• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • FOLLOW THESE STEPS FOR TO CHECK EPF BALANCE WITHOUT UAN NS GH

EPF Balance Without UAN: యూఏఎన్​ నంబర్​ లేకున్నా మీ పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్​ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

EPF Balance Without UAN: యూఏఎన్​ నంబర్​ లేకున్నా మీ పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్​ చేసుకోవచ్చు.. ఎలాగంటే?

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటి వరకు ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే UAN నంబర్​ తప్పనిసరిగా అవసరం ఉండేది. కానీ, ఇక నుండి యూనివర్సల్​ అకౌంట్​ నంబర్​ (UAN)​ లేకుండానే బ్యాలెన్స్​ చెక్​ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది.

  • Share this:
పీఎఫ్​ పెట్టుబడులను మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవలి కాలంలో, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపిఎఫ్ఓ) పలు సవరణలు చేస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా, ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ను చెక్​ చేసుకునేందుకు ఈపిఎఫ్ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే UAN నంబర్​ తప్పనిసరిగా అవసరం ఉండేది. కానీ, ఇక నుండి యూనివర్సల్​ అకౌంట్​ నంబర్​ (UAN)​ లేకుండానే బ్యాలెన్స్​ చెక్​ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. తద్వారా మీ UAN నెంబర్​ మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ‌దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే​ UAN పోర్టల్‌లో రిజిస్టర్​ చేసుకొని ఉండాలి. అంతేకాక, మీ KYC వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఈ క్రింది ప్రక్రియ ఫాలో అవ్వండి.

UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్​ చేసుకోవాలి..
స్టెప్​ 1: ఈపీఎఫ్​ఓ హోమ్​ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి
స్టెప్​ 2: మీ ఈపిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్​ హియర్​ టు నో యువర్​ పీఎఫ్​ బ్యాలెన్స్​’ పై క్లిక్ చేయండి.
స్టెప్​ 3: వెంటనే epfoservices.in/epfo/ పేజ్​ ఓపెన్​ అవుతుంది. అక్కడ “మెంబర్​ బ్యాలెన్స్​ ఇన్ఫర్మేషన్​”ను ఎంచుకోండి.
స్టెప్​ 4: అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్​ కార్యాలయం, కోడ్​, పీఎఫ్​ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్​ 5:'సబ్​మిట్​’ చేసే ముందు‘ ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి.
స్టెప్​ 6: అప్పుడు మీ స్క్రీన్​పై ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

కాగా, ఈ ప్రక్రియతోనే కాకుండా passbook.epfindia.gov.in వెబ్​సైట్​లోకి లాగిన్ అవ్వడం ద్వారా కూడా మీ యుఎఎన్ నంబర్ లేకుండానే ఈపిఎఫ్ బ్యాలెన్స్​ను చెక్​ చేసుకోవచ్చు.

UAN నంబర్​తో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..
ఈపిఎఫ్ఓ చందాదారుడికి UAN నంబర్​ ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్​ చేసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్​ఎమ్​ఎస్​ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు పిఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పంపిస్తుంది ఈపీఎఫ్​ఓ సంస్థ.
Published by:Nikhil Kumar S
First published: