హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

English Learning Tips: ఇంగ్లిష్ లో గలగలా మాట్లాడాలని ఉందా? అయితే.. ఈ దసరా సెలవుల్లో ఇలా ట్రై చేయండి

English Learning Tips: ఇంగ్లిష్ లో గలగలా మాట్లాడాలని ఉందా? అయితే.. ఈ దసరా సెలవుల్లో ఇలా ట్రై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంగ్లిష్ నేర్చుకోవాలని సీరియస్ గా ట్రై చేస్తున్నారా? అయితే దసరా సెలవుల్లో ఈ టిప్స్ పాటించడం ద్వారా ఇంగ్లిష్ పై మరింత పట్టు పెంచుకోండి.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ఈ ఇంటర్ నెట్ యుగంలో ప్రపంచమంతా ఓ కుగ్రామంగా మారిన తరుణంలో ఇంగ్లిష్ (English Language) ప్రాధాన్యత విపరీతంగా పెరిగియింది. ఇంగ్లిష్ నేర్చుకుంటే మంచి విద్య, ఉద్యోగ (Jobs) అవకాశాలు ఉండడంతో ఈ భాషను నేర్చుకోవడానికి పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆసక్తి చూపుతున్నారు. అయితే.. ఇంగ్లిష్ అంటే భయం కారణంగా చాలా మంది నేర్చుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు. అయితే.. ఇంగ్లిష్ అంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కాస్త ఇంట్రెస్ట్ పెట్టి, ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తే ఇంగ్లిష్ ఈజీగా మాట్లాడవచ్చని చెబుతున్నారు. కోచింగ్ లేకుండానే ఇంగ్లిష్ భాషపై పట్టు పెంచుకోవచ్చని వారు వివరిస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. స్కూళ్లు, కాలేజీలకు దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు సెలవులు ప్రకటించాయి ప్రభుత్వాలు. మీరు ఇంగ్లిష్ నేర్చుకోవాలన్న (English Learning)  పట్టుదలతో ఉంటే ఈ సెలవుల్లో ఈ కింది విధంగా ఇంగ్లిష్ భాషను నేర్చుకోండి.

  పదాలు: ఎక్కువ సంఖ్యలో ఇంగ్లిష్ పదాలను నేర్చుకోవడం ద్వారా భాషపై పట్టు పెంచుకోవచ్చు. ఇందుకోసం న్యూస్ పేపర్ చూడడం, బుక్స్ చదవడం లాంటివి చేయాలి. అందులో తెలియని పదాలను గుర్తించి వాటిని డిక్షనరీ లో చూసి అర్థాన్ని తెలుసుకోవాలి. అలా నేర్చుకున్న పదాలను ఓ నోట్స్ లో రాసుకోవడం మంచి అలవాటు.

  మాట్లాడడం: చాలా మంది ఇంగ్లిష్ మాట్లాడాలంటేనే భయపడుతూ ఉంటారు. అయితే.. మాట్లాడడం ప్రయత్నించకపోతే మీరు ఎప్పటికీ పూర్తి స్థాయిలో ఇంగ్లిష్ నేర్చుకోలేరని నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో వారితో లేదా ఫ్రెండ్స్ తో భయపడకుండా ఇంగ్లిష్ లో మాట్లాడడం చేయడం ద్వారా మీలో ఇంగ్లిష్ మాట్లాడడంపై ఉన్న భయం పోతుంది.

  Online Learning Apps: విద్యార్థులకు అలర్ట్.. ఈ యాప్స్ లో అన్ని తరగతుల వారికి, ఉద్యోగాలకు బెస్ట్ కోచింగ్

  ఆన్లైన్ ట్రాన్స్ లేషన్: ఆన్లైన్లో అనేక ఇంగ్లిష్ ట్రాన్స్ లేటర్లు అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతోనూ తెలియని పదాలు లేదా వాఖ్యాల అర్థాలను సులువుగా తెలుసుకోవచ్చు.

  బాగా చదవడం: ఇంగ్లిష్ కథల పుస్తకాలు, న్యూస్ ఆర్టికల్స్ చదవడం అలవాటు చేసుకోండి. చదివే సమయంలో గట్టిగా చదవండి. తద్వారా మీకు ఇంగ్లిష్ మాట్లాడడం అలవాటు అవుతుంది.

  సినిమాలు చూడండి: చాలా మంది ఇంగ్లిష్ సినిమాలు అనగానే మనకేం అర్థం అవుతుందిలే అన్న భావనతో చూడడం మానేస్తూ ఉంటారు. అయితే.. అలా కాకుండా అర్థం అయినా లేదా కాకపోయినా ఇంగ్లిష్ సినిమాలను చూడడం ప్రారంభించండి. వాళ్లు ఎలా మాట్లాడుతున్నారో గమనించండి. ఇంకా ఇంగ్లిష్ ఛానల్స్ లో ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చూడండి. మీకు వార్తలపై ఆసక్తి ఉంటే ఇంగ్లిష్ ఛానల్స్ లోని న్యూస్ డిబేట్లను కూడా చూడొచ్చు.

  యూట్యూబ్: యూట్యూబ్ లో లక్షల కొద్దీ ఇంగ్లిష్ క్లాసులు అందుబాటులో ఉంటాయి. రోజుకో గంట వరకు ఆ క్లాసులను కూడా చూడొచ్చు.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, Career tips, Dussehra 2022, English medium

  ఉత్తమ కథలు