హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..

IBPS Reasoning Tips: బ్యాంక్ పరీక్షలో స్కోరింగ్ టాపిక్ ‘రీజనింగ్’.. తక్కువ సమయంలో ఎలా చేయాలో తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రీజనింగ్ లో ముందుగా మనము రీజనింగ్ ఎబిలిటీ గురించి తెలుసుకోవాలి. ఎనభై శాతం సీటింగ్ ఆరెంజిమెంట్స్, పజ్జిల్స్ చదువుకుంటే రీజనింగ్ లో బాగా స్కోరింగ్ చేయొచ్చని తిరుపతి పేస్ ఇనిస్టిట్యూట్ డేరెక్టర్ నిరంజన్ విద్యార్థులకు సూచించారు. ఆ వివరాలను ఇలా..

ఇంకా చదవండి ...

  (GT Hemant Kumar, News18, Tirupati)

  బ్యాంక్ పరీక్ష రిజనింగ్ లో (Bank Exam Reasoning) ముందుగా మనము రీజనింగ్ ఎబిలిటీ(Ability) గురించి తెలుసుకోవాలి. ఎనభై శాతం సీటింగ్ ఆరెంజిమెంట్స్(Seating Arrangements), పజ్జిల్స్(Puzzles) చదువుకుంటే రీజనింగ్ లో స్కోరింగ్ బాగా వస్తుంది. దీనితో పాటు ఇనిక్వాలిటిస్(Inequalities) కూడా ముఖ్యమైనవి. ఇక శిలాజిజమ్స్(Syllogism)., ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్స్ ని ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంది. ఒక్కో టాపిక్ గురించి ఇక్కడ తెలుసుకోండి.  నంబర్ సిరీస్: నంబర్ సిరీస్ రెండు విధాలుగా ఉంటాయి. కొన్ని  నంబర్లు ఇచ్చి దానికి క్వశన్ మార్క్ (?) ఇవ్వడం జరుగుతుంది. ఈ సీక్వెన్స్ లో ఆరవ నుంబర్ ఏమి వస్తుందని అడుగుతారు. లేదా ఆరు నెంబర్ లు ఇచ్చి రెండవ నెంబర్ వద్దే క్వశన్ మార్క్(?) ఇచ్చే అవకాశం ఉంది. పూర్తి నంబర్ సిరీస్ ఇచ్చేసి అందులో రాంగ్ నెంబర్ ఏంటని అడుగుతారు.

  SI Prelims Preparation: ఎస్ఐ ప్రిలిమ్స్ లో నెగెటివ్ మార్కులు ఉన్నా.. ఇలా ప్రపేర్ అయితే అర్హత సాధించొచ్చు..


  రాంగ్ నంబర్ ను ఐడెంటిఫై చేయాలి..., మిస్సింగ్ నుంబర్ ను కనుకోవాలి. ఈ నంబర్ సిరీస్ ను స్క్వయర్ నంబర్., క్యూబ్ నంబెర్స్., ప్రైమ్ నంబర్స్ మీద గ్రిప్ పెంచుకోవాలి. నెంబర్ సిరీస్ లోనే లేటర్ సిరీస్ ఉంటుంది. ఇది కూడా నెంబర్ సిరీస్ ను పోలి ఉంటుంది. అన్ని లేటర్ లకు నంబరింగ్ వేసుకోవాలి.... కన్సోనెంట్స్., ఓవెల్స్ ఏంటో తెలుసుకొవలి. ఇలా ఈజీ మెథడ్ లో మనం నుంబర్ సిరీస్ నేర్చుకోవచ్చు. ఇక వీటిని నేరచకుంటే అనాలజీ చాల ఈజీగా ఉంటుంది.

  ఇనిక్వాలిటీస్: ఇనిక్వాలిటీస్ ప్రశ్న చూసిన వెంటనే బదులు రాసేలా ప్రిపేర్ అవ్వాలి. మనం ఇనిక్వాలిటీస్ ని నేర్చుకోవాలంటే వివిధ రకాల సాధనాలు ఉన్నాయి. మనం ఎంచుకొనే మార్గం ద్వారానే సులభంగా సాల్వ్ చేసేధై ఉండాలి.

  శిలాజిజమ్స్: శిలాజిజమ్స్ నేర్చుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వెన్ డైయాగ్రమ్ ద్వారా చేయవచ్చు. రెండవది వివిధ రకాల ఫార్ములా ద్వారా చేయవచ్చు. రెండు మెథడ్ లోను సమాధానాలు త్వరగా సాల్వ్ చేయవచ్చు. అయితే పరీక్షా సమయంలో ఫార్ములాస్ గుర్తు రాకపోవచ్చు. అదే వెన్ డైయాగ్రమ్ అయితే మనకు గుర్తు ఉండిపోతుంది.

  Singareni Vacancies: గుడ్ న్యూస్.. సింగరేణిలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ జారీ.. 1300 పోస్టులు ఖాళీ..


  బ్లడ్ రిలేషన్: ఒక పేరాగ్రాఫ్ ఇచ్చి దాని పజిల్ రూపంలో ఇస్తాడు. ఇందులో మూడు ప్రశ్నలు ఉంటాయి. వీటిని చదువుతున్న సమయంలోనే సమాధానం పసిగట్టాలి.

  కోడింగ్ అండ్ డీకోడింగ్: ఒక సెంటెన్స్ ఇస్తారు...ఒక్కో వర్డ్ కి ఒక్కో కోడింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా నాలుగు పదాలు ఇస్తారు. అందులో కామన్ గా ఉన్న పదాల ఆధారంగా కోడింగ్ డీకోడింగ్ చేయాల్సి ఉంటుంది.

  Published by:Veera Babu
  First published:

  Tags: Career and Courses, Clerk, IBPS, JOBS, Preparation

  ఉత్తమ కథలు