా మీ అభిప్రాయం, అనుభవాన్ని వారితో పంచుకోవాలన్నమాట. సాధారణంగా వీరు పేపాల్ ద్వారా లేదా గిఫ్ట్ కార్డ్ ద్వారా మీకు పేమెంట్లు చేస్తాయి. గిఫ్ట్ కార్డులంటే పాపులర్ రెస్టారెంట్ లేదా స్టోర్స్ లో ఉపయోగించేలా ఉంటాయి.

2. ఫ్రీలాన్సర్

కాంట్రాక్ట్ వర్క్ ద్వారా మీకు నచ్చిన సమయంలో పనిచేసుకునే సౌలభ్యం ఉన్న ఫ్రీలాన్సింగ్ Freelancing ఉద్యోగాలు కల్పించే వెబ్ సైట్లు చాలా ఉన్నాయి. రైటర్, మ్యూజీషియన్, ప్రోగ్రామర్ ఇలా ఏ వృత్తికి చెందినవారైనా ఫ్రీలాన్సింగ్ జాబ్స్ దొరికిపోతాయి. Upwork or Fiverr వంటి సైట్లలో ఇలాంటి అవకాశాలు లభిస్తాయి. మీ రెజ్యూమ్ ను బట్టి మిమ్మల్ని ఉద్యోగావకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఇలాంటి వాటిలో ఫుల్ టైమ్ జీతం ఇచ్చే వెసులుబాటు ఉండటం హైలైట్.

3. టెస్ట్ వెబ్ సైట్స్

ఆన్ లైన్ సర్వేల్లానే వెబ్ సైట్లను, యాప్స్ ను టెస్ట్ చేసే జాబ్ ప్రొఫైల్స్ ఆన్లైన్లో ఉన్నాయి. అంటే ఆయా వెబ్సైట్స్, యాప్స్ ను మీరు టెస్ట్ చేసినందుకు డబ్బు చెల్లిస్తారన్నమాట. UserTesting.com వంటి వాటిలో 20 నిమిషాల టెస్టులు ఉంటాయి. వెబ్సైట్స్ లోకి లాగిన్ అయినప్పటి నుంచీ అవి ఎలా పనిచేస్తున్నాయి, వాటిలో ఉన్న లోటుపాట్లేంటో అన్నవి మీ మాటల్లో వివరిస్తే సరిపోతుంది. వినియోగదారులతో మీరు వర్చువల్ చాట్ చేస్తే ఎక్కువ డబ్బు చెల్లిస్తారు.

4. ఆన్లైన్ లో సేల్స్

మీరు వదిలించుకోవాలనుకున్న పాత వస్తువులు, బట్టలు ఉన్నాయా వాటిని ఆన్ లైన్లో సేల్ కు పెట్టండి. అంతేకాదు పాత వస్తువులు, పెయింటింగ్స్, పుస్తకాలు, వంటింటి సామాను ఒక్కటేమిటి ఇలా మీకు వద్దనుకున్నవన్నీ అమ్మకానికి పెట్టవచ్చు. అపురూపమైన వస్తువులు సేకరించేవారికి మీ ఇంట్లో వెరైటీ వస్తువు ఏదైనా దొరకచ్చు, అది మీవద్ద ఎక్కువ డబ్బు చెల్లించైనా వారు కొంటారు. eBay వంటివి యూజ్డ్ క్లోత్స్, వస్తువులను అమ్మటానికి పెట్టింది పేరు. అంతేకాదు ఇంట్లో తయారు చేసిన వస్తువులు కూడా మీరు ఇలా అమ్మచ్చు.

5. ఆన్లైన్ ట్యూటర్ (online tutor)

మీరు డిగ్రీ పాసై, ఖాళీగా ఇంట్లోనే ఉంటూ, ఆన్లైన్లో వర్క్ ఫ్రం హోం వంటివాటి కోసం ట్రై చేస్తుంటే ఆన్లైన్ ట్యూటర్ బెస్ట్ జాబ్. దీంతో మీకు మంచి ఆదాయం వస్తుంది. కోవిడ్-19 (covid-19) కారణంగా అన్ని స్కూళ్లు, ట్యూషన్లు మూతపడటంతో ఆన్లైన్లో మంచి టీచర్లు బిజీగా మారారు. కాబట్టి ఆన్లైన్ క్లాసులు చెప్పండి, చేతినిండా సంపాదించండి. మీరు మొత్తం సబ్జెక్టు చెప్పకపోయినా క్లాసికల్ లిటరేచర్, వాటర్ పెయింటింగ్, కేక్ బేకింగ్, ట్రిగునామెట్రీ, ఇలా మీకు నచ్చిన కాన్సెప్టు మాత్రమే చెప్పచ్చు. సబ్జెక్టులు మాత్రమే కాదు కాన్సెప్టులు మాత్రమే చెప్పే ట్యూటర్ల కోసం వెతికే విద్యార్థులు కూడా ఉంటారు.

First published:

Tags: JOBS, Money making

ఉత్తమ కథలు