హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Salary Hike Tips: జీతం మరింతగా పెరగాలా? మరిన్ని ప్రమోషన్లు కావాలా? అయితే.. ఈ టిప్స్ పాటించండి

Salary Hike Tips: జీతం మరింతగా పెరగాలా? మరిన్ని ప్రమోషన్లు కావాలా? అయితే.. ఈ టిప్స్ పాటించండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ అభివృద్ధిని కోరుకుంటారు. ఎప్పటికప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తూ ఉంటారు. ఇందుకోసం కెరీర్ జర్నీలో ప్రతీ మలుపులో సరైన నిర్ణయం సరైన మార్గంలో తీసుకోవడం చాలా ముఖ్యం.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ తమ అభివృద్ధిని కోరుకుంటారు. ఎప్పటికప్పుడూ ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తూ ఉంటారు. ఇందుకోసం కెరీర్ (Career) జర్నీలో ప్రతీ మలుపులో సరైన నిర్ణయం సరైన మార్గంలో తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన ప్రణాళిక, సానుకూల దృక్పథంతో ఎవరైనా తమ గమ్యాన్ని సులభంగా చేరుకోగలరు. ఈ రోజుల్లో కెరీర్ ఆకాశాన్ని తాకాలని అందరూ కోరుకుంటున్నారు. దీని కోసం హార్డ్ వర్క్ మరియు డెడికేషన్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడే కెరీర్‌లో మీరు కలలుగన్న ఆ స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. మీరు మంచి కెరీర్‌ను సంపాదించుకోవాలంటే, మీరు ఉద్యోగ నిర్వహణలో (Jobs) కష్టపడడంతో పాటు అంకితభావంతో పని చేయాలి. ఈ చిట్కాలను (Career TIPS ) అనుసరిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

  కమ్యూనికేషన్ స్కిల్స్

  ఏ వ్యక్తి అయినా గొప్ప వృత్తిని కోరుకుంటే, భవిష్యత్తులో వారికి అన్ని విధాలుగా సహాయం చేసే చాలా మంది వ్యక్తులతో వారి పరిచయాలను ఏర్పరచుకోవాలి. ఈ పరిచయాలను ఏర్పరచుకోవడానికి అత్యంత ముఖ్యమైన విషయం కమ్యూనికేషన్ స్కిల్స్. ఏదైనా అభ్యర్థికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే వారు ఎవరితోనైనా చాలా త్వరగా కలిసిపోతారు. మెరుగైన ఎంపికల వైపు వెళ్లేందుకు మిమ్మల్ని అన్ని విధాలుగా ప్రేరేపింపజేసే వ్యక్తుల మధ్య మీ సర్కిల్‌ను రూపొందించుకోండి.

  Career Wise: పబ్లిక్ రిలేషన్స్ విభాగానికి మంచి డిమాండ్.. ఈ రంగంలో కెరీర్ ఇలా ప్రారంభించండి!

  కొత్త నైపుణ్యాలతో అప్‌డేట్ కావడం

  నేటి మల్టీ నేషనల్ కంపెనీల యుగంలో, అనేక కెరీర్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ అభ్యర్థి నేటి కాలంలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతిరోజూ కొత్త కెరీర్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. దీంతో పాటు, పాత కెరీర్ ఎంపికలో ప్రజలకు కొత్త నైపుణ్యాలు అవసరం. ప్రతీ అభ్యర్థి అవసరానికి అనుగుణంగా కొన్ని కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే, కార్యాలయంలో అతని డిపెండెన్సీ పెరుగుతుంది. దీంతో అతనికి సాధారణంగా ప్రమోషన్స్ లభిస్తాయి. తగిన గుర్తింపు సైతం లభిస్తుంది.

  టెక్నాలజీలో నైపుణ్యం

  నేటి ఆధునిక యుగంలో.. చాలా విషయాలు సాంకేతికతపై ఆధారపడి ఉంటాయి. ఆఫీసు పనిలో ఉత్పాదకతను పెంచడానికి కంపెనీలు హైటెక్ పరికరాలు మరియు కొత్త అప్లికేషన్లను ఉపయోగిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, సాంకేతికతలో రోజువారీ మార్పులకు అనుగుణంగా మిమ్మల్ని మీరు అప్టేడ్ గా ఉంచుకోవాలి. మీ కార్యాలయాల్లో వినియోగించే అన్ని టెక్నాలజీలపై సాధ్యమైనంత ఎక్కువగా అవగాహన పెంచుకోవాలి.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Career and Courses, JOBS, Private Jobs, Salary Hike

  ఉత్తమ కథలు