(M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18)
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) జవహార్ లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్శిటీ హైదరాబాద్ (JNTUH), తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తరపున నిర్వహించే రాష్ట్ర-స్థాయిప్రవేశ పరీక్ష. ఈ ప్రవేశ పరీక్ష B.Tech, B.Pharma అండ్ ఇతర అండర్ గ్రాడ్యుయేట్ అగ్రికల్చర్ కోర్సులలో ప్రవేశానికి ఈ పరీక్ష ఒక మంచి గేట్‌వే. అగ్రికల్చర్ అండ్ మెడికల్ఎంట్రన్స్ కోసం TSEAMCET 2022 జూలై 14 మరియు 25, 2022న నిర్వహించబడుతుంది. అభ్యర్థులు మంచి అధ్యయన ప్రణాళికను రూపొందించుకోవాలి. ఏదైనా పరీక్షను క్లియర్ చేయడానికి నిర్దిష్ట ప్రమాణాలను అనుసరించాలి. ఫిజిక్స్ నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు, ఇనార్గానిక్ కెమిస్ట్రీ నుంచి 12 నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు.
7 నుండి 9 ప్రశ్నలు అడుగుతారు కాబట్టి జనరల్ కెమిస్ట్రీ కూడా చాలా ముఖ్యమైనది. కొన్ని ముఖ్యమైన TS EAMCET ఫిజిక్స్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ప్రిపరేషన్ ప్రారంభించే ముందు TS EAMCET 2022 సిలబస్‌కు సంబంధించిన అన్ని అంశాలను అర్ధం చేసుకోండి. దీంతో పాటు మీకు అవసరమైన డేటాను అధికారిక వెబ్‌సైట్ నుంచి సేకరించండి. మార్కుల పంపిణీ, విభాగాల వారీగా మరియు ఉత్తమ అంశాలకు సంబంధించిన వివరణల డేటా సిలబస్ కాపీని ఎల్లప్పుడూ మీ వద్ద ఉంచుకోండి. మాక్ టెస్ట్‌లను ప్రయత్నించండి. విద్యార్థులు రోజూ మాక్ టెస్ట్‌ను ఫ్రాక్టిస్ చేయాలి.
మాక్ టెస్ట్‌లను పరిష్కరించడం వలన మీకు మరింత ఆత్మ విశ్వాసం లభిస్తుంది. అంతే కాకుండా ఇది ప్రశ్నను విశ్లేషించడంలో మీకు చాలా సహాయపడుతుంది. విద్యార్థులు ప్రతిరోజూ కనీసం ఒక మాక్ టెస్ట్‌ని ప్రాక్టీస్ చేయడం రోజువారీ దినచర్యగా చేసుకోవాలి. TS EAMCET ఫిజిక్స్ లో ముఖ్యమైన ప్రశ్నలు చాఫ్టర్స్ మాలిక్యులర్ స్ట్రక్చర్, సాలిడ్-స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎస్-బ్లాక్ ఎలిమెంట్స్, పి-బ్లాక్ ఎలిమెంట్స్, పాలిమర్స్ మెటలర్జీ నుండి ప్రధానంగా ప్రశ్నలు ఉంటాయి.
వీటితోపాటు ఎలిమెంట్స్, సొల్యూషన్స్, ఆర్గానిక్ పాలిమర్స్ అంశాల నుంచి ప్రధానంగా ప్రశ్నలు అడిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఆల్కలీ మరియు ఆల్కలీన్ ఎర్త్ ఎలిమెంట్స్, (s- బ్లాక్ ఎలిమెంట్స్) హాలోరేన్స్, హాలోఅల్కేన్స్ (ఆల్కైల్ హాలైడ్స్), ఆల్డిహైడ్లు, ఆల్కహాల్స్ మరియు కీటోన్స్, కార్బోహైడ్రేట్ కొలతలు, రసాయన శాస్త్రంలో మోల్ కాన్సెప్ట్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, సుగంధ సమ్మేళనాలు, ఈథర్స్, సర్ఫేస్ కెమిస్ట్రీ, ఫినాల్స్, అమినో యాసిడ్స్, అమైన్ మరియు ప్రోటీన్లు, ప్రాథమిక అంశాలు. p- బ్లాక్ ఎలిమెంట్స్ - 14, 15 మరియు 17 గ్రూప్, డి-బ్లాక్ ఎలిమెంట్స్, గ్రూప్ 13, గ్రూప్ 18 మరియు గ్రూప్ 17 . ఇలా పైన చెప్పిన భాగాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, Ts eamcet, TS EAMCET 2021